10, మే 2012, గురువారం

శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'

అనుకున్నాను
అధర సౌందర్యం చూచి 
ఆడంబరం ఆహార్యం చూచి
నీ బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అని

హరివిల్లు రంగుల్ని
వలువలుగా చుట్టుకున్న నువ్వు
మరు నిముషంలో
మటుమాయం ఔతావని

అయితే అన్నన్నా  !!..
నీ భాగ్య మేమని వర్ణించను
ఎన్ని లావణ్యాల్ని స్పృశిస్తావో
ఎన్ని మాలిన్యాలు నిర్ములిస్తావో
ఎన్ని కాంతి కేరింతలని మోసుకోస్తావో
ఎంతహాయి వెల్లువని తరలించు కోస్తావో

అరిగి పోయి కరిగిపోయి తరిగిపోయి
నివురై ఆవిరై కనుమరుగై పోతావు

ఒక్క క్షణమైతే నేమి
వెన్నెల ముద్దగా వెలిగి
ఒక్క నిముసమైతే నేమి
వన్నెల వాకిళ్ళు కలయ తిరిగి
వేయి వసంతాల సోయగాన్ని
 సొంతం చేసికొన్న సౌగంధికావనమా !
నీ జీవన రాగానికి   జేజేలు
నీ అసమాన త్యాగానికి  జోహారు

8 కామెంట్‌లు:

  1. శ్రీ శ్రీ గారు వ్రాసిన కవితల్లో ప్రముఖ పాదాలపై అల్లిన మీ కవితలు బాగున్నాయండీ!

    రిప్లయితొలగించండి
  2. sir, kavita andanni kadu ardaanni kuda manam aaswadinchela undaali me kavitalo niguudamaina bavam kontha ibbandini kaliginchedila undi. meeru sri sri gari sabbu billa anatam bhavyam kademo

    రిప్లయితొలగించండి
  3. ఫాతిమా గారు
    మీ స్పందనకు ధన్యవాదములు
    'కాదేది కవిత కనర్హం ' అన్నారు శ్రీ శ్రీ . కవి అయినవాడు ఏ వస్తువు పైనయినా కవితరాయ గలిగి ఉండాలి
    అది ఆమహా కవి ఉద్దేశం ఔనౌను శిల్ప మనర్ఘ్యం అన్నారు ఆయనే
    నేను భావ కవిని గీత రచయితను అందుకే నా రచనలలో ఆ భావనలు భావ కవితా ధోరణులు సహజంగానే ఉంటాయి
    శ్రీ శ్రీ సైతం మును ముందు భాకవిత్వం ప్రేమించిన వాడే తర్వాత విప్లవ కవిగా మారాడు
    శ్రీ శ్రీ గారి దారిలో పయనించా నే తప్ప ఇతరం కాదు నా కవితలన్నీ చదువుతారని ఆశిస్తూ
    మీ కవితాభిలాషకు మరొక్కసారి అభినందిస్తూ ...

    రిప్లయితొలగించండి
  4. రసజ్న గారు
    జలతారు వెన్నెల గారు
    మీరు నాప్రతి కవిత చదివి ప్రోత్సాహం అందిస్తున్నారు
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. వేయి వసంతాల సోయగాన్ని
    సొంతం చేసికొన్న సౌగంధికావనమా !

    భావ కవితా విభ్రమము మీ కవిత.

    రిప్లయితొలగించండి
  6. ఫాతిమా గారు
    అజ్ఞాత గారు
    మీ సద్విమర్శకు కృతజ్ఞతలు
    మీ సూచనలు స్వికరించాను
    తదనుగుణంగా నా కవితను సరిదిద్దాను
    మీ సహృదయానికి నా అభివాదములు సమర్పించుకొంటు
    సదా మీ స్పందనలు కోరుకొంటున్నాను

    రిప్లయితొలగించండి
  7. Sir,
    విమర్శను అన్యాదా భావించకుండా సహృదయంతో స్వీకరించినదుకు చాలా ధన్యవాదాలు. మీ నుంచి ఇంకా ఎన్నో ఉత్తమ కవితలను ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి