గజల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గజల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జూన్ 2018, శుక్రవారం

పెరటిలో ఒక చెట్టునైనా పెంచుకోవాలని ఎవరికీ అనిపించదు
ప్రాంగణంలోనే కాదు జీవితాలలోను పచ్చదనం కనిపించదు
ప్రేమ అనురాగం మరచి తడారి పోయిన హృదయాలను
అరుదెంచిన నవవసంతం హరితవనం మురిపించదు
ఆర్ద్రత ఇగిరి పోయిన ఈ మనిషితో ఏమి పని ఉందని
నీలాకాశం లో నడిచిపోతున్న ఏ మేఘమూ వర్షించదు
అమానవీయ చర్యలతో ప్రతి ఒకడు చెలరేగి పోతున్నా
ఇదేమని ఏ మంచి హృదయము నిలదీయదు గర్హించదు
ఎండ చండ ప్రచండంగా అవనిని మండిస్తున్నా కృష్ణా
ఈ మర మనిషి గుండెలో ఏ మంచి ఆలోచన వికసించదు

21, ఏప్రిల్ 2018, శనివారం

ఎవరి గుండెను మీటినా ఒకటే రాగం వినిపిస్తోంది
ఎవరి ఎదను కదిపినా ఒకటే శోకం కనిపిస్తోంది
నడక దారిలో ఎందరు మనుషులు ఎదురయ్యారో
అందరిలో ఒకటే దావానల దాహం అగుపిస్తోంది
ఎంత చదివినా ఎన్ని నేర్చినా ఏమున్నది ఘనత
ఎక్కడ చూచినా దానవ సమూహం అనిపిస్తోంది
ప్రేమానురాగాలు మమతానుబంధాలు కరువై
లోకం అంతటా ఆటవిక రాజ్యం తలపిస్తోంది
ఇన్ని దారుణాలు మారణాలు మోయలేక
మరో దారి కానరాక ధరణి భోరున విలపిస్తోంది
ఎన్ని చెప్పినా ఎంత వగచినా ఏమున్నది కృష్ణా
ప్రతి మనిషిని లోభం స్వార్ధం తెగ బులిపిస్తోంది

18, జనవరి 2018, గురువారం

కను ముక్కు తీరు చూడ చక్కన
చెక్కినాడేమో అమరశిల్పి జక్కన
రంభా ఊర్వశి తిలోత్తమలైనా
పోటిగా నిలబడగలరా తన పక్కన
ఆమె ఒయ్యారంగా చూచిన వేళ
తన పెదవిపై ఆ నవ్వు ఎంతో చిక్కన
ఇన్ని సోయగాలు సొంతం చేసుకున్న
ఆమె అందం అభివర్ణించలేడేమో తిక్కన
ఎంత కాలం ఎంత ఎంత తపసు చేసినా
ఆమె కరుణా కటాక్షం ఎవరికైనా దక్కునా
ఆమె చుట్టూ తిరుగుతు ఉంటె కృష్ణా
నలుగురు నవ్విపోదురేమో పక్కున
మనసు అడిగింది ఎలా ఉన్నావని
రాత్రి ఎన్ని స్వప్నాలు కన్నావని
నిదుర రాని నిసిరాతిరి వేళలో
ఆదమరచి ఎన్ని వూసులు విన్నావని
ఎన్నెన్ని రమ్య సౌందర్య రహస్యాలు
కను రెప్పల మాటున దాచుకున్నావని
నడిరేయి ఒడిలో చేరి అలరించిన
అన్ని అందాలు ఏం చేసుకున్నావని
చెలి చిందించిన మందహాసాలు
ఎన్ని రాసులుగా పోసుకున్నావని
కాలం అడుగుతున్నది అందమైన ఈ రేయి
ఎన్ని కవితలు కావ్యాలు రాసుకున్నావని

30, అక్టోబర్ 2017, సోమవారం

నీ చిరు నవ్వు కోసం వెన్నెల వేచి ఉన్నది
నీ కర స్పర్శ కోసం మల్లియ కాచుకున్నది
నీ పెదాలు దాటిన పదాల సోయగాలు చూచి
కొమ్మల్లో కోయిల గొంతు శృతి చేసుకున్నది
ఎంతగా ఎదురు చూచిందో అర్రులు సాచిందో
నీ చెంపల అందాన్ని చామంతి కోరుకున్నది
అటుఇటు ఊగే నీ నడుము హొయలు చూచి
నర్తించే నెమలి తన నడకను సరిచేసు కున్నది
నీలి నయనాలలో చల్లని చూపుల జిగి చూచి
వీచే మలయానిలం తన గతి మార్చుకున్నది
నీ మెత్తని నవ్వుల మార్దవం తన్మయం గాంచి
అచ్చెరువందిన ప్రక్రుతి ప్రణయం నేర్చుకున్నది
కను ముక్కు తీరు చూడ చక్కన
చెక్కినాడేమో అమరశిల్పి జక్కన
రంభా ఊర్వశి తిలోత్తమలైనా
పోటిగా నిలబడగలరా తన పక్కన
ఆమె ఒయ్యారంగా చూచిన వేళ
తన పెదవిపై ఆ నవ్వు ఎంతో చిక్కన
ఇన్ని సోయగాలు సొంతం చేసుకున్న
ఆమె అందం అభివర్ణించ లేడేమో తిక్కన
ఎంత కాలం ఎంత ఎంత తపసు చేసినా
ఆమె కరుణా కటాక్షం ఎవరికైనా దక్కునా
ఆమె చుట్టూ ఇలా తిరుగుతు ఉంటె కృష్ణా
నలుగురు నవ్విపోదురేమో పక్కున
మనసు అడిగింది ఎలా ఉన్నావని
రాతిరి ఎన్ని స్వప్నాలు కన్నావని
నిదుర రాని నిసిరాతిరి వేళలో
ఆదమరచి ఎన్ని వూసులు విన్నావని
ఎన్నెన్ని రంగు రంగుల స్వప్నాలు
కను రెప్పల మాటున దాచుకున్నావని
నడిరేయి ఒడిలో చేరి అలరించిన
అన్ని అందాలు ఏం చేసుకున్నావని
చెలి చిందించిన మందహాసాలు
ఎన్ని రాసులుగా పోసుకున్నావని
కాలం అడుగుతున్నది అందమైన రేయి
ఎన్ని కవితలు కావ్యాలు రాసుకున్నావని
ఎందుకో ఈ మనిషి నిండుగా నవ్వడం లేదు
అందుకే ఏ మనిషి నాకు నచ్చడం లేదు
తన జీవితం అద్భుతమని ఆ దైవం ఇచ్చిన
అరుదైన అవకాశమని ఎవరు భావించడం లేదు
ఏమైందో ఏమో ఏ బాధలు వెంటాడుతున్నాయో
ఎదుటపడి ఎవరూ ధైర్యంగా మాటాడడం లేదు
తప్పు చేసినట్టు తక్కుతూ తారుతూ వున్నారే తప్ప
ఏ ఒక్కరు నిటారుగా నిర్భయంగా నడవడం లేదు
తాను నడిచే దారి మంచిది కాదని ఎంత చెప్పినా
అరిచి గీ పెట్టినా ఎవరు కొంచెమైనా మారడం లేదు
ఎన్ని నీతి శతకాలు ఎన్ని సుభాషితాలు ప్రవచనాలు
ఏకరవు పెట్టినా ఏ ఒక్కటి తన చెవి కెక్కడం లేదు
ఈ దేశం నీ కేమిచ్చిందని నీ ప్రశ్న
దేశానికి నువ్వేం చేశావని నా ప్రశ్న
ఏదో ఒక పరమార్ధం ఆశించి ఆ దైవం నిన్ను
ఈ ఇలకు పంపితే నువ్వు ఏం చేశావని నా ప్రశ్న
జీవితం మున్నాళ్ళ ముచ్చట కదా మూడు తరాలకు
సరిపడా ఎందుకు మూట కడుతున్నావని నా ప్రశ్న
ఎప్పుడు ఎక్కడ ఎవరికీ చెప్పకుండా ఎగిరిపోతావో ఏమో
గుండెకు ముప్పు ఎందుకు తెచ్చుకొంటున్నావని నా ప్రశ్న
హాయిగా జీవించడం మాని నిర్భయంగా బ్రతకడం మాని
ఇలా కుప్పిగంతు లెందుకు వేస్తున్నావని అందరి ప్రశ్న
అపురూపంగా లభించిన అరుదైన ఈ మానవ జన్మను
అమాయకంగా వృధా చేసుకొంటున్నావని చివరి ప్రశ్న
పెరటిలో ఒక చెట్టునైనా పెంచుకోవాలని ఎవరికీ అనిపించదు
ప్రాంగణంలోనే కాదు జీవితాలలోను పచ్చదనం కనిపించదు
ప్రేమ అనురాగం మరచి తడారి పోయిన హృదయాలను
అరుదెంచిన నవవసంతం హరితవనం మురిపించదు
ఆర్ద్రత ఇగిరి పోయిన ఈ మనిషితో ఏమి పని ఉందని
నీలాకాశం లో నడిచిపోతున్న ఏ మేఘమూ వర్షించదు
అమానవీయ చర్యలతో ప్రతి ఒకడు చెలరేగి పోతున్నా
ఇదేమని ఏ మంచి హృదయము నిలదీయదు గర్హించదు
ఎండ చండ ప్రచండంగా అవనిని మండిస్తున్నా కృష్ణా
ఈ మర మనిషి గుండెలో ఏ మంచి ఆలోచన వికసించదు
ఈ వేళ నా ఎదుట నిలిచింది ఓ సోయగం
మనసార నను వలచి తానయింది నాలో సగం
కట్టెదుట ఆమె నిండుగా హాయిగా తీయగా
కనిపించని నాడు ప్రతి క్షణం నాకో యుగం
ఆదమరచి నన్ను అక్కున చేర్చుకున్న
ఆమె గాఢ పరిష్వంగమే నా పేరోలగం
నన్ను నన్నుగా మిన్నగా నిండుగా
ప్రేమించిన హృదయమే హిమవన్నగం
ఆమె మృదు మధురంగా పెదవిని కదిపి
పలికిన ప్రతి మాట నాకు నిగమాగమం
నాకోసం ఆమె ఎలుగెత్తి పాడిన ప్రతి పాట
అవధి లేని మధుర స్వరగంగా తరంగం
ఆమె అధరం మీద ఒక ప్రేమ కవిత రాశాను
ఎర్రని పెదవిని అదిమి ఒక సంతకం చేశాను
ఆమె చిలిపి నవ్వుని రహస్యంగా ఒడిసి పట్టి
ఒక అజరామరమైన దీర్ఘ కవితగా మలిచాను
ఆమె నా ఎదలో దూరి ఏదో చెప్పబోతుంటే
మాటాడ వద్దని చిగురు పెదవిని మూశాను
నా తన్మయత్వం గాంచి సమ్మోహనంగా నవ్వుతుంటే
ఆ నవ్వు మొలిచిన చోట ఒక చిలిపి ముద్ర వేశాను
చాటుమాటుగా మేలిముసుగు సవరించు కొంటుంటే
అణువణువునా అతిలోక సౌందర్యం చూశాను
మరీ మరీ అడిగితె ఏమని చెప్పను కృష్ణా
ఆమె నాదనే నిజాన్ని బ్రతుకంతా మోశాను
ఆమె నుదుట అలదిన సిందూర చందనం
అమృతమూర్తి ఆమెకిదే నా అభివందనం
ఆమె హృదయంలో అనంత రాగాలు ఎన్నో
ఆమె కొలువున్న ప్రాంగణం నవనందనం
ఆమె గలగలమని నిండుగా నవ్వుతుంటే
జగతిలోని ప్రతి అణువు కడు సుందరం
ప్రేమ ప్రణయం అనురాగం రంగరించుకున్న
ఆమె మనసే ఒక అందమైన మందిరం
ఒక అతిలోక రహస్యం చెప్పనా ఆమె
అపురూపమైన సృష్టే కదా మనమందరం
అనురాగమయి ఆమె తోడు లేకుంటే కృష్ణా
మగవాని జీవితం అంధకార బంధురం
ఎందుకో మరి ఎంతో ఇష్టం నాకు ఈ ఏకాంతం
ఎందుకంటే ఏమి చెప్పను, ఆమె నా సొంతం
ఎవరికీ కానరాకున్నా ఎప్పుడు వెంట లేకున్నా
ప్రియమైన ఆమెతోనే నా ప్రయాణం జీవితాంతం
అదేమిటో ఆమె ఒక క్షణమైనా కనిపించకుంటే
నన్ను కవ్వించకుంటే అది నాకు యుగాంతం
ఆమె అందం గురించి వివరాలడుగుతున్నారా
ఏమని చెప్పను! ఆ సోయగం విరిసిన లతాంతం
ఒక నిజం చెప్పనా, అసలు రహస్యం తెలుపనా
ఆమె తోడుంటే తరలి వచ్చును నిత్య వసంతం
తరచి తరచి అడిగినా ఇంకేమి చెప్పను కృష్ణా
ఎంత చెప్పినా తరగనిది మా ప్రేమ వృత్తాంతం
అసలు ఎంతకావాలో ఎవరికీ తెలియదు
దానిని ఏం చేసుకోవాలో ఎంతకీ తట్టదు
నిద్ర లేచిన దగ్గరనుంచి పరుగు పందెంలో
ఎవరికీ మంచి ఆలోచన అనేది పుట్టదు
ఈ మనిషి ఎంతగా పతనమై పోతున్నా
బిక్కమొహం వేసుకొన్నఈ దేశం తిట్టదు
ఇంత అన్యాయం అక్రమం దుర్మార్గం
కట్టెదుట కనబడుతున్నా ఎవరికీ పట్టదు
ఈ వికృత విన్యాసాన్ని అరికట్టడానికి
ఏ మంచి హృదయం శ్రీకారం చుట్టదు
ఈ అరాచకం కళ్ళప్పగించి చూస్తుందే గాని
దురాగతానికి ఏ ప్రభుత్వమూ అడ్డుకట్ట కట్టదు
నీ కంటి రెప్ప కింద నా ఈ కాపురం బాగుంది
కమ్మని నీ వలపు, గుడి గోపురం లా ఉంది
నులి వెచ్చని నీ ఊపిరి నాదస్వరం లా ఉంది
నను వలచిన ఈ సిరి మధుఝంకారం లా ఉంది
నను దాచిన నయనం వెన్నెల భువనం లా ఉంది
నీ అల్లరి హృదయం ప్రణయ కవనం లా ఉంది
నిలువెత్తు నీ రూపం కర్పూర దీపం లా ఉంది
కవ్వించే నీ పరువం రతీదేవి రూపం లా ఉంది
వేయేల నా జీవితం మలయమారుతం లాఉంది
అనాదిగా నన్ను నడిపిస్తున్న అక్షరానికి నమస్కారం
అక్షరానికి వూపిరులూదుతున్న కలానికి నమస్కారం
రేయిం బవళ్ళు ఎదలో దూరి ఊపిరాడ నీయక
ఉక్కిరి బికిరి చేస్తున్న అందానికి నమస్కారం
చిన్ననాటి నుంచే నన్ను ఇలాగే ఉండమని
తీర్చిదిద్దిన నాన్నగారి సంస్కారానికి నమస్కారం
ఎంతకాలం నుంచో నన్నంటి పెట్టుకొని ఉన్న
ఎనలేని సంత్రుప్తికి ఈ సంపత్తికి నమస్కారం
ఏ ప్రలోభాలకు తల ఒగ్గకుండా జాగ్రత్తగా
నను మలచిన నా హృదయానికి నమస్కారం
ఏ ఒడిదుడుకులు బడబానలనాలు లేకుండా
నన్ను నడిపిస్తున్న కాలానికి నమస్కారం
‘క’నిపించని వాడిని ‘వి’నిపించని వాడిని ‘కవి’ అన్నారు
‘రవి గాంచనిచో కవి గాంచు నెయ్యెడన్ ‘ అని అన్నారు
అది నిజమేనేమో కాని పాపం! ఎంతో కష్టపడి రాసిన
అతని కవిత్వాన్ని తీరిగ్గా ఎవరు చెవియొగ్గి విన్నారు
అతని గుండెగోడు వింటే మనసు వుంటే ఎలుగెత్తకుండా
అన్యాయంపై తిరగబడ కుండా ఎందుకు మిన్నకున్నారు
నిజం చెప్పాలంటే మాయామర్మం ఆరబోసిన ఆ విచిత్ర
కవిత్వం అర్ధంకాక జనం తలలు బాదుకొంటున్నారు
కవులేమో తాము రాసినది జనం మీదకి విసిరేసి
పాఠకులు తమ దాకా ఎదగాలని కోరుకొంటు న్నారు
ఇప్పటికయినా అర్ధమయింది కదా కవివర్యా
అందుకే అర్ధం కాని దేదైనా సరే వ్యర్ధం అన్నారు
కలల బరువుకు రెప్ప వాలి పోతానంటున్నది
కనులు మూ స్తే రేయి కరిగి పోతానంటున్నది
ఎదలోయలలో ఒక వూహ ఉక్కిరిబిక్కిరి చేస్తే
కప్పుకున్న పయ్యెద జారిపోతానంటున్నది
ఎంతకీ రాని అతని కోసం రేయంతా వేచి వేచి
తనువు సాలభంజికలా మారిపోతానంటున్నది
పరువంతో విరహంతో విసిగి వేసారిన మనసు
పూలతో పరిమళాల తో చేరిపోతానంటున్నది
అతని పదధ్వని విని అల్లంత దూరాన ఎదురేగి
పాదాలను నడిపించే రాదారి నౌతానంటున్నది
ఒక్క సారి ఎదురైతే చాలు తనువు పరవశంతొ
అతని నిండు ఎదలో దూరిపోతానంటున్నది
నా మనసెప్పుడూ పాటలు పాడుకొంటూ ఉంటుంది
అక్షరాలతో పదాలతో సయ్యాటలాడుకొంటూ ఉంటుంది
రేయింబవళ్ళు నిర్విరామంగా ఒక అరుణాధరం మీద
కాలాలకు చెరిగిపోని సంతకం చేస్తూ ఉంటుంది
లోకంలో జరుగుతున్న అన్యాయం అక్రమం గురించి
ఒక కావ్యం వ్రాసి అఖిల జనావళికి అంకితం చేస్తూ ఉంటుంది
విపరీతమైన వేదనలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు
ఒక పాటను పట్టుకొని హాయిగా ప్రయాణిస్తూ ఉంటుంది
మనసుకి హృదయానికి సంఘర్షణ జరిగినప్పుడు
ఒక దీర్ఘ కావ్యానికి శ్రీకారం చుడుతూ ఉంటుంది
అందమైన ఊహలలో విహరిస్తూ ఆనంద విహంగాలు ఎగరేస్తూ
మనసు మలినం కాకుండా తనను తాను కాపాడుకొంటూ ఉంటుంది