స్వగతం

ఎర్రన జన్మించిన నేల పైన పుట్టాను .
జవహర్ భారతి కావలిలో కావ్యాలకు తోలి అడుగులు నేర్చుకొన్నాను .
ప్రకాశం జిలా రచయితల సంఘం ఆవిర్భావ సమయాన కవినై సాహితి లోకాన కాలు మోపాను.
ప్రస్తుతం సంఘ కోశాధికారిగా కొనసాగుతున్నాను
వృత్తి న్యాయమూర్తిగా, ప్రవృత్తి కవిగా, గీత రచయితగా కాలం కదిలి పోతున్నది
నా కావ్యాలపై నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం ఫిల్ (బాల కృష్ణా రెడ్డి గేయ కవితలలో ప్రణయ తత్త్వం )
సిద్దాంత వ్యాసం సమర్పించ బడింది
ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఈ మాసపు పాటలుగా నా గీతాలు ప్రసారం చేయబడినాయి
తెలుగులో తీర్పులు ఇచ్చి తెలుగునాట పదిమంది న్యాయ మూర్తులలో ఒకడినైనాను
మనసును ప్రక్షాళనం చేసి మనిషిని ప్రభావితం చేయాలని నా సంకల్పం


మానవతను నెలకొల్పాలని నాధ్యేయం


అదే నా కవితా కావ్యాల గమ్యం