30, జనవరి 2018, మంగళవారం

అందరూ
దీపాలు వెలిగించుకొనే వేళ
నేను
నీ రూపాన్ని వెలిగించుకుంటాను
అందరూ
మనుష రూపాలు ధరించి
స్వార్ధం మోసం దుర్మార్గం
తదితర మార్గాల వైపు
తరలి పోయే వేళ
నేనొక్కడినే
ఏటి కెదురీదే వానిలా
నీ దివ్య సౌందర్యం వైపు
నడక సాగిస్తాను
అందరికీ నేను
వెఱ్ఱివాడిలా కనిపించినా
ఎర్రని పెదవి వైపుగా నా నడక
ఓ దివ్యపథం చేరుకొనాలని
అద్భుత నిధిని చేకొనాలని
నాడు పేరెన్నిక గన్న కళాశాల,
కావలి జవహర్ భారతి
సాటిలేని మేటి అధ్యాపకుల
ధీనిధితో నిర్మించిన వారధి
వారి సన్నిధిలో ఎన్ని ప్రహసనాలో 
ఎన్ని సన్నివేశాలో ..
నాలోని కళాభినివేశానికి అక్కడే అందుకున్నా వెన్నెల హారతి
కావలి కళాశాలలో విద్యాభ్యాసం నా అదృష్టం . నేను అక్కడ చేరిన సంవత్సరమే కళాశాల పేరు జవహర్ భారతి గా మారింది .
ఆ నిలువెత్తు భవనం- టి ఆర్ ఆర్ బిల్డింగ్స్ లో 4 ఏళ్ళు అభ్యాసం ఒక అద్భుతం -
ఎదురుగా ‘రుతురంగ్’ బొటనికల్ గార్డెన్, పక్కనే టాంపో లైబ్రరీ -అక్కడే చలం శరత్ ఇలా ఎందఱో కవుల పరిచయం, ఎన్నెన్నో సదస్సుల ప్రాంగణం ఎం ఎం హాల్ ఇంకా దక్షిణాన విశ్వోదయ కళా ప్రాంగణం ఎన్నిమధురమైన జ్ఞాపకాలో ...
జవహర్ భారతిలో నన్ను నేను మనిషిగా కవిగా తీర్చి దిద్దుకున్న విధానం ..ఒక అపురూప జ్ఞాపకం . కళాశాల స్థాపకులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఆ విద్యాలయాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్డారో
అక్కడి ఆనాటి అధ్యాపకులు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు భుజంగరాయ శర్మ గారు ,D R ,GGK, NSR మాణిక్యాల రావు, మాధవరావు, రామచంద్రారెడ్డి గారు ... ఇలా ఇంకా ఎందఱో
ఎందుకో ఈ గతాన్ని ,అద్భుతాన్ని ప్రాంగణాన్ని పరిసరాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని అనిపించింది
ఔను నేను మారి పోతున్నాను--------
రోజులు వారాలుగా ..
వారాలు నెలలుగా ...
నెలలు సంవత్సరాలుగా మారిపోతుంటే ....
నేను మాత్రం ఎందుకు మారిపోకూడదు..
నాలో ఒక ఆలోచన ..నాలో ఒక సంచలనం
ఔను నేను మారి పోతున్నాను ..........
నా తల్లి దండ్రుల్ని భార్యాబిడ్డల్ని స్నేహితులని ఇరుగు పొరుగుని అందరిని ప్రేమించడం మొదలు పెట్టాను ఆ తర్వాతనే నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నాను తద్వారా ..హాయిగా జీవించడం అలవాటు చేసుకున్నాను
ఔను నేను మారి పోతున్నాను
నాకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది నేనేమి ఈ మొత్తం విశ్వాన్ని మోసే వ్యక్తిని గానని ఆ అవసరం ఆ శక్తి నాకు లేదని అంతేకాదు అసలు ఈ ప్రపంచం భారం మొత్తం నా బుజాల మీద లేదుకదా
ఔను నేను మారి పోతున్నాను
కూరగాయలు పండ్లు అమ్మేవాళ్ళుతో బేరం ఆడడం వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం ఆగి చేయి చాచడం మానేసాను ..బహుశా నేను వదిలిన ఆ చిల్లర మొత్తం నాజేబుకు చిల్లి పెట్టదు సరికదా అ పేదవానికి తన చిన్ని పాపాయికి పాఠశాల పైకం కట్టడానికి కొంత ఉపయోగపడవచ్చు నేమో
ఔను నేను మారి పోతున్నాను
ఆటో కాబ్ లాంటి వాళ్ళకి నోటు ఇచ్చి మిగిలిన చిల్లరకోసం వేచి ఉండకుండా తిరిగి చూడకుండా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను ..నేను వదిలిన ఆ చిల్లర పైకం అతని వదనంలో ఒక చిరునవ్వును వెలిగించ వచ్చు నిజానికి అతడు నాకంటే ఎక్కువ జీవనపోరాటం సాగిస్తున్నాడు కదా
ఔను నేను మారి పోతున్నాను
పదేపదే మనకి ఏదో చెప్పాలని తహతహలాడే పెద్దవాళ్ళని వారించడం వారితో విబేదింఛి వాదించి గాయపరచడం తప్పు అని తెలుసుకున్నాను నిజానికి అలా తమ అనుభవసారం అందరికి పంచడం వలన వాళ్లకి ఎంత ఆనందం సంతోషం కలుగుతుందో.కదా . అంతేకాదు వారి గత జీవిత భారాన్ని కొంతైనా తగ్గిస్తుంది కూడా
ఔను నేను మారి పోతున్నాను
అందరికి నీతులు బోధించడం జీవన విధానం ఇలా ఉండాలని విడమరచి చెప్పడం తప్పు అని తెలుసుకొని చెప్పడం మానేసాను .. వాళ్ల తప్పు వారికి తెలియకనా.. అందరిని అతి పవిత్రులుగా మానవతా మూర్తులుగా మార్చడం నా ఒక్కరి పనేమి కాదు కదా ..అంతేకాదు నాకు సైతం శాంతి విశ్రాంతి ప్రశాంతత కావాలికదా
ఔను నేను మారి పోతున్నాను
ఎదురైన అందరిని పనిగట్టుకొని హాయిగా పలకరిం చడం ఉదారంగా అభినందించడం అలవాటు చేసుకున్నాను అది వాళ్ళకి ఉత్తేజం కలిగించడం మాత్రమే కాదు నాకు కూడా కూడా కొంత ఉల్లాసం కలిగించి నన్ను ఉత్సాహవంతునిగా చేస్తుంది
ఔను నేను మారి పోతున్నాను
నా చొక్కా మీద పడిన బురద మరక గురించి లేదా ఆ మచ్చ గురించి నేను అసలు లెక్కచేయను నా వ్యక్తిత్వం శీలం ఒక్కటే నా ఔన్నత్యాన్ని నిర్దేశిస్తుందని నాకు గట్టి నమ్మకం ...
ఔను నేను మారి పోతున్నాను
నన్ను నన్నుగా చూడని వాళ్లకి నాకు విలువ ఇవ్వని వాళ్ళ కి దూరంగా వుంటాను.. బహుశా వాళ్ళకి నా విలువ తెలియకపోవచ్చు నన్ను గురించి విని ఉండక పోవచ్చు కాని నన్ను గురించి నాకు తెలుసుకదా
ఔను నేను మారి పోతున్నాను
నన్ను కించ పరచాలని నామీద క్రూరమైన జోకులు విసిరే వాళ్ళ గురించి అసలు పట్టించుకోను ..నన్ను అలా ఇబ్బంది పెట్టె వాళ్ళ గురించి ఒక క్షణమైనా ఆలోచించను నాకు వేరే వ్యాపకం జీవితం వున్నది కదా
ఔను నేను మారి పోతున్నాను
నేను ఎటువంటి నా ఆవేశకావేషాలకు ఎగిరిపడ కూడదని నిర్ణయించు కున్నాను.. నిజానికి నా ఆలోచనలు నా అభినివేశాలే కదా నన్ను మనిషిగా తీర్చి దిద్దుతాయి
ఔను నేను మారి పోతున్నాను
నేనే అందరి కంటే గొప్ప మేధావిని అనే అభిప్రాయాన్ని తుడిచి వేసాను నిజానికి అది స్నేహ బంధాల్ని నాశనం చేస్తుంది ,..నన్ను వారికీ దూరం చేస్తుంది బంధాలు అనుబంధాలు దూరమై ఒంటరిగా నేను ఉండలేను కదా
ఔను నేను మారి పోతున్నాను
నాకు ఏది అవసరమో న్యాయబద్ధంగా ఏది కావాలో ఏది రావాలో దానిని నేను సొంతం చేసుకొని తీరతాను అన్యాయాన్ని ఒప్పుకోవడంకూడా అన్యాయం చెయ్యడమే మరి
ఔను నేను మారి పోతున్నాను
ప్రతి రోజు ఇదే ఆఖరి రోజు అని అనుకోవడం అలవాటు చేసుకున్నాను ఏమో, ఈ రోజే చివరి రోజు కావచ్చు కదా
ఔను నేను మారి పోతున్నాను
నాకు ఏది సంతోషమో ఏది ఆనందదాయకమో అదే చేయడం అలవాటు చేసుకున్నాను నా సంతోషానికి నా అనందానికి నేనే కారకుణ్ని మరి ..దానిని నాకు నేను అందించవలసిన అగత్యం అవవసరం నాదే కదా
ఔను నేను మారి పోయాను
//జనవరి 9 న నేను అనువదించి నా మిత్రులకు వాట్స్ అప్ లో పం పి న ఈ మంచి మాటలు దాదాపు అలాగే ఈ ఆదివారం ''సాక్షి''లో రావడం విశేషం //
’తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోటి మురిపించబోకె ‘’
ఆ పాట నీకు ఎంతో ఇష్టం కదా
అయితే దానిని అన్వయిస్తూ ఒక కవిత వినిపించు
అని ఆమె అడిగినదే తడవుగా ఉప్పొంగి ఉరికిన కవిత 
---------
తెలతెల వారకముందే
తీగ సింగారించుకుంది
తన సిగపాయల నిండా
అందంగా పూలు తురుముకుంది
ఆదమరచి దరిచేరిన నన్ను చూచి
అల్లరిగా దోరగా నవ్వింది
తన్మయంతో తలమునకలౌతున్న
నాపై తన చూపుల పరిమళాలు చల్లింది
ఆ తన్మయంలో తల్లీనమై నేనుండగా
చిరునవ్వుతో నువ్వొచ్చావు
తీగనడుము అల్లల్లాడగా
వయ్యారంగా నడిచొచ్చ్చావు
వింతగా కవ్వింతగా నన్ను చూచి
ముసిముసిగా నవ్వావు
పూల తీగ నడిగి
కొన్ని పూవులు తుంచి
తలలో తురుముకున్నావు
సమ్మోహనంగా నా వైపు చూచావు
‘’’తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వులతోటి మురిపించ బోకే ‘’’
దూర తీరాలనుంచి ఘంటసాల పాట వినిపిస్తున్నది
నాతో పాటు మైమరచిన తోట ఆపాట వింటు
ఆశ్చర్యంగా నిన్ను నన్ను చూస్తున్నది
డబ్బును
ఇబ్బడిముబ్బడిగా
సంపాదించిపెట్టే వ్యాపారం
అది వ్యాపారం కాదు
ధనం
గుట్టలుగా పోగు చేస్తే
అది పెనుశాపం తప్ప
సంపద కానేకాదు
ఒక గొప్ప లక్ష్యాన్ని
సాధించ లేక పోతే
ఎంత సంపద ఉన్నా
అది వ్యర్థం ..
ఆ సంపదని నలుగురికి పంచి
సమాజ శ్రేయస్సు కాంక్షించని
ఆ మనిషి జీవితం నిరర్ధకం నిషిద్ధం..
మొలకెత్తిన విత్తనం
తల ఎత్తి అడిగింది ఆకాశాన్ని
తానీ అవనిపైన
ఏ ఏ అద్భుతాలు చేయాలని
ఎన్నిఆకలిగొన్న ప్రాణులకు ఊపిరులూదాలని
పీఠమెక్కిన పెత్తనం
మోర ఎత్తి అడిగింది నా దేశాన్ని
తన పదవీ కాలాన
ఏ ఏ స్కాముల్లో పాల్గొనాలని
ఎన్ని హరితవనాలను ఆరగించాలని
జాతి ఎగరేసిన పతాకం
జాలిగా చూచింది నా ఆగ్రహావేశాన్ని
బేలగా అడిగింది
ఏ ఘనత ఆశించి
తానింకా ఎగరాలని
ఏ గొప్ప సందేశాలు
జగతికి అందించాలని
ఏ జాతి ఘన కీర్తి ఎలుగెత్తి చాటాలని


కవితామయమేనోయ్ అన్నీ....
------------------------------. 
నువ్వేదో ప్రభంజనం 
సృష్టిస్తావనుకున్నాను గాని 
ఇంకా తడి ఆరని 
పసుపు పారాణి పైన
నీ ప్రతాపం చూపిస్తావనుకోలేదు
నీ మేధా సంపత్తితో 
జగతిని వెలిగిస్తావనుకున్నాను గాని
అతి గతి లేని అమాయకుల గుడిసెల్ని
పరశురామ ప్రీతి చేస్తా వనుకోలేదు
నీ ఆకారం చూసి 
రాకెట్లా దూసుకు పోతావని 
కమ్ముకొస్తున్న చీకట్లను
చెరిపేస్తావని భ్రమించాను
నల్లని పెదవులపైన పడి దొర్లే 
సిగరెట్ ఎంగిలి కోసం
పరితపిస్తా వనుకోలేదు
బీడీ ముక్క మొహంలో 
అద్దం చూచుకొంటూనో 
బొగ్గుల కుంపటి ముంగిట్లోనో 
తూలి పడ్తూ ఉంటె 
దుశ్శాసనుని రొమ్ము చీల్చేదెప్పుడు 
దురాగతాల తలరాత మార్చే దెప్పుడు 
నిన్ను ఆకాశానికెత్తిన
ఆ మహాకవి ఆకాంక్ష నెరవేర్చే దెప్పుడు
ఆ చిన్ని గుడారాన్ని వీడి 
గుడి గోపురాల వైపు నడిచిరా 
వెలుగు జాడ లేని 
చీకటి ప్రాకారాల వైపు కదలిరా 
అగ్నివై, ఆగ్రహోదగ్రవై 
అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టగా
నీతి లేని, నియతి లేని 
నియంతల భవంతుల్ని 
నిలువునా దహించగా ....
అంధకారం అలముకున్న 
వారి అంతరంగాలలో 
వెలుగులు వెదజల్లగా 
రా ..కదలిరా !!!!!!
ఏ గుండె తలుపు తట్టినా
ఏ మనసులో అడుగెట్టినా
పండు వెన్నెల కనబడదేమి
చిరు నవ్వుల సవ్వడి వినబడదేమి //
ఏవేవో కోరికలు
కన్నీటి చారికలు
ఎన్నెన్నో దురాశలు
నెరవేరని నిరాశలు
ఏమైనదో ఈ మనిషికి
తన మనసుని తరిమేసి
సుఖ శాంతులు మరిచాడు
తన బ్రతుకును బలి చేసి
బడబాగ్నిని వలచాడు //
ఎండ మావుల వెంట
ఎన్నాళ్ళి పరుగులు
ఏ సౌఖ్యం కోసమని
ఈ పాముల పడగలు
ఏమైనదో తన బ్రతుకుకి
ఏరువాక కానరాక
ఏకాకిగ మిగిలాడు
ఏ ఒకరు తోడు లేక
ఒంటరి వాడైనాడు //

18, జనవరి 2018, గురువారం

కవితే కాదు ఆయన మనిషి అతి మధురం
తన కలం నిండా సిరా బదులు తేనెలు నింపి రాస్తారు కాబోలు 
ఆయన రాసే కవితలోని ప్రతి పదం తేనెలూరు తూనె వుంటుంది
ఏ అల్లసాని పెద్దనో కవిసార్వభౌమ శ్రీ నాధుడో
మళ్ళీ భువిపై పుట్టరని పిస్తుంది
పిల్లగాలుల చల్లదనం చల్లేందుకే 
ఆయన కలం పట్టరని పిస్తుంది...

ఏది ఏమైన ఆయన తన కవనవనం నిండా
ప్రేమలూరే చల్లగాలులు పంచే చెట్లే
ఆయన కవితల నిండా ఆహ్లాదం మనషికి పంచే పట్లే
 —

ఆకు నాకు ఆదర్శం
---------------------
చినుకు పడిన వేళ
చిగురులు తొడిగిన
చిన్నారి ఆకు నాకు ఆదర్శం
నిశ్చింతగా నిర్మలంగా
చిరుగాలి వొడిలో
సయ్యాట లాడే
ఆకు నాకు ఆదర్శం
వెచ్చని వేసవిని తలదాల్చి
విసిగి వేసారిన జగతికి
చల్లని నీడ నిచ్చి సేద దీర్చి
రాలిపోయే ఆకు నాకు ఆదర్శం
చిన్నారి మొగ్గలకు ఊపిరు లూది
చిగురాకు పొత్తిళ్ళలో జోలపాడి
పురుడు పోసిన ఆకు నాకు ఆదర్శం
రంగు రంగుల రంగేళి ,
వయ్యారి గాలి తరగల తేలి
రెపరెప లాడే ఆకు నాకు ఆదర్శం
పాడు గాలి తాను తాగి
ప్రాణ వాయువు పుక్కిలించి
జగతి ప్రగతికి ఊతమిచ్చే
ఆకు నాకు ఆదర్శం
చింత లన్ని దీరి
చివరకు రంగు మారి
తన తనువు చాలించి
మరో చిగురాకుకు చోటిచ్చి
చాటిన అసమాన త్యాగం
అదే కదా కర్మ యోగం
ఆ ఆకు నాకు ఆదర్శం....
సిగ్గుగా లేదూ !!!!
--------------
ఒకవైపు ఆకలి నకనకలు
ఇంకో వైపు విందులు వినోదాలు ఇకయికలు పకపకలు -
సిగ్గుగా అనిపించడం లేదూ ‘’
నిన్నటి నాయకులు
నిజమైన ప్రజా సేవకులు
నేటి పాలకులు బకాసురులు కీచకులు సైంధవులకు వారసులు, -
-అసహ్యంగా అనిపించడం లేదూ
కలిమిని గుట్టలుగా పోసుకొనే వాళ్ళు ,, కడివెడు గంజికి నోచుకోని వాళ్ళు,
ఎన్నాళ్ళి అసమానతలు అసహయతలు -
-అవమానంగా అనిపించడం లేదూ
ఒకవైపు ఎనలేని సిరి సంపదలు
ఏం చేసుకోవాలో తికమక
ఇంకొక వైపు నిరుపేదలు
ఎలా బతికి బట్టకట్టలో తెలియక, --
దుర్మార్గంగా అనిపించడం లేదూ
తప్పతాగి
తందానాలాడుతూ ఉన్నోళ్ళు
తాగేందుకు గంజి లేక
కన్నీళ్ళు తాగుతూ లేనోళ్ళు, --
కంపరంగా అనిపించడం లేదూ
ఆరుగాలం శ్రమపడి పండించే రైతన్నలు
వారి శ్రమ ఫలితాన్ని కబళించే రాబందులు --
దారుణం అనిపించడం లేదూ
ఉదారంగా
అప్పు ఇచ్చే బ్యాంకులు ఒక వైపు
అప్పు తీర్చలేక పేదల ఆస్థి జప్తులు ఇంకొకవైపు
లక్షల కోట్లు దర్జాగా ఎగ్గొట్టే నాయకులూ, నిస్సిగ్గుగా వారిని రక్షిస్తున్న పాలకులు --
జుగుప్సగా అనిపించడం లేదూ
నటనలు నయవంచనలు,
ఉన్నోళ్ళు లేనోళ్ళు,
సంపన్నులు ఆపన్నులు
ఓట్లు నోట్లు
అధికారులు అహంకారాలు
అవినీతి అక్రమార్జన
కార్పోరేట్ వైద్యం,
మద్యపానం,
తాగి తీరాలనే ప్రభుత్వ విధానం
తల నరికిన వాణ్ని 
న్యాయవాది బల్లగుద్ది
శిక్షనుండి తప్పించడం
పన్ను ఎగ్గోటిన వాణ్ని
రకరకాలుగా రక్షించడం
న్యాయం కోసం వచ్చిన వాణ్ణి
రక్షణ నిలయాలు భక్షించడం
ఇంకొకరిని దోచుకోవడం,
దోచుకున్నది భయంగా
రహస్యంగా దాచుకోవడం
అప్పులు అధిక వడ్డీలు ,
జీవించడం నేర్పని చదువులు
లక్షల కొద్ది నిరుద్యోగులు
అబ్బాయిని అమ్ముకోడాలు
వరకట్న దాహాలు
అందినంత దోచుకొనే
విద్యాలయాలు
అవినీతి కంపు కొట్టే
ప్రభుత్వ కార్యాలయాలు
ప్రజలను మరిచిన పాలకులు నాయకులూ
తల బద్దలు కొట్టుకున్నా
అర్ధంకాని కవితలు
లెక్కకు మించిన కవులు
వెలవెల బోతున్న వేదికలు
వెక్కివెక్కి ఏడుస్తున్న కావ్యాలు
ఆంగ్ల భాషపై పెరిగిన మోజుతో ఆరిపోతున్న తెలుగువెలుగులు
అమెరికా చదువులు
ఎంత శ్రమించినా లభించని కొలువులు
ఆదరణ నోచుకోని వృద్ధులు
అచ్చోసిన ఆంబోతుల్లా మృగాళ్ళు
ఆర్ధిక సంబంధాల కింద గిలగిల కొట్టుకొంటూ మానవసంబంధాలు
అశ్లీలంగా అసభ్యంగా
అర్ధనగ్నంగా తెగ ఊగే చలన చిత్రాలు
అంతకంతకు అంతరించి పోతున్న సంస్కృతీ సంప్రదాయాలు
అడ్డదిడ్డంగా ఆబగా తినడాలు
అకాల మరణాలు
కులాలు మతాల కుమ్ములాటలు
ఓటుకు నోట్లు
ఇంకాకన్ను తెరవని పాపాయి కోసం విరివిగా వెలిసిన కాన్వెంటు కారాగారాలు
అన్యాయం అని తెలిసినా
బల్ల గుద్ది వాదించే న్యాయవాదులు
అధర్మం అని తెలిసినా అడ్డంగా నిలువుగా దోచుకొనే వైద్యులు
అందిన కాడికి దోచుకొనే వ్యాపారులు అవినీతి రీతిగా ఉద్యోగులు
దేశం నిండా ఇబ్బడి ముబ్బడిగా జనం
సగం పైగా యువతరం సోమరితనం
భయంగా నోట్ల కట్టలు
మోసుకొంటూ జనం ,
గుడ్డెద్దు చేలో బడ్డట్టు
గుట్టలుగా పోస్తు ధనం
ఇంకా మరెన్నో
మనసుని కలచి వేసే వికారాలు –
బాధగా అసహనంగా
కోపంగా కంపరంగా
అవమానంగా జుగుప్సాకరంగా
సిగ్గుగా లేదూ !!!
మనిషికి అందని భోగాలు
అంతులేని మనోవ్యధను కలిగిస్తాయి
భోగాలకు చిక్కని మనిషి
అసలైన సుఖం ఆనందం అనుభవిస్తాడు
మనసులోని రోగాలు
మనిషికే కాదు దేశానికి హాని చేస్తాయి
రోగాల బారిన పడని మనిషి
మానవ కల్యాణానికి దోహదం చేస్తాడు
నేను సైతం..
--------------
తెలుగులో తీర్పులు
లేవని ఫిర్యాదు చేసే మిత్రులు
అసలు తీర్పులు తెలుగులో చెప్పడం ఎలా సాధ్యమవుతుందన్న వారున్నారు
తెలుగు భాష న్యాయ శాస్త్రాన్ని కూడా లొంగదీసుకోగలదని పలువురు న్యాయ శాస్త్ర రచయితలు రుజువు చేశారు
అలాంటివారు న్యాయస్థానాలలో పదవులలో ఉండి ఇచ్చిన కమ్మని తెలుగు తీర్పుల సమాహారమే ఈ గ్రంధం..
.......డా ఏ బి కె ప్రసాద్ అధ్యక్షులు , ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషాసంఘం
ఈ గ్రంధంలో 10 మంది న్యాయమూర్తుల సరసన నేను , నా తీర్పులు చోటు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను
కవి సమ్మేళనం
-------------------
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి 
సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో
వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
పేజీల కొద్ది
కవితలు చదవాలని
పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి
అదే పోతగా పయనాలు
వేదిక పైన ఉన్న వారు మాత్రం
దాతల పొగడ్తల్లో
వారు, వారి కోసం
ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ కీర్తిని
కవులంతా గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న
సభా మందిర మది
కవులు కవితలు కాదని
పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని
విషయాలు వల్లించారు
ఫోటోలు వీడియోలు
జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని
కళామతల్లి పెదవి విరిచింది
ఆహూతులైన
శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది
రాత్రివేళ లంటే ఇష్టం అప్పుడు 
చెలి -కలలా ఉంటుంది కనుక ..
శీతవేళ లంటే మరీ ఇష్టం, అప్పురాత్రివేళ లంటే ఇష్టం అప్పుడు 
చెలి -కలలా ఉంటుంది కనుక ..
శీతవేళ లంటే మరీ ఇష్టం, అప్పుడు 
చలి -చెలిలా ఉంటుంది కనుకరాత్రివేళ లంటే ఇష్టం అప్పుడు 
చెలి -కలలా ఉంటుంది కనుక ..
శీతవేళ లంటే మరీ ఇష్టం, అప్పుడు 
చలి -చెలిలా ఉంటుంది కనుకడు 
చలి -చెలిలా ఉంటుంది కనుకకవి సమ్మేళనం 
-------------------
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి 
సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో
వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
పేజీల కొద్ది
కవితలు చదవాలని
పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి
అదే పోతగా పయనాలు
వేదిక పైన ఉన్న వారు మాత్రం
దాతల పొగడ్తల్లో
వారు, వారి కోసం
ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ కీర్తిని
కవులంతా గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న
సభా మందిర మది
కవులు కవితలు కాదని
పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని
విషయాలు వల్లించారు
ఫోటోలు వీడియోలు
జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని
కళామతల్లి పెదవి విరిచింది
ఆహూతులైన
శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది
కను ముక్కు తీరు చూడ చక్కన
చెక్కినాడేమో అమరశిల్పి జక్కన
రంభా ఊర్వశి తిలోత్తమలైనా
పోటిగా నిలబడగలరా తన పక్కన
ఆమె ఒయ్యారంగా చూచిన వేళ
తన పెదవిపై ఆ నవ్వు ఎంతో చిక్కన
ఇన్ని సోయగాలు సొంతం చేసుకున్న
ఆమె అందం అభివర్ణించలేడేమో తిక్కన
ఎంత కాలం ఎంత ఎంత తపసు చేసినా
ఆమె కరుణా కటాక్షం ఎవరికైనా దక్కునా
ఆమె చుట్టూ తిరుగుతు ఉంటె కృష్ణా
నలుగురు నవ్విపోదురేమో పక్కున


ఆమె పరిచయమే 
నన్ను రచయితగా మార్చింది 
ఈ భావ పరిమళమే 
నన్ను ఆమె చెంతకు చేర్చింది
ఆమె చిరునవ్వు సిగపువ్వు 
నా రచనకు ప్రేరణం 
అదే ఆమె నన్ను 
తన చెలికానిగా ఎంచుకున్న కారణం
దిగులు విచారం అనేది 
నా నిఘంటువులోనే లేదు 
ఎప్పుడైనా కలతపడితే 
అది కరిగి పోయేదాకా 
ఆమె నన్ను వదిలిపోదు
ఆమె ఆలోచనలు 
నన్నంటి ఉంటే 
అక్కడే ఆగిపోయింది ప్రాయం
ఆమె ఒడిలో 
సేద తీరుతుంటే, 
కాలం లోకం అన్ని మటుమాయం
ఎందరెందరో కవుల 
హృదయాలలోకి 
తొంగి చూచింది 
ఎక్కడా ...
పూలవనం కనబడలేదని 
నా గుండెలో తిష్ట వేసింది
అప్పటి నుంచి 
ఏది తోచని వేళలు నాకు లేవు 
ఆమె నా చెంత ఉన్నదని తెలిసి, 
ఏ చింతలు చికాకులు నా దరికి రావు
నా చుట్టూ ఎందఱో మనుషులు , 
ఏది తెలియని గందరగోళంలో 
నేను ఆమె నిలిచి 
ఆ వింత చూస్తుంటాము 
మాదైన గంధర్వగానంలో
తెలుగుకు
వందనం
తెలుగు
భాషామతల్లికి 
అభివందనం
తెలుగు సుమములు
విరబూసిన ఈ నేల
పూల మందిరం
తెలుగు తేజం
వెల్లివిరిసిన
ప్రతి హృదయం
నవనందనం
తెలుగుకు వందనం..
తెలుగు జాతికి వందనం..
తెలుగు మహస్సుకు వందనం
తెలుగు వచస్సుకు వందనం
తెలుగు యశస్సుకు వందనం
ఉదయాన్నే
ఆమె ఎదురౌతుంది
ఒక మందారం
ఆమె పెదవి పైన 
నవ వధువౌతుంది
ఒక విన్యాసం
ఆమె కనులలో
రసధుని ఔతుంది
తప్పనిసరిగా
ప్రతి రేయి నాకు
నిదుర కరువౌతుంది
వసివాడని ఆచిరునవ్వుని
ఆమె లేత అధరం
నిరంతరం మోస్తూనే ఉంటుంది
అరుదైన ఆ పరిమళం
ప్రతి క్షణం నన్ను
అమరుణ్ణి చేస్తూనే ఉంటుంది
ఆ చిత్తరువుని ఒడిసి పట్టుకొని
నామనసు పిచ్చిగా యధేచ్చగా
ఎన్నో కావ్యాలు రాస్తూనే ఉంటుంది
ఆ స్నిగ్ధ దరహాసాన్నిదాచుకొని
అనునిత్యం నా హృదయం
నవమోహనంగా నర్తిస్తూనే వుంటుంది
ఆ నలుగురు
-----------------
ఈనాటి మనిషి
తన కోసం తాను బ్రతకడం లేదు
అసలు తన బ్రతుకు 
తన చేతిలో లేనే లేదు
పని పాట లేని
నలుగురు శాసిస్తున్నారు
పని కట్టుకొని
ఇరుగు పొరుగున వున్న
నలుగురు రెచ్చ గొడుతున్నారు
జీవితాన్ని నరకం వైపు నడిపిస్తున్నారు
ఆశ్చర్యం ...
ఆ నలుగురి కోసం
వారిని మెప్పించడం కోసం
నిరంతరం నీ తపన
వారేమనుకుంటారోనని
అనుక్షణం నీలో సంఘర్షణ
అట్టహాసంగా వివాహాలు
వైభవంగా కర్మ కాండలు
ఆ నలుగురు
మెచ్చుకోవాలని రెచ్చగొట్టారని
ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు
ఈ నలుగురి కారణంగా
స్పర్ధలు కొని తెచ్చు కొంటున్నారు
నరక యాతనని
ముంగిలిలోకి ఆహ్వానిస్తున్నారు
ఆ నలుగురు అన్నారని
కోపోద్రేకం తనవారితో విరోధం
తగాదాలు పోలీసులు
న్యాయస్థానాలు ప్లీ డ ర్లు
చెప్పే వాడికేం .....
ఎగదోసే వాడికి ఇదో సరదా దురద
విన్న వాడే ..
వాడి చావు వాడు చస్తున్నాడు
చెప్పుడు మాటలు విని
చెడి పోతున్నాడు
ఈ నలుగురు
ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు
వీరి పాత్ర సమాజంలో అతి కీలకం
కల్లోలాలు సృష్టిస్తారు
కలహం దాకా నడిపిస్తారు
చాటుగా నవ్వుకుంటారు
ఆపై తప్పుకుంటారు
ఆ నలుగురు
మీ చుట్టూ ఉన్నారు ఉంటారు
మిమ్మల్ని అశాంతి గహ్వరాలలోకి నడిపిస్తుంటారు
తస్మాత్ జాగ్రత్త .......
ఎంత చల్లనిదో వెన్నెల
నిన్ను తాకి వెచ్చనైనది
ఎంత అల్లరి దో చినుకు
నీ పెదవిని తాకి ముత్యమైనది 
--- ---- ----
ఒక చిరు నవ్వు విసిరి
ఆమె అన్నది
ఎంత చిలిపిదో నీ కలం
కన్ను మూసి తెరిచే లోగా ఒక కావ్యమైనది
అవాక్కయ్యాను
-----------------
ఒకాయన అడిగారు
'ఇదంతా ఎవరు చదువుతారు ' అని
అది దీర్ఘ కవిత ,అందులో జీవిత ముంది ,
అగాధాలున్నాయి,
వెన్ను చరుపు లున్నాయి
ఆయన్ని అడిగాను
''ఒక విషయం అడుగుతాను
మీరేమి అనుకోరు కదా ''
అబ్బే అడగండి
మీరు పడి పడి సంపాదిస్తున్నారు కదా !
నిద్రాహారాలు మాని కోట్లు కూడబెడ్తున్నారు కదా! ,
అదంతా ఎవరు తింటారు?
అంతే అవాక్కయ్యాడు
''ఈ విషయమే ఇందులో రాసాను
ఇది తెలియకే మీ లాంటి వాళ్ళు
జీవితాన్ని నరక ప్రాయం చేసుకొంటున్నారు
మీకు మీరే కాకుండా,
అనురాగాలకు అనుబంధాలకు
అసలు మానవతకు దూరంగా
జరిగి పోతున్నారు
ఆఖరి అంకంలో ఆలు బిడ్డల్ని విస్మరించి
అయినవారికి దూరంగా '
అయ్యో ఇంత జీవితం వృధా చేసుకొన్నామే '
అని వాపోతున్నారు ,
అది ఏమిటో ఇప్పుడే ఆగి ఆలోచించమని ఇది రాసాను ''
ఏమనుకున్నాడో ఏమో అతను
ఒక పుస్తకం అడిగి తీసుకోని
చక్కా పోయాడు
ఇక రాడనుకున్నాను
మర్నాడు హటాత్తుగా వచ్చి
'ఓ వంద కాపీలు ఇవ్వగలరా 'అన్నాడు
ఓ పదివేలు అక్కడ పెట్టి
వేలు వద్దన్నాను
''కాదనకండి, ఇలాంటి కావ్యాలు ఇంకా రాయండి ,
రాబోయే కావ్య ముద్రణకు నాకు అవకాశమివ్వండి ''
ఇప్పుడు అవాక్కవ్వడం
నా వంతయ్యింది
మనసా !
ఎందుకే అంత దిగులు
మంటలు అంటించుకొని
పొగలు సెగలు
రెప్ప పాటు జీవితానికి 
ఎందుకే
ఇన్నిన్ని వగలు
ఈ పరుగులు //
మల్లెపువ్వు నడుగు
తన జీవన గమన మేమిటో
సన్నజాజి నడుగు
తన గమ్యమేమిటో
పరిమళాలు వెదజల్లే
పరమార్ధ మేమిటో
తన కోసమే కాదు ఒక రోజైనా
పరుల కొరకు బ్రతకాలని //
ఎన్నాళ్ళున్నావని కాదు
ఎంత సంపాదించావని కాదు
ఎందరి కనులలో
దీపాలు వెలిగించావని
ఎందరి హృదయాలలో
నిలిఛి పోయావని
మనిషి జన్మ అపురూపం
మరి ఏల ఈ పరితాపం
ఇలపై ఏ ఘన కార్యాలు సాధించావని//
ఎప్పుడు
నా చుట్టూ
అదేపనిగా
తిరగడమేనా నీ పని
అప్పుడే
విరిసిన పువ్వు
నిలదీసింది తుమ్మెదని----
నేనూ
ఏవేవో అక్షరాలు పట్టుకొని
తన చుట్టూ గింగురు మంటూ
ప్రదక్షిణాలు చేస్తుంటే
ఆమె
కళ్ళింతలు చేసి
నావైపు ఉరిమురిమి చూసింది
నీ సంగతి ఏమిటని----
వందలు వేలు
స్నేహితులుండగా
ఒక ఆత్మీయుడి కోసం
అలమటిస్తా వెందుకు
ఆరాటపడతా వెందుకు...
ఒక మేధావి సమాధానం...
గాలి
అంతటా
వ్యాపించి ఉంటుంది
కానీ అదంతా
ప్రాణవాయువు
కాదు కదా
అందుకే
ఒక ప్రాణమిత్రుని కోసం
నా ఈ అన్వేషణ
ఎన్నో అనుబంధాలు
ఎన్నో సుమగంధాలు
కనుచూపు మేర ఎన్నెన్నో
మమతల మకరందాలు మధుగీతాలు
కడవూపిరిదాకా ఎన్నెన్నో 
ప్రయాణాలు ప్రహసనాలు ప్రమాణాలు
ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఈ జీవనయానంలో
ఎన్ని సంవత్సరాలు గతించినా
అమితానందంతో
ఆమని శుభసంకేతంతో
తన ఉదార కేదారంలో
నవమాసాలు మోసి
ఉదయ కాంతికి ఊపిరులూదిన
అమ్మతో అనుబంధం మాత్రం
మరో తొమ్మిది నెలలు అదనం
ఆనాడే మొదలైనది జననం
ఆ మాతృమూర్తి
రచించినదే ఈ కధనం
అమ్మ అనురాగం
అనంతం అమూల్యం
ఎన్నటికి అది వసివాడని జ్ఞాపకం
అమ్మ !
ఒక కమ్మని నమ్మకం
నువ్వు నేనే కాదు
ఈ జగమంతా
అమ్మ చేసిన సంతకం
ఈ జనమంతా
ఆ దేవత ఆలపించిన
జయగీతం
అనన్యం
అగణ్యం
అపురూపం
అమ్మ భావనం
అజరామరం
-------అమ్మ 4వ వ ర్ధంతి సం ద ర్భం గా
-----------------కవితా నీరాజనం
నాకు కోయిలలంటే ఇష్టం
కోమల సుమ దళాలంటే ఇష్టం
ఆమని ఆగమనం విని
పూవై విరబూయడం ఇష్టం
**
అవనిలోని అందాలన్నిటిని
అవలోకించింది నా నయనం
నా ప్రమేయం లేకుండా
నా కలంలోకి చొరబడింది ప్రణయం
నల్లేరు మీద బండి నడకలా
సాగింది నా బతుకు పయనం
నాలో ఉన్న మనసే
ఒక అందాల బృందావనం
**
ఎప్పుడూ నాతో నేను
సావధానంగా మాటాడుకొంటాను,
ఏకాంతాన్ని ఒక అందమైన
పాటగా పాడుకొంటాను
**
క్షీర నీర న్యాయం నాకు తెలుసు
ఎదుటివారిలో మంచిని మాత్రమే
చూస్తుంది నా మనసు
**
ఏది తోచనప్పుడు
నాలోకి నేను వెళ్ళిపోతాను
ఎవరు లేనప్పుడు
నాతొ నేను మాటాడుకుంటాను
**
ఎంత మంచివాడో ఆ దేవుడు ,
అడగకుండానే అన్నీ ఇచ్చాడు
ఇంకా అవసరమని తోచినప్పుడు
ఆయనే నాలోకి నడచి వచ్చాడు
**
వెన్న లాంటిది నామనసు
వేయి వేణువులు ఒక్కసారిగా
ఎలా రవళించాలో దానికి తెలుసు
**
కోటి దీపకాంతులతో నిత్యం
నన్ను నేను వెలిగించుకుంటాను
ఒక వేయి వీణ లుగా
నన్ను నేను మీటుకొని,
కోటి రాగాలు పలికించుకుంటాను
( నాలోనేను నాతోనేను కావ్యం నుండి కొన్ని
వాళ్లు
లావెక్కి పోతున్నారు
అడ్డంగా బలిసి పోతున్నారు
జనాన్ని 
దోచుకొంటూ
ఆ పాప భారం
మోయలేక అలిసి పోతున్నారు
ఎక్కడెక్కడో
దాచుకోలేక
ఎక్కడ పూడ్చి పెట్టాలో
ఏమాత్రం అర్థంకాక
సతమతమై పోతున్నారు
నిద్రాహారాలు మాని
నిశాచరుల్లా జీవిస్తున్నారు
నిరంతరం
అశాంతితో
అలమటిస్తున్నారు
దయయుంచి కాస్త
ఆ కారాగారం
తలుపులు తెరవండి
కనికరించి వారిని
అక్కడ కొంతకాలం
విశ్రాంతి తీసుకోనివ్వండి
మనసు అడిగింది ఎలా ఉన్నావని
రాత్రి ఎన్ని స్వప్నాలు కన్నావని
నిదుర రాని నిసిరాతిరి వేళలో
ఆదమరచి ఎన్ని వూసులు విన్నావని
ఎన్నెన్ని రమ్య సౌందర్య రహస్యాలు
కను రెప్పల మాటున దాచుకున్నావని
నడిరేయి ఒడిలో చేరి అలరించిన
అన్ని అందాలు ఏం చేసుకున్నావని
చెలి చిందించిన మందహాసాలు
ఎన్ని రాసులుగా పోసుకున్నావని
కాలం అడుగుతున్నది అందమైన ఈ రేయి
ఎన్ని కవితలు కావ్యాలు రాసుకున్నావని
ఎన్ని కబుర్లు చెప్పాయి
ఎల మావి చిగుళ్లు
ఎన్నెన్ని కధలు చెప్పాయి 
ఎలనాగ నయనాలు
ఎంత సంతసాన
వెల్లిివిరిసాయి
ఆ పెదవి చివర్లు
ఎంత సంబరాన్ని
మోసుకొచ్చాయి
వెన్నెల రాత్రుళ్ళు.
వెన్నెలకు చెప్పాను
నీ కన్నుల తళతళల గురించి
పువ్వులకు చెప్పాను
నీ మేని పరిమళాల గురించి
నీవేమో
ధవళాంబరాలు ధరించి
నా మ్రోల
మోము నరవొంచి
మంద్రస్వరంతో
అంటున్నావు
నేనేనని నీ విరించి
గులాబిలా
విరబూయాలనుకొంటున్నావా
గుప్పెడు పరిమళాలు
వెదజల్లాలనుకొంటున్నావా
అయితే
ముళ్ళతో చెలిమి చేయడం
అలవాటు చేసుకో
కడగండ్లతో కల్లోలంతో
కలిసి బ్రతకడం నేర్చుకో
నిన్ను వెంటాడే కష్టాలు నీకు వన్నె తెస్తాయి
కష్టాల కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి
ప్రతి మనిషి
ఒక గొప్ప స్థానం
నిలుపుకోడానికి
ఉద్దేశించబడ్డాడు
ఈ లోకంలో
ఇంతకు ముందు
ఎవరూ చేయని
ఒక ప్రత్యేక కార్యక్రమానికి
నిర్దేశించబడ్డాడు
అతడికి
ఒక కొత్త సమాజాన్ని
నిర్మించే సామర్ధ్యం ఉన్నా
తన జన్మ సార్ధకం
చేసుకొనే అవకాశం వున్నా
మనిషి
ఈ గొప్ప విషయాన్ని విస్మరించి
స్వార్థంలో చతికిలబడ్డాడు
ఆమె బొట్టు పెట్టుకొంటూ
నన్ను చూచి చిలిపిగా నవ్వింది
ఇది నీ రూపమే సుమా ...
కొంటెగా చెప్పింది
కాటుక దిద్దుకొంటు
వయ్యారంగా ఓరకంట
నను చూచింది
నా కంటి పాపలో నీవే సుమా,
మెత్తగా నవ్వింది
చీర కుచ్చెళ్లు
సరిచేసుకొంటు
చిలిపిగా కసిరింది
అంత తాదాత్మ్యం
పనికిరాదు సుమా
చెంతకొచ్చి మోమును
అరచేతుల నడుమ అదిమి
నుదుటిపై ఒక తీపి ముద్ర వేసింది
చిన్ననాడే
ఆమె నన్ను క లు సు కున్నది
ఒక వన కన్నియగా
తనను తాను పరిచయం చేసుకున్నది
తనతో
పూల వనాల వెంట నడవాలని
చేతిలో చెయ్యి వేయించు కున్నది
చేయిపట్టి
అందరికి దూరంగా తీసుకెళ్ళి
పూలతో గాలితో పుప్పోళ్ళతో
స్నేహం చేయమన్నది
కాలం కసిరిన వేళ నన్ను
తన ఎదలో దాచుకున్నది
జీవితకాలం నన్ను
తన జీవన సహచరునిగా
చేసుకున్నది
ఆమె పెదవిపై వేణువునై
ఆమె ఒడిలో వీ ణి య నై
ఎన్ని విన్యాసాలు చేశానో
ఆమె నుదుట సిందూరాన్నై,
ఆమె సిగలో మందారాన్నై
ఎంత సంతసాన్ని మోశానో
ఆమె అందానికి స్పందించి.
అనుబంధానికి అచ్చెరు వొంది
ఎన్ని కవితలు కావ్యాలు రాశానో
ఆమె కనుసన్నలలో
అక్కడ కాచిన వెన్నెలలో
ఎంత జీవితాన్ని అరబోశానో