నిత్య సత్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిత్య సత్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జూన్ 2018, శుక్రవారం

ఇప్పుడు ఒక చెట్టు
ఈ నేలపైన నాటుతున్నావంటే
రేపు నువ్వు దానికింద
సేద దీర్చుకుంటావని కాదు
అప్పటిదాకా చిరంజీవిలా
జీవించి ఉంటావని కాదు
అది ఎందరికో నీడ నివ్వాలని
నీ జీవితము అంతే
నువ్వు అవనిపై మొలకెత్తావంటే
నీ ఆనందం కోసమే కాదు
నీ ముద్దుముచ్చట మురిపాలు
తీర్చుకోవడం కోసమే కాదు
మహోన్నత వటవృక్ష మై
నలుగురికి ఆదర్శంగా నిలుస్తావని
నీ నీడలో ఎందరికో ఆశ్రయ మిస్తావని
ఈ జగతికి మార్గదర్శివి ఔతావని
ఔనన్నా కాదన్నా ఇది జీవిత సత్యం
అందుకు ప్రత్యక్షసాక్ష్యం ఆ వటవృక్షం

2, ఏప్రిల్ 2018, సోమవారం

అమ్మా !
తెలుగు తల్లీ !!
15 కోట్ల జనావళి
నాలుకపై నర్తించే కల్పవల్లీ
ఎవరికి నీవు కావాలి ?
ఎవరికి నీమీద జాలి ??
ఏ ప్రభుత పాడేను జోల
ఏ యువత వూపేను డోల..
అమ్మా
తెలుగు తల్లీ
నీకు వందనం ..
నీవున్న లోగిలి
నవనందనం....
నిన్ను విస్మరిస్తే ..
ఈ విశాల విశ్వం లో
తెలుగు వాడి ప్రగతి
తెలుగు జాతి ఖ్యాతి
అంధకారం బంధురం
(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్బంగా..)
ఆ నలుగురు
---------------
ఈనాటి మనిషి
తన కోసం తాను బ్రతకడం లేదు
అసలు తన బ్రతుకు 
తన చేతిలో లేనే లేదు
పని పాట లేని
నలుగురు శాసిస్తున్నారు
పని కట్టుకొని
ఇరుగు పొరుగున వున్న నలుగురు
నిన్ను రెచ్చ గొడుతున్నారు
జీవితాన్ని నరకం వైపు నడిపిస్తున్నారు
ఆశ్చర్యం ...
ఆ నలుగురి కోసం
వారిని మెప్పించడం కోసం
నిరంతరం నీ తపన
వారేమనుకుంటారోనని
అనుక్షణం నీలో సంఘర్షణ
అట్టహాసంగా వివాహాలు
వైభవంగా కర్మ కాండలు
ఆ నలుగురు
మెచ్చుకోవాలని రెచ్చగొట్టారని
ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు
ఈ నలుగురి కారణంగా
స్పర్ధలు కొని తెచ్చు కొంటున్నారు
నరక యాతనని
ముంగిలిలోకి ఆహ్వానిస్తున్నారు
ఆ నలుగురు అన్నారని
కోపోద్రేకం తనవారితో విరోధం
తగాదాలు పోలీసులు
న్యాయస్థానాలు ప్లీ డ ర్లు
చెప్పే వాడికేం .....
ఎగదోసే వాడికి ఇదో సరదా దురద
విన్న వాడే .
.వాడి చావు వాడు చస్తున్నాడు
చెప్పుడు మాటలు విని
చెడి పోతున్నాడు
ఈ నలుగురు
ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు
వీరి పాత్ర సమాజంలో అతి కీలకం
కల్లోలాలు సృష్టిస్తారు
కలహం దాకా నడిపిస్తారు
చాటుగా నవ్వుకుంటారు
ఆపై తప్పుకుంటారు
ఆ నలుగురు
మీ చుట్టూ ఉన్నారు
వుండే ఉంటారు
మిమ్మల్ని
అశాంతి గహ్వరాలలోకి
నడిపిస్తుంటారు
తస్మాత్ జాగ్రత్త .......
అప్పుడప్పుడు
నిన్ను నీవు ప్రశ్నించుకో
నిన్ను నువ్వు
గెలుచుకున్నావో లేదో 
అసలు నిన్ను నువ్వు
తెలుసుకున్నావో లేదో-
లేక... అమాయకంగా..అర్భకునిలా
భారంగా వయసు మోసుకొంటూ
తిరుగుతున్నావో ఏమో
అడపాదడపా ఆగి తర్కించుకో
ఒకసారి నింపాదిగా ఆగి
నిశితంగా విమర్శించుకో
నీ నడక
మహోదయాల వైపు సాగుతున్నదో
మరణం వైపుగా
చివరి క్షణాల కేసి దూసుకు పోతున్నదో
నిన్ను నువ్వు
తీర్చి దిద్దుకో మనిషిలా ...
ఎందుకు వృధాగా పుట్టి గిట్టే చెదలులా
నీకు తెలుసో లేదో
నువ్వుండేది ఇక్కడ కొద్ది కాలమే
కడదాకా ఈ ఉర్విపై
నీ ఉనికి అనుమానమే
ఇతరుల జీవితాలలో
అనవసరంగా చొరబడి
నీ విలువైన కాలం వృధా చేసుకోకు
ఉన్నన్నాళ్ళు
హాయిగా జీవించడం మాని
పరుల విషయాలలో జోక్యం చేసుకోకు
ఎవరి బ్రతుకు వారిని బ్రతకనీ
నీ ప్రమేయం ఎందుకు
క్షణ భంగురమైన జీవితానికి
ఇన్ని ఆపసోపాలెందుకు
అనవసర రాద్ధాంతం మెందుకు
నీ బ్రతుకు నువ్వు బ్రతుకు
వృధా చేసుకోకు ఎవరి కొరకు
బండెడు కట్టెలు
ఒక మట్టి కుండ
మూడు చిల్లులు
శవం కాలుతున్న వాసన
చెట్టంత మనిషి
తృటిలో అదృశ్యమౌతున్న దృశ్యం
మరుక్షణంలో ఆ పరిసరం లో
ఒక్కరూ కనిపించని నిర్మానుష్యం
ఒక జననం
ఒక మరణం
రెంటి నడుమ
ఆకలి కేకల హాహాకారం
దావానల కీలల బీభత్సం
ఇంతేనా మనిషి జీవితం!
అర్ధం కానిది ఈ జనన మరణ రహస్యం
మనిషి....
డబ్బుకోసం
అహర్నిశలు
ఆయాసపడి సంపాదించి
ఆరోగ్యం పోగొట్టుకుంటాడు
అదే ఆరోగ్యంకోసం
ఎంతో శ్రమపడి సంపాదించిన
ఆ డబ్బు పోగొట్టుకుంటాడు
రేపటి మీద తాపత్రయంతొ
ఈ రోజును అనుభవించ లేడు
అలా అని రేపటిని ఎల్లుండిని కూడా..
అతడు మరణించాడని
అనుకోవడమే గాని
నిజంగా బతికిందెప్పుడు
అన్న సందేహం,అందరిలో మిగిలి పోతుంది
---నా కావ్యం ‘’ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ’’’ నుండి....

18, జనవరి 2018, గురువారం

సిగ్గుగా లేదూ !!!!
--------------
ఒకవైపు ఆకలి నకనకలు
ఇంకో వైపు విందులు వినోదాలు ఇకయికలు పకపకలు -
సిగ్గుగా అనిపించడం లేదూ ‘’
నిన్నటి నాయకులు
నిజమైన ప్రజా సేవకులు
నేటి పాలకులు బకాసురులు కీచకులు సైంధవులకు వారసులు, -
-అసహ్యంగా అనిపించడం లేదూ
కలిమిని గుట్టలుగా పోసుకొనే వాళ్ళు ,, కడివెడు గంజికి నోచుకోని వాళ్ళు,
ఎన్నాళ్ళి అసమానతలు అసహయతలు -
-అవమానంగా అనిపించడం లేదూ
ఒకవైపు ఎనలేని సిరి సంపదలు
ఏం చేసుకోవాలో తికమక
ఇంకొక వైపు నిరుపేదలు
ఎలా బతికి బట్టకట్టలో తెలియక, --
దుర్మార్గంగా అనిపించడం లేదూ
తప్పతాగి
తందానాలాడుతూ ఉన్నోళ్ళు
తాగేందుకు గంజి లేక
కన్నీళ్ళు తాగుతూ లేనోళ్ళు, --
కంపరంగా అనిపించడం లేదూ
ఆరుగాలం శ్రమపడి పండించే రైతన్నలు
వారి శ్రమ ఫలితాన్ని కబళించే రాబందులు --
దారుణం అనిపించడం లేదూ
ఉదారంగా
అప్పు ఇచ్చే బ్యాంకులు ఒక వైపు
అప్పు తీర్చలేక పేదల ఆస్థి జప్తులు ఇంకొకవైపు
లక్షల కోట్లు దర్జాగా ఎగ్గొట్టే నాయకులూ, నిస్సిగ్గుగా వారిని రక్షిస్తున్న పాలకులు --
జుగుప్సగా అనిపించడం లేదూ
నటనలు నయవంచనలు,
ఉన్నోళ్ళు లేనోళ్ళు,
సంపన్నులు ఆపన్నులు
ఓట్లు నోట్లు
అధికారులు అహంకారాలు
అవినీతి అక్రమార్జన
కార్పోరేట్ వైద్యం,
మద్యపానం,
తాగి తీరాలనే ప్రభుత్వ విధానం
తల నరికిన వాణ్ని 
న్యాయవాది బల్లగుద్ది
శిక్షనుండి తప్పించడం
పన్ను ఎగ్గోటిన వాణ్ని
రకరకాలుగా రక్షించడం
న్యాయం కోసం వచ్చిన వాణ్ణి
రక్షణ నిలయాలు భక్షించడం
ఇంకొకరిని దోచుకోవడం,
దోచుకున్నది భయంగా
రహస్యంగా దాచుకోవడం
అప్పులు అధిక వడ్డీలు ,
జీవించడం నేర్పని చదువులు
లక్షల కొద్ది నిరుద్యోగులు
అబ్బాయిని అమ్ముకోడాలు
వరకట్న దాహాలు
అందినంత దోచుకొనే
విద్యాలయాలు
అవినీతి కంపు కొట్టే
ప్రభుత్వ కార్యాలయాలు
ప్రజలను మరిచిన పాలకులు నాయకులూ
తల బద్దలు కొట్టుకున్నా
అర్ధంకాని కవితలు
లెక్కకు మించిన కవులు
వెలవెల బోతున్న వేదికలు
వెక్కివెక్కి ఏడుస్తున్న కావ్యాలు
ఆంగ్ల భాషపై పెరిగిన మోజుతో ఆరిపోతున్న తెలుగువెలుగులు
అమెరికా చదువులు
ఎంత శ్రమించినా లభించని కొలువులు
ఆదరణ నోచుకోని వృద్ధులు
అచ్చోసిన ఆంబోతుల్లా మృగాళ్ళు
ఆర్ధిక సంబంధాల కింద గిలగిల కొట్టుకొంటూ మానవసంబంధాలు
అశ్లీలంగా అసభ్యంగా
అర్ధనగ్నంగా తెగ ఊగే చలన చిత్రాలు
అంతకంతకు అంతరించి పోతున్న సంస్కృతీ సంప్రదాయాలు
అడ్డదిడ్డంగా ఆబగా తినడాలు
అకాల మరణాలు
కులాలు మతాల కుమ్ములాటలు
ఓటుకు నోట్లు
ఇంకాకన్ను తెరవని పాపాయి కోసం విరివిగా వెలిసిన కాన్వెంటు కారాగారాలు
అన్యాయం అని తెలిసినా
బల్ల గుద్ది వాదించే న్యాయవాదులు
అధర్మం అని తెలిసినా అడ్డంగా నిలువుగా దోచుకొనే వైద్యులు
అందిన కాడికి దోచుకొనే వ్యాపారులు అవినీతి రీతిగా ఉద్యోగులు
దేశం నిండా ఇబ్బడి ముబ్బడిగా జనం
సగం పైగా యువతరం సోమరితనం
భయంగా నోట్ల కట్టలు
మోసుకొంటూ జనం ,
గుడ్డెద్దు చేలో బడ్డట్టు
గుట్టలుగా పోస్తు ధనం
ఇంకా మరెన్నో
మనసుని కలచి వేసే వికారాలు –
బాధగా అసహనంగా
కోపంగా కంపరంగా
అవమానంగా జుగుప్సాకరంగా
సిగ్గుగా లేదూ !!!
మనిషికి అందని భోగాలు
అంతులేని మనోవ్యధను కలిగిస్తాయి
భోగాలకు చిక్కని మనిషి
అసలైన సుఖం ఆనందం అనుభవిస్తాడు
మనసులోని రోగాలు
మనిషికే కాదు దేశానికి హాని చేస్తాయి
రోగాల బారిన పడని మనిషి
మానవ కల్యాణానికి దోహదం చేస్తాడు
కవి సమ్మేళనం
-------------------
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి 
సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో
వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
పేజీల కొద్ది
కవితలు చదవాలని
పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి
అదే పోతగా పయనాలు
వేదిక పైన ఉన్న వారు మాత్రం
దాతల పొగడ్తల్లో
వారు, వారి కోసం
ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ కీర్తిని
కవులంతా గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న
సభా మందిర మది
కవులు కవితలు కాదని
పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని
విషయాలు వల్లించారు
ఫోటోలు వీడియోలు
జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని
కళామతల్లి పెదవి విరిచింది
ఆహూతులైన
శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది
రాత్రివేళ లంటే ఇష్టం అప్పుడు 
చెలి -కలలా ఉంటుంది కనుక ..
శీతవేళ లంటే మరీ ఇష్టం, అప్పురాత్రివేళ లంటే ఇష్టం అప్పుడు 
చెలి -కలలా ఉంటుంది కనుక ..
శీతవేళ లంటే మరీ ఇష్టం, అప్పుడు 
చలి -చెలిలా ఉంటుంది కనుకరాత్రివేళ లంటే ఇష్టం అప్పుడు 
చెలి -కలలా ఉంటుంది కనుక ..
శీతవేళ లంటే మరీ ఇష్టం, అప్పుడు 
చలి -చెలిలా ఉంటుంది కనుకడు 
చలి -చెలిలా ఉంటుంది కనుకకవి సమ్మేళనం 
-------------------
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి 
సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో
వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
పేజీల కొద్ది
కవితలు చదవాలని
పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి
అదే పోతగా పయనాలు
వేదిక పైన ఉన్న వారు మాత్రం
దాతల పొగడ్తల్లో
వారు, వారి కోసం
ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ కీర్తిని
కవులంతా గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న
సభా మందిర మది
కవులు కవితలు కాదని
పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని
విషయాలు వల్లించారు
ఫోటోలు వీడియోలు
జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని
కళామతల్లి పెదవి విరిచింది
ఆహూతులైన
శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది
ఆ నలుగురు
-----------------
ఈనాటి మనిషి
తన కోసం తాను బ్రతకడం లేదు
అసలు తన బ్రతుకు 
తన చేతిలో లేనే లేదు
పని పాట లేని
నలుగురు శాసిస్తున్నారు
పని కట్టుకొని
ఇరుగు పొరుగున వున్న
నలుగురు రెచ్చ గొడుతున్నారు
జీవితాన్ని నరకం వైపు నడిపిస్తున్నారు
ఆశ్చర్యం ...
ఆ నలుగురి కోసం
వారిని మెప్పించడం కోసం
నిరంతరం నీ తపన
వారేమనుకుంటారోనని
అనుక్షణం నీలో సంఘర్షణ
అట్టహాసంగా వివాహాలు
వైభవంగా కర్మ కాండలు
ఆ నలుగురు
మెచ్చుకోవాలని రెచ్చగొట్టారని
ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు
ఈ నలుగురి కారణంగా
స్పర్ధలు కొని తెచ్చు కొంటున్నారు
నరక యాతనని
ముంగిలిలోకి ఆహ్వానిస్తున్నారు
ఆ నలుగురు అన్నారని
కోపోద్రేకం తనవారితో విరోధం
తగాదాలు పోలీసులు
న్యాయస్థానాలు ప్లీ డ ర్లు
చెప్పే వాడికేం .....
ఎగదోసే వాడికి ఇదో సరదా దురద
విన్న వాడే ..
వాడి చావు వాడు చస్తున్నాడు
చెప్పుడు మాటలు విని
చెడి పోతున్నాడు
ఈ నలుగురు
ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు
వీరి పాత్ర సమాజంలో అతి కీలకం
కల్లోలాలు సృష్టిస్తారు
కలహం దాకా నడిపిస్తారు
చాటుగా నవ్వుకుంటారు
ఆపై తప్పుకుంటారు
ఆ నలుగురు
మీ చుట్టూ ఉన్నారు ఉంటారు
మిమ్మల్ని అశాంతి గహ్వరాలలోకి నడిపిస్తుంటారు
తస్మాత్ జాగ్రత్త .......
వాళ్లు
లావెక్కి పోతున్నారు
అడ్డంగా బలిసి పోతున్నారు
జనాన్ని 
దోచుకొంటూ
ఆ పాప భారం
మోయలేక అలిసి పోతున్నారు
ఎక్కడెక్కడో
దాచుకోలేక
ఎక్కడ పూడ్చి పెట్టాలో
ఏమాత్రం అర్థంకాక
సతమతమై పోతున్నారు
నిద్రాహారాలు మాని
నిశాచరుల్లా జీవిస్తున్నారు
నిరంతరం
అశాంతితో
అలమటిస్తున్నారు
దయయుంచి కాస్త
ఆ కారాగారం
తలుపులు తెరవండి
కనికరించి వారిని
అక్కడ కొంతకాలం
విశ్రాంతి తీసుకోనివ్వండి
గులాబిలా
విరబూయాలనుకొంటున్నావా
గుప్పెడు పరిమళాలు
వెదజల్లాలనుకొంటున్నావా
అయితే
ముళ్ళతో చెలిమి చేయడం
అలవాటు చేసుకో
కడగండ్లతో కల్లోలంతో
కలిసి బ్రతకడం నేర్చుకో
నిన్ను వెంటాడే కష్టాలు నీకు వన్నె తెస్తాయి
కష్టాల కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి

30, అక్టోబర్ 2017, సోమవారం

మనం మనుషులుగా ఉందాం \
ఇంటిలో ఆవరణలో ఒక చెట్టైనా లేకున్నా
ఆవరణలో ఇంకుడుగుంట నిర్మించుకోకున్నా
అమూల్యమైన నీటిని నిర్లక్ష్యంగా వృధా చేసినా 
అందరికి ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డు మీద వాహనాలు పార్క్ చేసినా
తనకున్న స్థలం కన్నా ఎక్కువ రోడ్డును కబ్జా చేసినా
రోడ్డు మీదకు వచ్చేలా ఇల్లు కట్టినా
ఆ క్రమంలో రోడ్డు మీది పచ్చని చెట్లను నేల కూల్చినా
ప్రహరి గోడలు రోడ్డులోకి చొచ్చుకు వచ్చినా
నది వీధిలోకి వచ్చేలా రాంపులు అమర్చినా
రోడ్డును ఏ విధంగానైనా ఆక్రమించినా
వీధి కాలువలు ఎవరికీ వారు అనుకూలంగా ఎక్కువగా మూసినా
ఇంటిలోని చెత్త వీధి మూలల్లో పార వేసినా
బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగినా
మూత్ర విసర్జన చేసినా
మద్యం తాగి భయభ్రాంతుల్ని చేస్తూ బండి నడిపినా
1 8 లోపు చిన్నపిల్లలకు బండి ఇచ్చినా
చెవిలో సెల్లుతో మెడను వంచి బండి నడిపినా
సెల్లు ఉందికదా అని బిగ్గరగా అరిచినా
నది వీధిలో చప్పట్లు కొట్టి పిలిచినా
వీధుల్లో కాగితాలు చింపి పారవేసినా
వీదులను ఏ విధంగా నైనా అశుభ్రం చేసినా
పందులు ఆవుల వంటివి పట్టణ వీధుల్లోకి వదిలినా
మీటర్లు బిగించుకోకుండా నీటి చౌర్యానికి పాల్పడినా
సక్రమంగా బిల్లులు చెల్లించకున్నా, ఎగ్గొట్టినా
ఇంకా ఇంకా .....................................
ఎవరు అమానవీయంగా వ్యవహరించినా
ఎక్కడి కక్కడ నిలదీయాలి, ఎంతటి వారైనా సరే నిగ్గదీసి అడగాలి
ఇలాటి వారికి పెద్దమొత్తంలో జరిమానా వేయాలి కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి
మనం మాత్రమే బాగుంటే చాలదు –ఇతరులు సైతం బాగుండాలి
ఇతరుల స్వేచ్చా స్వాతంత్ర్యాలకు మనం భంగం కలిగించ కుండాలి
(నేరాలు కాని నేరాలు ఇవి –నన్ను కలవర పెట్టే సంఘటనలు ఇవి - నిత్యం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సన్నివేశాలు ఇవి –అందరికి ఎంతో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఇవి -ఇంకా కొన్ని వికారాలు చిన్న చిన్ననేరాలు మీకు తెలిసే ఉంటాయి -మీరూ కూడా స్పందించండి )
సంఘర్షణ లోంచే
అద్భుతాలు సృష్టిస్తావు
సంగీతం రాకున్నా
సరిగమలు పలికిస్తావు
సంకల్పం ఉంటె
అనుకున్నది ఏదయినా సాధిస్తావు
సందేహం సంశయం
దహిస్తుంటే న్యూనత వేధిస్తుంటే
సాధ్యం కాదని
సన్నాయి నొక్కులు నొక్కుతావు
నిస్త్రాణ గా నిర్లిప్తంగా
పడివుంటే ఏముంది
నీలోని శక్తి యుక్తుల్ని
ప్రయోగించి చూడు
నిప్పులు చెరుగుకొంటు
నింగికి ఎగురుతావు
నిరాశా నిస్పృహలు
చుట్టూ ముట్టితే
నిర్దాక్షిణ్యంగా
నేల పైకి ఒరిగి పోతావు
దేనికయినా కావాలి ఒక ఆలోచన -
దానిని వెంటాడాలి కార్యాచరణ

27, అక్టోబర్ 2017, శుక్రవారం

గులాబిలా 
విరబూయాలనుకొంటున్నావా 
గుప్పెడు పరిమళాలు 
వెదజల్లాలనుకొంటున్నావా
అయితే 
ముళ్ళతో చెలిమి చెయడం
అలవాటు చేసుకో
కడగండ్లతో కల్లోలంతో
కలిసి బ్రతకడం నేర్చుకో

నిన్ను వెంటాడే కష్టాలు నీకు వన్నె తెస్తాయి
కష్టాల కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతా
Image may contain: flower, plant and nature

అద్బుతంగా జీవించడానికి 
ఎంతో అవకాశముంది 
ఆనందంగా మసలే 
సమయం ముందుంది 
ఎందుకీ పరుగు పందెం 
ఇంకా ఇంకా జీవితం చాలా చాలా ఉంది 
ఎందుకంత ఉరుకుల పరుగుల వేగం 

పరుగు తీసావా 
మరణం మరింత చేరువ ఔతుంది 
అలాగని అలసిపోతే 
అవసానం ఎదురౌతుంది 
హాయిగా స్థాయిగా 
నింపాదిగా నడవడం నేర్చుకో 

తొందర ఎందుకు చిందరవందర ఎందుకు 
హడావుడి చిడిముడి నడవడి మార్చుకో 

''పరుగులు మానితే పెరుగుతుంది ఆయువు
అలజడి చెలరేగితే తరుము కొస్తుంది రాహువు''
Image may contain: text

మీకోసం పరుగులు పెట్టండి, 
మూటలు కట్టండి, 
జీవితాన్ని చాపలా చుట్టండి 

కాని మీ మనసుకోసం 
మధుమాసాలు మందహాసాలు 
కలిపి కట్టిన ఈ మూటను విప్పండి

నా విజ్ఞాపన ఒక్కటే 
అప్పుడప్పుడైనా 
మీలోకి మీరు అడుగెట్టండి, 
మీ హృదయం తలుపు తట్టండి
జీవిత సత్యం 

ఆట ముగిసాక 
అందరు అక్కడికి చేరవలసిందే 
రాజయినా మంత్రయినా లక్షాదికారయినా 
నిరుపేద అయినా బికారి అయినా ఎవరయినా సరే
చివరికి వల్లకాటిలో చేరి చితి మంటల చిటపట వినవలసిందే

ఈ సత్యం నమ్మి తీరాలి
అది ఎంత చేదయినా బాదాకరమయినా
మనిషి పుట్టుక నాడే మరణం వివరం రాసి ఉంటుంది
ఏ ఆట అయినా మొదలైనాక
ఏదో ఒకనాడు అది తప్పకుండా ముగిసి పోతుంది

ఈ నిజం తెలియకనే
మధ్య లో ఎన్నో కుతంత్రాలు కుప్పిగంతులు
పరుగులు నురుగులు చిరుగులు
లెక్కకు మించిన ఆస్తులు అప్పగింతలు