స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2020, సోమవారం

 నేను

కవిని కాను
నేను వ్రాసేదంతా
కవిత్వం అనలేను

నేను
పండితుణ్ణి కూడా కాను
నాలో పాండిత్యం ఏమాత్రం లేదు
అనవసర పాండిత్యం అసలే లేదు

ఏదీ
తోచనప్పుడు
పూలతో
గాలితో
మేఘాలతో
మేలమాడుతుంటాను

ఊసుబోక
వెన్నెలతో
మల్లెలతో
మందారాలతో
ముచ్చటిస్తుంటాను

ఆ మాటలే
ఆ పాటలే
అక్షరాలకు.
పదాలకు వినిపిస్తుంటాను

అవే
కవితలుగా
కావ్యాలుగా
గీతాలుగా
వెదజల్లుతుంటాను..

దానిని
మీరు కవిత్వం అంటారా
అది మీ ఇష్టం

కాదనడానికి
నేనెవరు
మీ అభీష్టం..

29, జూన్ 2018, శుక్రవారం

ఈ నేను నేను కాదు
ఈ మేను నాది కాదు
ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఏమో
ఎవరో ఒకరు ఇందులోకి వచ్చి వెళుతుంటారు
ఉన్నన్నాళ్ళు అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంటారు
ఈ రూపం నాది కాదు
ఈ పాపం నాది కాదు
ఇది పూర్వ జన్మ కర్మ పరిపాకం
మళ్ళి మనిషిగా పుట్టి అతడు చేసుకున్న నిర్వాకం
ఈ సిరులు నావి కావి
ఈ సంపద నాది కాదు
ఇవి మిన్నాగులు నివసించే సంపెంగ పొదలు
నన్ను నాలోంచి విసిరేసిన కన్నీటి కధలు
నేనిక్కడ కొన్నాళ్ళు న్నానన్నది నిజం
జననం మరణం ప్రతి ప్రాణికి సహజాతి సహజం //

21, ఏప్రిల్ 2018, శనివారం

రామచంద్రుడితడు .రఘువీరుడు'
-------------------------------------------
బాలకృష్ణు డితడు భవదీయుడు
లలిత లలిత భావకవిత
సుతి మెత్తగ రాయగలిగే భావుకుడు //
అవని పైకి అరుదెంచిన ఆమని యితడు
అందరి మదిలో వికసించిన బృందావని యితడు
పదపదమున వినిపించే బృందగానము
ఇట్టె ఆకట్టుకొనే రచనా సంవిధానము //
అనవరతము వినిపించే వేణుగాన మితడు
అరవిరిసిన పువ్వులకు ప్రాణనాథు డితడు
అడుగడుగున మంజుల మృదు మధుర భావము //
ఆ చిన్నారి చిలిపి కృష్ణుని నామధేయ మితడు
అలరించిన అలనాటి కృష్ణ శాస్త్రి యితడు
ప్రణయమై ప్రభవించిన కవితామూర్తి యితడు //
(నిలువెత్తు రాముని ఎదుట నేను ఉన్న చిత్రం చూచాక..ఈ గీతం నేనైతే ఎలా వుంటుందో అన్న భావనతో
నేను చేసిన చిన్న ప్రయత్నం ..)
ఆ శ్రీరామచంద్రునికి భక్తీ ప్రపత్తులతో ప్రణమిల్లు తూ ------
ఓ.. భగవాన్ !
ఇదే నా ప్రార్ధన
ఒకే ఒక అభ్యర్ధన ....
నన్ను నా నుంచి రక్షించు
అనవసరపు ఆలోచనల నుంచి
అర్ధం పర్ధం లేని ఆకలి నుంచి
ఆవేశ కావేషాల నుంచి దూరంగా ఉంచు
నాలోని రాక్షస ప్రవృత్తిని సంహరించు
ఓ దైవమా !
నాలోని అవలక్షణాలను శిక్షించు
అరిషడ్వర్గాలనుంచి
అందరు కోరుకొంటున్న స్వర్గాల నుంచి
అధిక భోగాభాగ్యలనుంచి
సిరిసంపదల నుంచి దారి మరలించి
నాలో జీవించు
నన్ను లాలించు
పరిపాలించు
నా మొర ఆలకించు ..

2, ఏప్రిల్ 2018, సోమవారం

నేనే ఒక మహా కావ్యం
--------------------------
నేను కవిని
కాని కవిత లల్లను
ఏ కావ్యాలు రాయను
నేను కవినే
జీవితాన్ని కవిత్వంగా రాస్తుంటాను
ప్రతి నిముసాన్ని అందంగా చెక్కుతుంటాను
ప్రతి ఆనందాన్ని కావ్యంగా మలుస్తుంటాను
ప్రతి ఉదయం -నాకు పరవశ గీతం
ప్రతి గీతం- నవరస భరితం
నాకు జీవితమే కవిత్వం
నా జీవనమే అద్భుతమైన గ్రంధం
నిన్న నాకు గతం -ఈ రోజు నిజం
రేపు ఏమో, ఏమౌతుందో తెలియని అయోమయం
అందుకే జీవితాన్ని
సుందర ప్రబంధంగా వ్రాస్తుంటాను
ప్రతి రోజు పేజిని
మధు మాధుర్యంతో నింపుతుంటాను
ప్రతి దినాన్ని పరిమళ భరితంగా
మకరంద మాధురీ సహితంగా రసరమ్యంగా రవళిస్తుంటాను
కవిత్వం రాయక పోతేనేం !
కావ్యాలు వెలువరించక పోతేనేం
నేను కవినే .......
జనరంజకంగా జీవన కావ్యం రాస్తున్నాను గదా
ఎందఱో పాఠకుల హృదయాల్ని
రంజింప జేస్తున్నాను గదా
అనునిత్యం ఎందఱో నన్ను చదువుతుంటారు
నా జీవితాన్ని ఒక గీతంగా పాడుతుంటారు
ప్రతి కవితని ఎదురైన వారికీ
అద్భుతంగా వినిపిస్తుంటారు
ఎంత గొప్ప కవిత్వమో అని
అందరు ప్రశంసిస్తుంటారు
నా దైనందిన జీవనం
గంధర్వ గానమని పరవశిస్తుంటారు
నా జీవితం నిండా
ఆమని నడచి వచ్చిన ఆనవాళ్ళు
దారి పొడవునా
అరవిరిసిన నవ వికసిత కుసుమాలు
నా జీవన కావ్యమంతా
కోమల సుమ దళముల పరిమళాలు
ఎలకోయిల కుహూరవాలు,
చల్లని వెన్నెల విహారాలు
మృదు మందహాసాలు,
నులి వెచ్చని పరిష్వంగాలు
నా జీవన ప్రాంగణంలో
ముళ్లుండవు రాళ్లుండవు
కంటకాలుండవు
కారు చీకటి దారులుండవు
కాలకూట విషాలు విషాదాలు
అసలే ఉండవు
అంతటా పచ్చని మైదానాలే
పంట పొలాలే
హాయి గొలుపు సమీరాలే
హరి విల్లుల ద్వారాలే
సువిశాల ప్రాంగణంలో
సుందర నందన వనాలే
సిరి మల్లెల అల్లరులే,
చిరు నవ్వుల సందడులే
నా జీవన సుక్షేత్రం లో
అలరించే తరువులే సుమదుర ఫలాలే
హరిత భరిత వృక్షాలే కమనీయ రమణీయ దృశ్యాలే
నా రచనలన్నీ అమలిన భావాలే అమృత రావాలే
నా కలం పలికించినవి భావ గీతాలే
మధుర మనోహర మంజుల రాగాలే
చెరిగి పోని శిలాక్షరాలతో
నా జీవన కావ్యం రచిస్తున్నాను
ఒక్కొక్క రోజుని
ఒక్కొక్క గీతంగా రవళిస్తున్నాను
ఎదురైన ప్రతి మనిషి
ఒక చరణం గా లిఖిస్తున్నాను
ఎన్ని వందల గీతాలు రాసానో లెక్కలేదు
ప్రతి సన్నివేశం ప్రతి సందర్భం
ఒక కావ్యం గా
ఎన్ని కావ్యాలు రచించానో గుర్తు లేదు
నేను కవిని
నేను వ్రాసేది జీవితం
నా జీవితమే కవిత్వం
నేనే... ఒక మహా కావ్యం ..
రామచంద్రుడితడు .రఘువీరుడు'
-------------------------------------------
బాలకృష్ణు డితడు భవదీయుడు
లలిత లలిత భావకవిత
సుతి మెత్తగ రాయగలిగే భావుకుడు //
అవని పైకి అరుదెంచిన ఆమని యితడు
అందరి మదిలో వికసించిన బృందావని యితడు
పదపదమున వినిపించే బృందగానము
ఇట్టె ఆకట్టుకొనే రచనా సంవిధానము //
అనవరతము వినిపించే వేణుగాన మితడు
అరవిరిసిన పువ్వులకు ప్రాణనాథు డితడు
అడుగడుగున మంజుల మృదు మధుర భావము //
ఆ చిన్నారి చిలిపి కృష్ణుని నామధేయ మితడు
అలరించిన అలనాటి కృష్ణ శాస్త్రి యితడు
ప్రణయమై ప్రభవించిన కవితామూర్తి యితడు //
(నిలువెత్తు రాముని ఎదుట నేను ఉన్న చిత్రం చూచాక..ఈ గీతం నేనైతే ఎలా వుంటుందో అన్న భావనతో
నేను చేసిన చిన్న ప్రయత్నం ..)
ఆ శ్రీరామచంద్రునికి భక్తీ ప్రపత్తులతో ప్రణమిల్లు తూ ------

30, జనవరి 2018, మంగళవారం

నాడు పేరెన్నిక గన్న కళాశాల,
కావలి జవహర్ భారతి
సాటిలేని మేటి అధ్యాపకుల
ధీనిధితో నిర్మించిన వారధి
వారి సన్నిధిలో ఎన్ని ప్రహసనాలో 
ఎన్ని సన్నివేశాలో ..
నాలోని కళాభినివేశానికి అక్కడే అందుకున్నా వెన్నెల హారతి
కావలి కళాశాలలో విద్యాభ్యాసం నా అదృష్టం . నేను అక్కడ చేరిన సంవత్సరమే కళాశాల పేరు జవహర్ భారతి గా మారింది .
ఆ నిలువెత్తు భవనం- టి ఆర్ ఆర్ బిల్డింగ్స్ లో 4 ఏళ్ళు అభ్యాసం ఒక అద్భుతం -
ఎదురుగా ‘రుతురంగ్’ బొటనికల్ గార్డెన్, పక్కనే టాంపో లైబ్రరీ -అక్కడే చలం శరత్ ఇలా ఎందఱో కవుల పరిచయం, ఎన్నెన్నో సదస్సుల ప్రాంగణం ఎం ఎం హాల్ ఇంకా దక్షిణాన విశ్వోదయ కళా ప్రాంగణం ఎన్నిమధురమైన జ్ఞాపకాలో ...
జవహర్ భారతిలో నన్ను నేను మనిషిగా కవిగా తీర్చి దిద్దుకున్న విధానం ..ఒక అపురూప జ్ఞాపకం . కళాశాల స్థాపకులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఆ విద్యాలయాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్డారో
అక్కడి ఆనాటి అధ్యాపకులు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు భుజంగరాయ శర్మ గారు ,D R ,GGK, NSR మాణిక్యాల రావు, మాధవరావు, రామచంద్రారెడ్డి గారు ... ఇలా ఇంకా ఎందఱో
ఎందుకో ఈ గతాన్ని ,అద్భుతాన్ని ప్రాంగణాన్ని పరిసరాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని అనిపించింది

18, జనవరి 2018, గురువారం

కవితే కాదు ఆయన మనిషి అతి మధురం
తన కలం నిండా సిరా బదులు తేనెలు నింపి రాస్తారు కాబోలు 
ఆయన రాసే కవితలోని ప్రతి పదం తేనెలూరు తూనె వుంటుంది
ఏ అల్లసాని పెద్దనో కవిసార్వభౌమ శ్రీ నాధుడో
మళ్ళీ భువిపై పుట్టరని పిస్తుంది
పిల్లగాలుల చల్లదనం చల్లేందుకే 
ఆయన కలం పట్టరని పిస్తుంది...

ఏది ఏమైన ఆయన తన కవనవనం నిండా
ప్రేమలూరే చల్లగాలులు పంచే చెట్లే
ఆయన కవితల నిండా ఆహ్లాదం మనషికి పంచే పట్లే
 —

నేను సైతం..
--------------
తెలుగులో తీర్పులు
లేవని ఫిర్యాదు చేసే మిత్రులు
అసలు తీర్పులు తెలుగులో చెప్పడం ఎలా సాధ్యమవుతుందన్న వారున్నారు
తెలుగు భాష న్యాయ శాస్త్రాన్ని కూడా లొంగదీసుకోగలదని పలువురు న్యాయ శాస్త్ర రచయితలు రుజువు చేశారు
అలాంటివారు న్యాయస్థానాలలో పదవులలో ఉండి ఇచ్చిన కమ్మని తెలుగు తీర్పుల సమాహారమే ఈ గ్రంధం..
.......డా ఏ బి కె ప్రసాద్ అధ్యక్షులు , ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషాసంఘం
ఈ గ్రంధంలో 10 మంది న్యాయమూర్తుల సరసన నేను , నా తీర్పులు చోటు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను

30, అక్టోబర్ 2017, సోమవారం

నా జీవితమే కవిత్వం - నేనే ఒక మహా కావ్యం
------------------------------------------------------------
నేను కవిని
కాని కవిత లల్లను, ఏ కావ్యాలు రాయను
కాని నేను కవినే, జీవితాన్ని కవిత్వంగా రాస్తుంటాను
ప్రతి నిముసాన్ని అందంగా చెక్కుతుంటాను,
ప్రతి ఆనందాన్ని కావ్యంగా మలుస్తుంటాను
ప్రతి ఉదయం నాకు పరవశ గీతం .
ఎదురైన ప్రతి మనిషి అందులో అందమైన చరణం
ప్రతి గీతం నవరస భరితం. నాకు జీవితమే కవిత్వం.
నా జీవనమే అద్భుతమైన గ్రంధం
నిన్న నాకు గతం. ఈ రోజు నిజం,
రేపు ఏమో ఏమౌతుందో తెలియని అయోమయం
అందుకే జీవితాన్ని సుందర ప్రబంధంగా వ్రాస్తుంటాను.
ప్రతి రోజు పేజిని మధు మాధుర్యంతో నింపుతుంటాను
ప్రతి దినాన్ని పరిమళ భరితంగా.
మకరంద మాధురీ సహితంగా, రసరమ్యంగా రవళిస్తుంటాను
కవిత్వం రాయక పోతేనేం,
కావ్యాలు వెలువరించక పోతేనేం - నేను కవినే
జనరంజకంగా జీవన కావ్యం రాస్తున్నాను గదా,
ఎన్నో హృదయాల్ని రంజింప జేస్తున్నాను గదా
అనునిత్యం ఎందఱో నన్ను చదువుతుంటారు
నా జీవితాన్ని ఒక గీతంగా పాడుతుంటారు
నా ప్రతి కవితని ఎదురైన వారికీ అద్భుతంగా వినిపిస్తుంటారు
ఎంత గొప్ప కవిత్వమో అని అందరు ప్రశంసిస్తుంటారు
నా దైనందిన జీవనం గంధర్వ గానమని పరవశిస్తుంటారు
నా జీవితం నిండా ఆమని నడచి వచ్చిన ఆనవాళ్ళు ,
దారి పొడవునా అరవిరిసిన నవ వికసిత కుసుమాలు
నా జీవన కావ్యమంతా కోమల సుమ దళాల పరిమళాలు ,
ఎలకోయిల కుహురవాలు, చల్లని వెన్నెల విహారాలు
మృదు మందహాసాలు, నులి వెచ్చని గాఢ పరిష్వంగాలు
నా జీవన ప్రాంగణం లో ముళ్లుండవు, రాళ్లుండవు,
కన్నీళ్ళు ఉండవు, కంటకాలుండవు
కారు చీకటి దారులుండవు,
కాలకూట విషాలు విషాదాలు అసలే ఉండవు
అంతటా పచ్చని మైదానాలే, పంట పొలాలే,
హాయి గొలుపు సమీరాలే, హరి విల్లుల ద్వారాలే
సుందర నందన వనాలే, సిరి మల్లెల అల్లరులే చిరు నవ్వుల సందడులే
నా రచనలన్నీ అమలిన భావాలే అమృతారావాలే
నా కలం పలికించినవి భావ గీతాలే, మధుర మనోహర మంజుల రాగాలే
చెరిగి పోని శిలాక్షరాలతో నా జీవన కావ్యం రచిస్తున్నాను
ఎన్ని వందల గీతాలు రాసానో లెక్కలేదు.
ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం ఒక కావ్యం గా
ఎన్ని కవితలు రచించానో గుర్తు లేదు .
ఎన్ని కావ్యాలు రానున్నవో చెప్పలేను
నేను కవిని. నేను వ్రాసేది జీవితం
నా జీవితమే కవిత్వం నేనే ఒక మహా కావ్యం
ఎన్నో అనుబంధాలు
ఎన్నో సుమగంధాలు
కనుచూపు మేర ఎన్నెన్నో
మమతల మకరందాలు మధుగీతాలు
కడవూపిరిదాకా ఎన్నెన్నో 
ప్రయాణాలు ప్రహసనాలు ప్రమాణాలు
ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఈ జీవనయానంలో
ఎన్ని సంవత్సరాలు గతించినా
అమితానందంతో
ఆమని శుభసంకేతంతో
తన ఉదార కేదారంలో
నవమాసాలు మోసి
ఉదయ కాంతికి ఊపిరులూదిన
అమ్మతో అనుబంధం మాత్రం
మరో తొమ్మిది నెలలు అదనం
ఆనాడే మొదలైనది జననం
ఆ మాతృమూర్తి రచించినదే ఈ కధనం
అమ్మ అనురాగం అనంతం అమూల్యం
ఎన్నటికి అది వసివాడని జ్ఞాపకం
అమ్మ !
ఒక కమ్మని నమ్మకం
నువ్వు నేనే కాదు
ఈ జగమంతా అమ్మ చేసిన సంతకం
ఈ జనమంతా
ఆ దేవత ఆలపించిన జయగీతం
అనన్యం అగణ్యం అపురూపం
అమ్మ భావనం అజరామరం
-------అమ్మ తృ తీ య వ ర్ధంతి సం ద ర్భం గా
-----------------కవితా నీరాజనం
Sannidhi means a GOD’s place
where we will have more peace
Sannidhi means a place of divine
where one can always shine
Sannidhi is our Grand Daughter
we are sure …
she likes us more than Harry potter
our Sannidhi is crossing today eleven
we wish her future as bright as heaven
Best wishes and happy returns of the day
our little Angel
Good luck
your Grand parents
nanamma – tatayya
నాలో నేను_ నాతో నేను ==నా రాబోయే కావ్యం (ముందు మాట)
ఎర్రన జన్మించిన నేలలో మొలకెత్తాను
కావలి జవహర్ భారతి కళాశాలలో కవిగా ఆవిర్భవించాను
న్యాయశాఖలో ఉద్యోగించాను పదేళ్ళు న్యాయమూర్తి పీఠం అధిష్టించాను
ప్రణయకవిగా గీత రచయితగా కొన్ని కావ్యాలకు శ్రీకారం చుట్టాను
'పుప్పొడి రాలిన చప్పుడు' విన్నాను
'కోయిలని రా 'రమ్మన్నాను
'ఎచటికోయి నీ పయనం' అని మనిషిని నిలదీసాను
'కిలికించితాలు' 'మువ్వలవేణువులు' రవళించాను
''చినుకుల'లో తడిసాను
ఊహల గుసగుసలు' విన్నాను వినిపించాను
'నిన్ను నీవు తెలుసుకో' అని హెచ్చరించాను
విధి వక్రించిన వేళ 'నువ్వులేను నేను ' స్మృతి కావ్య మైనాను
'ఆరడుగుల నేల ఆహ్వానం'' అందరిని వినమన్నాను
'మనసు పలికిన వేళ' మౌన రాగాన్నై నా గీతాలు
బాలు సునీతల గళంలో రవళించాను
నా కవితలలోని ' ప్రణయ తత్త్వం 'విశ్వవిద్యాలయంలో భద్రపరిచాను
నిన్ననే
నా 'గుండె గోడు' విన్నవిం చు కున్నాను
ప్రతి మనిషిని' నువ్వు మనిషివా' అని ప్రశ్నించాను
'కాలం సాక్షిగా'' కొన్ని నిజాలు చెప్పాను
'ఆలాపనలు సల్లాపములు' , 'చిలిపి సరాగాలు' ,
'అపురూపాలు' రాసి పోసి ప్రణ'యనాదం చేశాను
నేను ప్రణయాన్ని ప్రసూనాన్ని ప్రభాతాన్ని ప్రజాకవిని

27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎన్నో అనుబంధాలు 
ఎన్నో సుమగంధాలు 
కనుచూపు మేర ఎన్నెన్నో 
మమతల మకరందాలు మధుగీతాలు 
కడవూపిరిదాకా ఎన్నెన్నో 
ప్రయాణాలు ప్రహసనాలు ప్రమాణాలు

ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఈ జీవనయానంలో
ఎన్ని సంవత్సరాలు గతించినా
అమితానందంతో
ఆమని శుభసంకేతంతో
తన ఉదార కేదారంలో
నవమాసాలు మోసి
ఉదయ కాంతికి ఊపిరులూదిన
అమ్మతో అనుబంధం మాత్రం
మరో తొమ్మిది నెలలు అదనం
ఆనాడే మొదలైనది జననం
ఆ మాతృమూర్తి రచించినదే ఈ కధనం
అమ్మ అనురాగం అనంతం అమూల్యం
ఎన్నటికి అది వసివాడని జ్ఞాపకం
అమ్మ !
ఒక కమ్మని నమ్మకం
నువ్వు నేనే కాదు
ఈ జగమంతా అమ్మ చేసిన సంతకం
ఈ జనమంతా
ఆ దేవత ఆలపించిన జయగీతం

అనన్యం అగణ్యం అపురూపం
అమ్మ భావనం అజరామరం

-------అమ్మ తృ తీ య వ ర్ధంతి సం ద ర్భం గా Image may contain: 2 people
-----------------కవితా నీరాజనం
బాలకృష్ణుని వేషం నాది
బాలభానుని రూపం నాది
బాల రసాల సాల
నవపల్లవ కవితావేశం నాది

నాలో నేను_ నాతో నేను ==నా రాబోయే కావ్యం (ముందు మాట)

ఎర్రన జన్మించిన నేలలో మొలకెత్తాను
కావలి జవహర్ భారతి కళాశాలలో కవిగా ఆవిర్భవించాను
న్యాయశాఖలో ఉద్యోగించాను పదేళ్ళు న్యాయమూర్తి పీఠం అధిష్టించాను
ప్రణయకవిగా గీత రచయితగా కొన్ని కావ్యాలకు శ్రీకారం చుట్టాను

'పుప్పొడి రాలిన చప్పుడు' విన్నాను
'కోయిలని రా 'రమ్మన్నాను
'ఎచటికోయి నీ పయనం' అని మనిషిని నిలదీసాను
'కిలికించితాలు' 'మువ్వలవేణువులు' రవళించాను
''చినుకుల'లో తడిసాను
ఊహల గుసగుసలు' విన్నాను వినిపించాను
'నిన్ను నీవు తెలుసుకో' అని హెచ్చరించాను
విధి వక్రించిన వేళ 'నువ్వులేను నేను ' స్మృతి కావ్య మైనాను
'ఆరడుగుల నేల ఆహ్వానం'' అందరిని వినమన్నాను
'మనసు పలికిన వేళ' మౌన రాగాన్నై నా గీతాలు
బాలు సునీతల గళంలో రవళించాను
నా కవితలలోని ' ప్రణయ తత్త్వం 'విశ్వవిద్యాలయంలో భద్రపరిచాను

నిన్ననే
నా 'గుండె గోడు' విన్నవిం చు కున్నాను
ప్రతి మనిషిని' నువ్వు మనిషివా' అని ప్రశ్నించాను
'కాలం సాక్షిగా'' కొన్ని నిజాలు చెప్పాను
'ఆలాపనలు సల్లాపములు' , 'చిలిపి సరాగాలు' ,
'అపురూపాలు' రాసి పోసి ప్రణ'యనాదం చేశాను

నేను ప్రణయాన్ని ప్రసూనాన్ని ప్రభాతాన్ని ప్రజాకవిని
Image may contain: 4 people, text
ఇంకేమి వ్రాయను !
ప్రణయ సౌందర్య హర్మ్య 
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప 

ఇంకేమి పాడను !
సుందర సుమధుర మనోజ్ఞ ప్రణయ
సుమ గీతికలు తప్ప

కనుపింపదు ఇంకేది !
సౌందర్య గిరి సానువుల చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ సంచయము తప్ప

వినిపింపదు ఇంకేది !
శృంగార సాలభంజికల పద మంజీర
మంజుల సంగీత విభావరి తప్ప

నా భావం .........
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న ఎలకోయిల

నా ధ్యానం .....
ఆ పాట ప్రతి చరణమ్ములో పొదిగిన
ప్రణయాక్షరాల ప్రసూన మాల

డా సినారే ఆవిష్కరించిన నా మొదటి కావ్యం ‘’పుప్పొడి రాలిన చప్పుడు’’ (1999)లోని చివరి కవిత –వారిని సంస్మరించు కొంటూ, వారికి నివాళి అర్పిస్తూ ---------
Image may contain: 2 people, people smiling, people standing and indoor
నాన్నా !Image may contain: 2 people, people sitting
మనం ఉత్తరాలు రాసుకుని చాలా కాలం అయింది కదూ! నేను హాస్టల్ లో ఉన్నప్పుడు కేవలం నన్ను పలకరించడం కోసమే రోజుకో ఉత్తరం రాసేవాడివి. అప్పట్లో ఫోన్ వాడకం ముఖ్యమైన విషయాలకే పరిమితమై ఉండేది.

తమ పిల్లల జీవితం నందనవనంలా ఉండాలని ప్రతి తల్లీతండ్రీ కోరుకుంటారు. ఆ నందనవనానికి నాందీ వాక్యం గురించి ఆలోచిస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి.

ఓ మబ్బు పట్టిన సాయంత్రం...ఊరికే... కేవలం ఊరికే, మనకు అప్పుడు టివియస్ ఉండేది. నువ్వూ, నేనూ, తమ్ముడూ జిటి రోడ్డు మీద ఓ రెండు కిలోమీటర్లు వెళ్ళి చిన్న బ్రిడ్జి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకోవడం గుర్తొచ్చింది. ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు కాని ఆ సాయంత్రం మాత్రం అలా ఓ చక్కటి జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలతో అలాంటి అందమైన సాయంత్రాలు ఎన్నో కేవలం ఊరికే... తీరిగ్గా కూర్చుని గడపగలిగే అదృష్టానికి ఆ సాయంత్రం బీజం వేసింది. 

అప్పుడప్పుడూ మమ్మల్ని నీతో పాటు మీ ఆఫీస్ కు తీసుకువెళ్ళేవాడివి. కోర్టు ఆవరణలోకి వెళ్ళగానే దారి పక్కగా కనిపించే పెరివింకల్ పువ్వుల రంగు, అవి దాటి లోపలకు వెళ్ళగానే గదిలో వినిపించే టైప్ మిషన్ టకటక శబ్దం ఇప్పటికీ తాజాగా గుర్తున్నాయ్. అప్పుడు అనుకోలేదు కాని తరువాత మా జీవితాలను పిల్లలకు పరిచయం చెయ్యాలనే ఆలోచనకు పునాది ఆ జ్ఞాపకం.

ఏ పండగో వస్తే బడికి సెలవొస్తుందిగా, రెండు జతలు బట్టలు బాగ్ లో పెట్టుకుని బస్ స్టాండ్ కు వెళ్ళిపోవడమే. ఒక్కోసారి ఈ ఊరా ఆ ఊరా అని కూడా అనుకునేవాళ్ళం కాదు. కావలో, ఉలవపాడో, గుడ్లూరో... ముందుగా ఏ బస్ వస్తే ఆ ఊరికి అటు అత్తా వాళ్ళింటికి కాని నాన్నమ్మ వాళ్ళింటికి కాని, పిన్ని వాళ్ళింటికి కాని. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళెవరికీ కూడా చెప్పాపెట్టకుండా చుట్టాలొచ్చారు, ఇప్పుడెట్లా అనే భావం ఉండేది కాదు. మొహమంతా వెలిగిపోతుండగా "రాండి...రాండి. సరైన టయానికి వచ్చారు. తోట కాడ్నించి మామిడి పళ్ళు దెచ్చినారు, దక్షిణపు గట్ల మీద తాటికాయలు ముదిరుండాయి, నిన్నే మచ్చల బర్రె ఈనింది. జున్నెట్లా పంపాలా అనుకుంటుండాం, " అంటూ లోపలకు తీసుకెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఇంటికి ఎవరైనా వస్తే అదే భావంతో వారిని ఆహ్వానించగలుగుతున్నామంటే ఆనాటి ఆనుభూతి పదిలంగా మనసులో నిలిచిపోవడమే కారణం. 

ఓ పత్రికో పుస్తకమో చదువుతూ నచ్చిన వాక్యాలు పెద్దగా చదివి వినిపించడం నీకు అలవాటు. వింటూ బావున్నాయని అనుకున్నానే కాని అవి నాలో సాహిత్యాభిలాష పెంచే విత్తనాలని తరువాత కదా అర్థం అయ్యింది. చందమామ, బాలమిత్రలతో మొదలై చతుర, విపుల, ఆంధ్రభూమి ఆ తరువాత యద్దనపూడి, ఆరెకపూడి, పురాణం సీత, మాలతీ చెందూర్, చలం ఇలాంటి పరిచయాలతోనేగా జీవితానికో నిర్దుష్టమైన అభిప్రాయం ఏర్పరిచింది. 

నీకు ఏవేవో ఆశయాలు అవీ ఉండేవి. లంచం తీసుకోవడం తప్పు, అలాగే అప్పు చేయడం ఇక మద్యపానం అంటే మహా నేరం. ఆ రోజుల్లో నీ ఒక్కడికే కాక జనాంతికంగా కూడా అవే అభిప్రాయాలు ఉండేవి. మారినకాలంతో పాటు ఎన్నో మార్పులు... లక్షీదేవి ఆదిపత్యంలోకి వచ్చాక, మంచి చెడు మధ్యనుండే అడ్డుగోడను లౌక్యం మేఘంలా కమ్మేసింది. భౌతికంగా సుఖమయ జీవినప్రమాణస్థాయి పెరిగినా మానసికంగా అల్లకల్లోలమవుతున్నవారే ఎక్కువ. ఈ మార్పులకు లోనవక నిటారుగా నిలబడగలిగామంటే ఆ నాడు మీరాచరించి చూపిన విచక్షణే కారణం. 

నాకు సరిగ్గా గుర్తులేదు కాని బహుశా నేను ఇంటర్ లో చేరినప్పుడనుకుంటాను ఓ రోజు ముందుగదిలో మనందరం కూర్చుని ఉన్నప్పుడు అతిశయోక్తి కాని, అబద్డంకాని కాని జోడించకుండా మన ఆదాయం ఖర్చు లెక్కలన్నీ వివరంగా చెప్పావు. అందువల్లనే నువ్వు వంద రూపాయలు చేతికిచ్చినా తమ్ముడికి కాని నాకు కాని పదే ఖర్చు చెయ్యాలని చెప్పకుండానే అర్ధం అయింది. అందులో మేము సర్దుకుని బ్రతికిందీ లేదూ, అలా అని చాలకపోవడమూ లేదు. అంతా సహజంగానే. ఆస్తిపాస్తులు లేకపోయినా ఏ రోజు పేదగా బ్రతకలేదు. ఆనాటి మీ ఆ జీవిన విధానమే మాకు జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కునే ధైర్యం ఇచ్చింది. 

అమ్మాయి మైనస్ అబ్బాయి ప్లస్ అనుకునే రోజుల్లో కదా పుట్టాను. అందులో అవి పిల్లలను డాక్టర్లనో, ఇంజనీర్లనో చెయ్యాలనుకునే రోజులు కూడానూ. మమ్మల్నిద్దర్నీ సమానంగా చూడడమే కాక మీ అభిప్రాయాలను మా మీద రుద్దకుండా మా భవిష్యత్తు పూర్తిగా మా చేతుల్లో వదిలి మా నిర్ణయమేదైనా ఆమోదించారు. ఆ ఆత్మవిస్వాసంతోనే జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేయగలిగాను. ఒకవేళ నాకు జీవితాన్ని వెనక్కి తిప్పగలిగే అవకాశం వచ్చినా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకుంటాను. 

నలభై, యాభై యేళ్ల క్రితం ఎవరైతే నీకు ముఖ్య స్నేహితులో ఇప్పటికీ మీ మధ్య అదే స్నేహం. వాళ్ళ పట్ల నీ అభిప్రాయం మారలేదు. అది ఆ స్నేహం గొప్పతనమని నీవన్నా అది నీ గొప్పతనమేమని నాకనిపిస్తుంది. మనింట్లో ఓ వ్యక్తి గురించి గాని, ఓ సంఘటన గురించి గాని పదే పదే చెడ్డగా మాట్లాడే అలవాటులేదు. అది బహుశా నాన్నమ్మ వాళ్ళింటి నుంచి వచ్చిన అలవాటు కావచ్చు. తాతయ్య పోయి ముప్పై ఏళ్ళయినా ఈ నాటికీ ఆయనను గుర్తు చేసుకోవడం కోసం ఎడాదికో రోజు మీరంతా కలుస్తున్నారు. "మాకే కష్టమొచ్చినా మా అన్నకు చెప్పుకుంటామమ్మా ఆయనేగా మాకు పెద్ద" అని అరవై యేడేళ్ళ బాబాయి అన్నప్పుడు అబ్బురంగా అనిపించింది, గుండె తడి అర్ధం అయింది. ఆ అనుబంధాల తీవ్రత ఇప్పుడు లేకపోయినప్పటికీ ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మౌనంగా భరించగలిగి, మరిచిపోగలిగిన పరిణితి ఇచ్చింది. జీవిత కాలపు స్నేహాలను నిలుపుకోగలిన అదృష్టాన్నిచ్చింది.

నాన్నా ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో నువ్వు నమ్మిన సిద్ధాంతాలు తారుమారవడం, విలువలకు అర్థాలు మారడం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోగలను. నీ జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. బాధపడడానికి , నీ బాధ వ్యక్తం చేయడానికి సహేతుకమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. కాని విధికి తలవంచి జరిగిన వాటిని తలచుకుంటూ కోర్చోక పరిస్థితులను ఎదుర్కొని సంతోషంగా గడపగలుగుతున్న నీ జీవితం మాకే కాదు ఎందరికో ఆదర్శం. 

ప్రస్తుతం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఏవేవో అనిపిస్తూ ఉన్నాయి. వీధిలో చెత్త వేసినట్లు సోషల్ మీడియాల్లో విషం చిమ్మడం చూస్తుంటే బాధ వేస్తోంది. ప్రముఖులమని చెప్పుకుంటున్న వారు వేస్తున్న పిల్లిమొగ్గలను చూసి బాధతో కూడిన నవ్వు వస్తోంది. ముఖ్యంగా నలుగురిలో గుర్తింపు కోసం తమ కోరికలను పిల్లల మీద రుద్దడం చూసి బాధనిపిస్తోంది. తల్లిదండ్రుల ప్రోద్భలంతో సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకున్న వారు సంతోషంగా ఉండగలుగుతున్నారా? సంతృప్తితో జీవితాన్ని గడపగలుగుతున్నారా? 

"నేనెలాంటి నిర్ణయం తీసుకున్నా మా నాన్న సమర్ధిస్తారు. నా అడుగులు తడబడినప్పుడు ఫరవాలేదులే అని భుజం తడతారు, నన్ను నన్నుగా మా నాన్న ఆమోదిస్తారు". ఇలాంటివి కదా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేది. అదిలేని వారు ఎంత గొప్ప పదవులలో ఉన్నా ఉద్యోగాలు చేస్తున్నా అత్మన్యూనతతో బాధపడుతూ జీవితాన్ని కోల్పోతారని ఎంత మంది నాన్నలకు తెలుస్తుంది? 

అక్షరాలు అందంగా రాయడం నేర్పింది అమ్మయితే ఆ అక్షరాలకు అర్ధం చెప్పింది నువ్వు. 

Happy Fathers Day Nanna. -jyothirmayi 

నా జీవితం ఒక పారదర్శకమైన అద్దమై -నా హృదయం ఆర్ద్రమై - ఇంతకన్నా ఇంకేమి కావాలి ఒక నాన్నకు
 — with Jyothirmayi Kotha.
ఎంత గొప్పవాడో మంచివాడో ఆ దేవుడు 
అనుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చాడు 
ఇంకా అవసరమని తోచినప్పుడు 
ఆయనే స్వయంగా నాలోకి నడచి వచ్చాడు 

గొప్ప పంటలేవి నేను పండించ లేదు 
మనసును కోరికలతో మండించ లేదు 
కనుకనే కాబోలు ఏ వేళలోనైనా 
ఏ ఎండమావి నన్ను దండించలేదు 

ఎప్పుడు వెన్నెలలోనే నా విహారం 
కారుచీకట్లు నాకు ఎంతో దూరం 
ప్రేమ కావ్యాలు రచిస్తున్నానని కాబోలు 
నా జీవన ప్రాంగణమంతా మలయసమీరం
Image may contain: 1 person

నన్ను
సజీవంగా 
ఉదయం దాకా 
నడిపించిన రాత్రికి వందనం 

నన్ను 
ఆప్యాయంగా 
పలకరించిన 
ఈ ఉదయానికి అభివందనం 

నన్ను 
లాలనగా 
ఆలింగనం చేసుకున్న 
తొలికిరణానికి అభినందనం 

ప్రభాత వేళ
నన్ను అలరించాలని 
విరిసిన కుసుమానికి అభినందనం 

ఇన్ని 
అద్భుతాలు నోచుకున్న 
నా జీవితం నిజం నవనందనం