గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జూన్ 2018, శుక్రవారం

ఒక వాన పాట..
----//------
ఒక చినుకు
పలికింది ఓంకారం
ఒక చినుకు
అలదింది సిందూరం
ఒక చినుకు
చుట్టింది శ్రీకారం
ఒక చినుకు
మీటింది సింగారం //
పెదవిపైన
పడిన వాన గానమాయెను
అది గుండెపైన
జారగనే జాతరాయెను
నడుము పైన
పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన
మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి
తనువంతా బృంద గానమై
కనుల ముందు
బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి
తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి
పరుగిడగా వనము నవ్వెను
తనువంతా
తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి
మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే
గాలివాన ఆగిపోయెను
ఆదమరచి
మనసు వీణ మూగవోయెను //
ఎన్ని చిలిపిదనాలో
ఆ నవ్వులలో ఉన్నాయి
ఎన్ని పూలవనాలో
ఆ పెదవులపై ఉన్నాయి
ఎన్ని మౌనగీతాలో ఎన్నిపారిజాతాలో
ఎన్ని మూగరాగాలో అన్నదిలే తొలిరేయి //
సిగ్గులు ఎదురైనాయి
నడకలు బరువైనాయి
మల్లెలు మరులైనాయి
మాటలు కరువైనాయి
అగరు పొగలు అత్తరులు వందిమాగధులైనాయి
అన్ని -వంగి వంగి వందనాలు అంటున్నాయి //
ఆ చూపులలో సన్నాయి ,
మంగళ వాద్యాలున్నాయి
ఊపిరిలో మందార మకరంద
పోతన పద్యాలున్నాయి
ఒంగిన ఆ కనుదోయి ఆ ఓరచూపు లెవరికోసమోయి
అది అరవిరిసిన మరుమల్లెల మందహాసమేనోయి //
ఒక శోక గీతం
ఈ రోజు గడిచి పోనీ
ఈ రేయి నడిచి పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన మలిగి పోనీ //
ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //
మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //

2, ఏప్రిల్ 2018, సోమవారం

పాట
--------
ఆనాటి పాట ఒక ప్రభంజనం
అది జనం గుండెల్లో మ్రోగిన ఢమరుకం
ఆ పాట
జన గీతం ..జ్ఞాన సంకేతం
అలనాటి ప్రతి పాట ఒక ఆణిముత్యం
ప్రతి గీతం ...జీవనగీతం
తనని అల్లుకొని అద్భుతమైన సంగీతం
మనం ఏ విధంగా ఆలోచించాలో
ఎంత ఆనందంగా జీవించాలో
సాటి మనిషిని ఎలా ప్రేమించాలో
సమభావం ఎలా సాధించాలో ..
మనిషికి నేర్పిన మౌన పాఠం
మన గుండెల్లోకి దూకిన జలపాతం
ఆ పాట
ఎన్ని హృదయాలను సేద దీర్చిందో
ఎందరిని అక్కున చేర్చుకొని ఓదార్చిందో
ఆమని అందాలు ...
ఎన్ని భువిపైన కుమ్మరించిందో
కాంతి తరంగాలు కొల్లలుగా వెదజల్లిందో
ఎన్ని ఆశల అంతరంగాల బుగ్గ గిల్లిందో
అది ఎన్నటికి వసివాడనిది
ఏనాటికి వన్నె తగ్గనిది
నాలో అల్లిబిల్లిగా
అల్లుకున్న పాటలెన్నో
నన్ను ఆలింగనం చేసుకున్న
సుమధుర గీతాలు ఇంకెన్నో
పాటలాధరాలై
ప్రణయ పరిమళాలై
గంధర్వ గానాలై
మధుర గాదా లహరులై
ఆ పాటవైపే
ఎల్లప్పుడూ నా ప్రయాణం
నన్ను అలరిస్తున్న ఆనాటి పాటకు సాష్టాంగ ప్రణామం
నేను మనిషిని అనేందుకు
ఇదే ఇదే అసలైన ప్రమాణం
ఎగిరి పోతున్న కాలమా
తరిగి పోతున్న ధర్మమా
మనిషిలోని మంచిని కాపాడవేమి.
మధురమైన పాటగా ...పాడవేమి
మానవతను మరలా..
మా నడుమకు తరలించవేమి //
చీకటిలో దాక్కున్నవి సిరిసంపదలు
ఆకలి చేస్తున్నది ఆక్రందన లు
గుక్కపట్టి రోదిస్తున్నవి పూరిగుడిసెలు
ఇంత దయలేని వాళ్ళా ఈ మనుషులు//
పాముల కిరవైనవి చీమల పుట్టలు
పాపం అనకున్నవి దాచిన పొట్టలు
ఎలా తీరాలని ..ఈ ఆకలి శోకం
తలా పిడికెడు ఈ తిలా పాపం//

30, జనవరి 2018, మంగళవారం

ఏ గుండె తలుపు తట్టినా
ఏ మనసులో అడుగెట్టినా
పండు వెన్నెల కనబడదేమి
చిరు నవ్వుల సవ్వడి వినబడదేమి //
ఏవేవో కోరికలు
కన్నీటి చారికలు
ఎన్నెన్నో దురాశలు
నెరవేరని నిరాశలు
ఏమైనదో ఈ మనిషికి
తన మనసుని తరిమేసి
సుఖ శాంతులు మరిచాడు
తన బ్రతుకును బలి చేసి
బడబాగ్నిని వలచాడు //
ఎండ మావుల వెంట
ఎన్నాళ్ళి పరుగులు
ఏ సౌఖ్యం కోసమని
ఈ పాముల పడగలు
ఏమైనదో తన బ్రతుకుకి
ఏరువాక కానరాక
ఏకాకిగ మిగిలాడు
ఏ ఒకరు తోడు లేక
ఒంటరి వాడైనాడు //

30, అక్టోబర్ 2017, సోమవారం

ఒక శోక గీతం
ఈ రోజు గడిచి పోనీ
ఈ రేయి నడిచి పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం 
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన మలిగి పోనీ //
ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //
మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //
ఒక ప్రేమ గీతం
ఎవరయ్యా నువ్వు
విరిశరములు నాపై
ఎందుకు సందిస్తావు 
ఇరు మేనులు చెరి సగమని
బిగి కౌగిలి బందిస్తావు
అది ఏమని నిలదీయగా
చిరు నవ్వులు చిందిస్తావు//
పెదవులపై ఒక గీతం
రచియిస్తావు
నిదుర రాని కలలోనికి
నడిచొస్తావు
శివుని విల్లు అలవోకగ
విరిచేస్తావు
చిలిపి తలపు తెర దీయగ
మది వీణను సవరిస్తావు //
నిలువెల్లా నెలవంకలు
వెలిగిస్తావు
తనువంతా చిరు చెమటలు
తరలిస్తావు
ఊపిరిలో ఉప్పెనలే
రగిలిస్తావు
తగదయ్యా ఇది అంటే
నవ్వేస్తావు //
నా కావ్యం “ఆలాపనలు సల్లాపములు”లో కావ్యకన్నియ తన నోట ఈ (నా)పాట పల్లవి ఆలపిస్తుంది. అది విన్న నా మిత్రుడు డా.. గంజాం శ్రీనివాసమూర్తి ఇంతకూ ఆ పాట కధా కమామిషు ఏమిటి అన్నాడు .ఓంకారం ఎక్కడ పలికిందంటారు అని గూడా ..ఏనాటిదో ఆ పాట మీ ముందుంచాను ఇంతకీ పాట మొత్తం విన్నారుగా మూర్తిగారూ ! మీరే చెప్పండి ఆ చినుకు పలికిన ఓంకారం ఎక్కడో ఏమిటో .......మిత్రులారా మీరు కూడా ---.
ఒక చినుకు పలికింది ఓంకారం
ఒక చినుకు అలదింది సిందూరం
ఒక చినుకు చుట్టింది శ్రీకారం 
ఒక చినుకు మీటింది సింగారం //
పెదవిపైన పడిన వాన గానమాయెను
అది గుండెపైన జారగనే జాతరాయెను
నడుము పైన పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి తనువంతా బృంద గానమై
కనుల ముందు బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి పరుగిడగా వనము నవ్వెను
తనువంతా తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే గాలివాన ఆగిపోయెను
ఆదమరచి మనసు వీణ మూగవోయెను //
ఎండలు మండిపోతున్న వేళ ఒక చల్లని వసంత గీతం మీకోసం
మబ్బులు దిగి వచ్చాయి చినుకుల చరణాలతో
గాలులు కదిలోచ్చాయి మమతల గంధాలతో
నింగి వంగి నేలపై
వేణువు లూదింది
అవని గుండె గానమై
ఆమని విరిసింది //
నందనవన సీమలో నడయాడిన మధుమాసం
నవవసంత వేళలో వినిపించిన ఇతిహాసం
చిన్నారి మమత ఒకటి
కళ్ళు తెరుచుకున్నది
కమ్మని చిరు గీత మొకటి
ఒళ్ళు విరుచుకున్నది //
ఆకుపచ్చ నేలంతా కొత్త పూల పరిమళం
ఆదమరచి జగమంతా వూగుతున్న మధువనం
రంగుల లోకమొకటి
కనులముందు వెలసింది
రమ్యమైన గీతమొకటి
రాగదార సాగింది //
ప్రతి గుండెలో ఒక గీతం ఉంటుంది , ప్రతి జీవితంలో జీవనరాగం ఉంటుంది, ప్రతి రేయి సంగీతం వింటుంది ,ప్రతి హాయి ఒళ్ళు విరుచుకొంటుంది - అనే భావనతో నేను రచించిన గీతమిది
నా గీతాల సంకలనానికి ముందు మాట వ్రాసిన డా సి నారాయణరెడ్డి గారు అంతగా పరిచయం లేని రోజుల్లో నన్ను చూడగానే ఈ పాటలోని ఒక చరణం తో నన్ను పలకరించారు , అది తలచుకొంటే నేటికి ఒక పులకింత నాలో ఒక గిలిగింత
ఆ తర్వాతి కాలంలో ఈ పాట ‘’ ఈ మాసపు పాట’’గా ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుండి ప్రసారమైంది --ఇప్పుడు ఆ పాట మీకోసం
గుండె గుండెలో ఒక గీతం
ఉండే ఉంటుంది
వెండి వీణలా జీవనరాగం
మీటుతు ఉంటుంది
మదిలో ఎదలో పదనిస రాగం
పాటై ఉంటుంది
మనసు సొగసు మల్లెల గుసగుస
వింటూ ఉంటుంది //
కంటి పాపలో నీలాకాశం
నెలవై ఉంటుంది
కంటి చూపులో వెన్నెల మాసం
కొలువై ఉంటుంది
పెదవి మీటితే ఒక మధుమాసం
వధువై వస్తుంది
పదము పాడితే ఒక దరహాసం
వరమే ఇస్తుంది //
సందె గాలిలో జావళి పాట
తోడుగ వస్తుంది
కాలి అందెలో జాబిలి గీతం
వేడుక చేస్తుంది
కుసుమశయ్యపై కుంకుమరాగం
కోవెల కడుతుంది
కుసుమించిన జీవనరాగం
కోయిల ఔతుంది //


ఒక ప్రేమ గీతం
పల్లవి
రండి రండి రండి 
నా గుండెలో కొలువుండి
నా బ్రతుకును పండించండి
ఈ దేవిని కరుణించండి //
చరణం 1 
జాతర చేస్తున్నాయి వొడిలో బొండుమల్లెలు 
జాలిగ చూస్తున్నాయి జడలో సన్నజాజులు 
ఉసూరుమంటున్నాయి మదిలో కన్నె మోజులు 
రారాజులు మీరండి రాజ్యాలు ఏలండి //
చరణం 2
నసపెడుతున్నాయి నిదుర రాని నిసిరాత్రులు
రొదపెడుతున్నాయి అరుణాధర మధుపాత్రలు 
ఇంకెపుడంటు న్నాయి మన ప్రేమయాత్రలు 
పెదవులు కలపండి, సుధలెన్నో కలవండి .//


ఒక గీతం
ఎన్ని చిలిపిదనాలో 
ఆ నవ్వులలో ఉన్నాయి 
ఎన్ని పూలవనాలో 
ఆ పెదవులపై ఉన్నాయి 
ఎన్ని మౌనగీతాలో 
ఎన్నిపారిజాతాలో 
ఎన్ని మూగరాగాలో 
అన్నదిలే తొలిరేయి //
సిగ్గులు ఎదురైనాయి 
నడకలు బరువైనాయి 
మల్లెలు మరులైనాయి 
మాటలు కరువైనాయి 
అగరు పొగలు అత్తరులు 
వందిమాగధులైనాయి 
అన్ని వంగి వందనాలు
వందనాలు అంటున్నాయి //
ఆ చూపులలో సన్నాయి , 
మంగళ వాద్యాలున్నాయి 
ఆ వూపిరిలో మందార 
పోతన పద్యాలున్నాయి
ఆల్చిప్పల కనుపాపలలో 
ఆరాధన ఎవరికోసమోయి 
అది అరవిరిసిన 
మరుమల్లెల మందహాసమేనోయి //
వారం వారం ఒక గీతం -1
గుండెలో ఉండిపో
బ్రతుకంతా నిండిపో
మధుర స్వప్నానివై 
కనుపాపలలో నిలిచిపో
తోడుగా నేనున్నాగా
వేదన మరిచిపో ‘//
ఎన్నెన్నో గీతాలు
పెదవిపైన రాసిపో
ఎవరైనా నిలదీస్తే
ఎదలోన దూరిపో
కురిసే వెన్నెలలో
ముద్దగా తడిసిపో
ఇద్దరమూ ఒకటేనని
నీవు నేనుగా మారిపో
నిన్నలలో మొన్నలలో
ముద్దు ముద్దుగా నడిచిపో
పెదవిపైని చిరు నవ్వును
ఒక కానుకగా ఇచ్చిపో
అప్పుడప్పుడు ఎదలోనికి
అపురూపమైన అతిధిగా వచ్చిపో
ఈ వారం గీతం --౩
హత్తుకో ఇంకా ఇంకా
అల్లుకో వాగు వంకా
జడివానలు నాలో కురిసే దాకా 
సుడి గాలులు చెల రేగే దాకా
వాన వరద ఒకటై
చెరిసగమై పోయే దాకా //
పొంగి పొర్లుతున్నవి పరువాలు
నింగి నంటుతున్నవి విరహాలు
తనువంతా వింత వింత మోహాలు
తనివి తీరని తాపాలు దాహాలు
కారు మేఘమై కదిలి రావయ్యా
కుండపోతగా కురిసి పోవయ్యా//
ఒళ్ళంతా ఓపలేని ఆవిరులు
ఓదార్చ లేవులే ఏ విరులు
మనసున ముసురుకున్న మరులు
ఎక్కడివి ఇన్ని అల్లరులు
కొదమ సింగమై రావయ్యా
కృష్ణునిలా ఎత్తుకు పోవయ్యా //
ఒక దుఃఖ గీతం
ఎచట చూచినా కలితీ
ఏదో తెలియని వెలితి
సిరుల కోసం సంపద కోసం 
తన్ని తగలేసిన నీతి
వెల వెల పోయిన జాతి //
లోభం మోహం స్వార్ధం కోసం
మానవతనే ...మరచిన దోషం
మనసున మమతలు ఏమైనాయో
అసలు మనసు లేమైనాయో
అనురాగం ఒక నాటకం
అనుబంధం ఒక బూటకం
బ్రతుకంతా కరువు కాటకం//
నేనున్నానని నిండుగా పలికే వారు
కష్టాలలో కన్నీటిని తుడిచే వారు
కలికానికి ఒకరైనా కనరారు
అయ్యో కలికాలం ఎవరురా
కల వారు లేనివారు //
సంపాదన ఒకటే ధ్యేయం
ఎంత కావాలో తెలియని సందేహం
స్వార్ధం వంచన అక్రమార్జన
సముపార్జించడమే న్యాయం
ఈ దుర్నీతి దుర్మార్గం దౌర్భాగ్యం
నిరసించే వారుంటే
వారికి నా హృదయ పూర్వక ఆహ్వానం //
ఈ వారం ఒక గీతం--౩
ఒక్క నవ్వు చాలమ్మా
ఒక్క నువ్వు చాలమ్మా
ఒక్కటై పోదామమ్మా 
చుక్కల లోకం చూద్దామమ్మా //
వేయి కనులు చాలవమ్మా
రేయి పగలు కలలమ్మా
ఇంతలేసి కన్నులవి
అంత సేపు మూయకమ్మా
కాంతులీను వెన్నెలలు
కటిక చీకటి చేయకమ్మా //
ఒయీ అని పిలువమ్మా
ఓంకారం అది నాకమ్మా
ఓర్వలేని లోకమమ్మా
ఒంటరి పయనం ఏలమ్మా
ఒద్దికగా యిద్దర మొకటైతే
అది ముద్దు ముచ్చట ఔనమ్మా //
పట్టు చీర కట్టవమ్మ
పట్టపు రాణివి నీవమ్మా
బెట్టు చేయ రాదమ్మ
ఒట్టు వేయ వద్దమ్మా
పల్లకిలోన ఊరేగి
నా ఉల్లంలో చేరవమ్మా//
అమ్మా !
ఏమిటి నా నేరం
నే చేసిన పాపం
నీ పాపగా పుట్టడమేనా
ఆడపిల్లలా అడుగెట్టడమేనా
ఎందుకమ్మా ఈ శాపం
ఎందులకీ శోకం//
మాతృత్వం వరమంటారే
మమతా మమకారాలు
నీ సొంతం అంటారే
చిగురు గానే చిదిమేస్తే
మొగ్గలోనే తుంచేస్తే
ఆ తల్లి బిరుదు ఏలనమ్మా
అమ్మకు అర్ధం లేదమ్మా
నీ జన్మ వ్యర్ధమమ్మా //
నీవూ ఒక అమ్మ పాపవే
ఆమె కలల రూపానివే
నాకీ శిక్ష ఏలనమ్మా
నాపై కక్ష ఎందుకమ్మా
నిను చూడాలని ఉంది
నాకు జన్మ ఇవ్వమ్మా
అమ్మా అని పిలవాలని వుంది
ఆవకాశం ఇవ్వమ్మా //
(భ్రూణ హత్యలు నిరసిస్తూ..ఈ గీతం )
ఈ వారం ఒక గీతం
------------------------------
ఒకరేయి నవ్వింది
ఒయ్యారం రమ్మంది
అయ్యరే రేయంతా 
యవ్వారం లెమ్మంది //
ఎలతేటి వచ్చింది
ఎవరోయి నువ్వంది
ఎదలోకి ఎగిరొచ్చి
ఒక తుమ్మెద ఝుమ్మంది //
ఆవులించి ఒక అందం
ఒళ్ళు విరుచు కొన్నది
ఆదమరచి ఒక గీతం
నన్ను అల్లుకున్నది
కంటి రెప్ప అలిసిపోయి
కల లెన్నో కన్నది
ఆ కల ఏదో తెలిసి పోయి
నాకు కానుకన్నది //
ఆ వివరం ఒక పానుపు
పొంచి పొంచి విన్నది
బిడియాలను బింకాలను
తాను పంచుకున్నది
బుగ్గలపై చెంపలపై
చిత్రాలు గీయమన్నది
తనువంతా తమకంతో
ప్రేమ లేఖ రాయ మన్నది //
ఈ వారం ఒక గీతం
--------------------------------
కంచే చేను మేస్తుంటే
అడుగడుగున వంచన ఎదురౌతుంటే
మనిషిని మనిషే కబళిస్తుంటే 
జాతి జవసత్వా లడుగంటుతు ఉంటె
ఎన్నాళ్ళి మోసం ఇంకా ఎన్నాళ్ళి సహనం
మేదావుల్లారా మౌనం వీడండి
ఈ మధనం ఈ దహనం
ఎన్నాళ్ళో ఆలోచించండి //
ఎటు పోతోంది దేశ సంపద
పొంచి ఉన్నది పెద్ద ఆపద
ఏమౌతున్నవి జాతిఫలాలు
ఎవరా కబళించే క్రూరమృగాలు
ఏలికలారా ఎందుకు మీరండి
ఇందుకు కారకులెవరో చెప్పండి //
దేశం అంటే మనుషులని
మనిషి కోసమే దేశమని
మరచిపోయిన మన నాయకులు
మనిషిని ఓటు అనుకొంటుంటే
ఓటుకు నోటు అంటుంటే
జాతి జనులారా మేలుకొనండి
జాగృతమై ఈ ద్రోహం ఖండించండి //
సంపద అంతా గుట్టలు గుట్టలు
దేశం నిండా పాముల పుట్టలు
ఎన్నాళ్ళి పిదప కాలమని
అక్రందించే ఆకలి పొట్టలు
చలిచీమల్లారా ఏకం కండి
పడగెత్తిన పాముల పని పట్టండి //