18, జనవరి 2018, గురువారం

ఎన్ని కబుర్లు చెప్పాయి
ఎల మావి చిగుళ్లు
ఎన్నెన్ని కధలు చెప్పాయి 
ఎలనాగ నయనాలు
ఎంత సంతసాన
వెల్లిివిరిసాయి
ఆ పెదవి చివర్లు
ఎంత సంబరాన్ని
మోసుకొచ్చాయి
వెన్నెల రాత్రుళ్ళు.
వెన్నెలకు చెప్పాను
నీ కన్నుల తళతళల గురించి
పువ్వులకు చెప్పాను
నీ మేని పరిమళాల గురించి
నీవేమో
ధవళాంబరాలు ధరించి
నా మ్రోల
మోము నరవొంచి
మంద్రస్వరంతో
అంటున్నావు
నేనేనని నీ విరించి
గులాబిలా
విరబూయాలనుకొంటున్నావా
గుప్పెడు పరిమళాలు
వెదజల్లాలనుకొంటున్నావా
అయితే
ముళ్ళతో చెలిమి చేయడం
అలవాటు చేసుకో
కడగండ్లతో కల్లోలంతో
కలిసి బ్రతకడం నేర్చుకో
నిన్ను వెంటాడే కష్టాలు నీకు వన్నె తెస్తాయి
కష్టాల కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి