22, నవంబర్ 2012, గురువారం
15, నవంబర్ 2012, గురువారం
ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ
నేను చూసాను
తెల్లవారక ముందే నురగలు కక్కుకుంటూ పరుగులు తీస్తున్న జనాన్ని ఆ పరుగులు ఆగక ముందే గుండె ఆగి పోయిన దృశ్యాన్ని
నేను చూసాను
ప్రతి మనిషి తోటి మనిషిని కరకర నమిలేస్తున్న సన్నివేశాన్ని
అనుబంధాలు మానవ సంబంధాలు మాయమౌతున్న సందర్భాన్ని
నేను చూసాను పాశ్చాత్య మోజులో పడి అంతరించి పోతున్న మన గొప్ప సంస్కృతిని
మసక బారి పోతున్న మనజాతి జాతకాన్ని
గమనించాను
మమతా సమతా గీతాలు దగ్ధమై పోతున్న లోకాన్ని
మానవత ధ్వంసమై పోతున్న కాలాన్ని
మనిషి అంతర్ధానమై పోతున్న సత్యాన్ని
అనుసరించాను సినారే విశ్వంభర కావ్యాన్ని
అనుకరించాను శ్రీ శ్రీ మహాప్రస్థాన గీతాన్ని
అవలోకించాను తిలక్ అమృతం కురిసిన రాత్రిని
మీ ముందుకు వచ్చాను ఈ అసుర సంధ్య వేళ
''ఆరడుగుల నే ల ఆహ్వానించిన వేళ '' గా
నా రచనలలో నన్ను నేను చూసుకుంటాను
నన్ను చూస్తే నాకు దిగులు ఎందుకిలా చెడి పోయానా అని
ఊరంతా ఒకదారి ఉలిపి కట్టే దో దారి అనుకుంటారేమో అంతా
''ఎంత సంపాదించినా కూ టి కే ఎన్నాళ్ళు బతికినా కా టి కే ''
''ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం
ప్రలోభాలు పైబడినా నీతి కి పడి చచ్చేదే జీవితం'' - సినారే
లంచాలు ఒక్కటే అవినీతి కాదు నీతి రీతి తప్పిన ప్రతి పని అవినీతే
ఎవరూ తను చేస్తున్నది అవినీతి అనుకోవడం లేదు ఈ రోజుల్లో ''
ఇలాంటి వాక్యాలు సన్నివేశాలు నన్ను ఈ రచనకు పురి కొ ల్పాయి
(ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ -- ఈ రోజు ఒంగోలు లో నా కావ్యావిష్కరణ సందర్భంగా )
ఆవిష్కరణ -- జస్టిస్ శేషశయనా రెడ్డి గారు
స్వీకారం ---జస్టిస్ పల్లేటి లక్ష్మణ రెడ్డి గారు
నా ఈ కావ్యం 'ప్రచురణలు' లో చూడండి
29, అక్టోబర్ 2012, సోమవారం
చరిత్ర నవ్వుతోంది
ఓ కవి ఇటురా
ఎవరా అని విస్మయంగా చూసాను
ఈ విచిత్రం ఎక్కడైనా ఉందా
ఇంతకు ఎవరు నువ్వు
నేనయ్యా చరిత్రని
.............
ఈ వింత ఈ కాలంలో నైనా ఉందా
ఏ యుగం లోనైనా జరిగిందా
అదేనయ్యా ప్రజాసేవ చేస్తాను ప్రాణత్యాగం చేస్తాను
పాదాక్రాంతం ఔతాను అంటూ ఈ పాదయాత్రలు
ఈ చిత్ర విచిత్రాలు చూస్తున్నావా
........................
ఒక పేజి కవిత వ్రాయి అరుదైన ఈ చిత్రం
గత కాలం ఎరుగని ఈ చిత్రాతిచిత్రం
ఈ విచిత్రం చరిత్రలో నిక్షిప్తం కావాలి కదా
@@@
ప్రజా సేవ చేస్తాం
మీ సేవలో తరిస్తాం
మీ కోసం ప్రాణ త్యాగామైనా చేస్తాం
మీరే మా దైవం మీరే మా సర్వం
ఏమయింది వీళ్ళకి
అమితంగా ప్రాధేయ పడ్తున్నారు
వంగి వంగి దండాలు పెడ్తున్నారు
ఎవరికైనా సేవ చేయడానికి
అంత దీనంగా ప్రార్ధించాలా
అంతగా మోకరిల్లాలా
కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాడాలా
ఇది నిజంగా నిజమా అనిపిస్తోంది
సహజమా అనిపిస్తోంది
ఎన్ని ప్రసంగాలు
ఎన్ని ప్రతిజ్ఞలు
ఉచితానుచితాలు మరచి
అన్ని ఉచితమంటూ వాగ్దానాలు
మైళ్ళ కొద్ది కాలి నడకలు ..
ఈ పందేరాలు ఫలహారాలు
ఎవడబ్బసొమ్మని ?
లాల్ బహదూర్ శాస్త్రి గారూ!
ప్రకాశం పంతులు గారూ!
ఆనాటి నాయకులారా
వినండి ఈ శుష్క వాగ్దానాలు
ఊక దంపుడు ప్రసంగాలు
ఏది దానం చెయ్యమనండి వారి కలిమి గుట్టల్ని
పాముల కిరవైన చీమలు పెట్టిన పుట్టల్ని
పగుల గొట్టి అందరికి పంచి పెట్టమనండి
దాచి పెట్టిన ధన కనకరాసులు వెలికి తీసి
దేశమంతా వెదజల్లమనండి
అంతే........ పరార్
అర్ధమయిందా మిత్రులారా
వీరి నయవంచన
పదవి కోసం తదుపరి నిధుల కోసం
ఎంత తపన
కాకుంటే ప్రజా సేవ చేస్తామని
ఈ ప్రాకులాట ఏమిటి
బాంచన్ కాల్మొక్త .. అంటూ
ఈ దుర్గతి ఏమిటి
దేశ ప్రజలారా బహుపరాక్ ....
ఎవరా అని విస్మయంగా చూసాను
ఈ విచిత్రం ఎక్కడైనా ఉందా
ఇంతకు ఎవరు నువ్వు
నేనయ్యా చరిత్రని
.............
ఈ వింత ఈ కాలంలో నైనా ఉందా
ఏ యుగం లోనైనా జరిగిందా
అదేనయ్యా ప్రజాసేవ చేస్తాను ప్రాణత్యాగం చేస్తాను
పాదాక్రాంతం ఔతాను అంటూ ఈ పాదయాత్రలు
ఈ చిత్ర విచిత్రాలు చూస్తున్నావా
........................
ఒక పేజి కవిత వ్రాయి అరుదైన ఈ చిత్రం
గత కాలం ఎరుగని ఈ చిత్రాతిచిత్రం
ఈ విచిత్రం చరిత్రలో నిక్షిప్తం కావాలి కదా
@@@
ప్రజా సేవ చేస్తాం
మీ సేవలో తరిస్తాం
మీ కోసం ప్రాణ త్యాగామైనా చేస్తాం
మీరే మా దైవం మీరే మా సర్వం
ఏమయింది వీళ్ళకి
అమితంగా ప్రాధేయ పడ్తున్నారు
వంగి వంగి దండాలు పెడ్తున్నారు
ఎవరికైనా సేవ చేయడానికి
అంత దీనంగా ప్రార్ధించాలా
అంతగా మోకరిల్లాలా
కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాడాలా
ఇది నిజంగా నిజమా అనిపిస్తోంది
సహజమా అనిపిస్తోంది
ఎన్ని ప్రసంగాలు
ఎన్ని ప్రతిజ్ఞలు
ఉచితానుచితాలు మరచి
అన్ని ఉచితమంటూ వాగ్దానాలు
మైళ్ళ కొద్ది కాలి నడకలు ..
ఈ పందేరాలు ఫలహారాలు
ఎవడబ్బసొమ్మని ?
లాల్ బహదూర్ శాస్త్రి గారూ!
ప్రకాశం పంతులు గారూ!
ఆనాటి నాయకులారా
వినండి ఈ శుష్క వాగ్దానాలు
ఊక దంపుడు ప్రసంగాలు
ఏది దానం చెయ్యమనండి వారి కలిమి గుట్టల్ని
పాముల కిరవైన చీమలు పెట్టిన పుట్టల్ని
పగుల గొట్టి అందరికి పంచి పెట్టమనండి
దాచి పెట్టిన ధన కనకరాసులు వెలికి తీసి
దేశమంతా వెదజల్లమనండి
అంతే........ పరార్
అర్ధమయిందా మిత్రులారా
వీరి నయవంచన
పదవి కోసం తదుపరి నిధుల కోసం
ఎంత తపన
కాకుంటే ప్రజా సేవ చేస్తామని
ఈ ప్రాకులాట ఏమిటి
బాంచన్ కాల్మొక్త .. అంటూ
ఈ దుర్గతి ఏమిటి
దేశ ప్రజలారా బహుపరాక్ ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)