ఆకాశాన్ని
అటు ఇటు కలుపుతూ
ఆ వంతెన ఏమిటనుకున్నారు
ఆదిక్కుని ఈ దిక్కుని
అనుసంధించిన
అందాల వారధి
ఆ రధ సారధి ఎవరనుకున్నారు
ఆ హృదయంగమ సంగమ
భంగిమ ఏమనుకున్నారు
ఓ కాంతి కిరణం
ఓపలేని తాపంతో
ఓ హిమబిందువు
కెమ్మోవిని
సమ్మోహనంగా చుంబిస్తే..
ఆ కమనీయ దృశ్యం
నింగి నీలాలలొ రచించిన
ఆ రంగ వల్లుల మృదులాస్యం
కనులారా కాంచిన ఆకాశం
అర సిగ్గుతో
మోమును దాచుకొన్న
అందాల పయ్యెద
జిలిబిలి సోయగం
ఇంద్రధనస్సు ఇంతందంగా ఇలా...:-)
రిప్లయితొలగించండికెమ్మోవిని
రిప్లయితొలగించండిసమ్మోహనంగా చుంబిస్తే..
ఇంద్ర ధనుస్సు దిగివచ్చినట్లుంది .
ఇంద్రధనుస్సు ని ఇంత చక్కటి కవిత గా మాకు అందించిన మీకు ధన్యవాదాలు. I really liked this one!
రిప్లయితొలగించండి