1
జగతి నడచి పోతున్నది యుగాలుగా
నడుస్తున్నాము నువ్వు నేను చెరిసగాలుగా
మన సంస్కృతీ సాంప్రదాయాలు ఏమయ్యాయో
మనుషులు మారి పోతున్నారు మృగాలుగా
2
మనసు బండరాయి
బ్రతుకు ఎండమావి
ఎదరంతా నిసిరేయి
ఈ నడక ఎవరి కోసమోయి
3
అన్నం తినడానికి నీకు దొరకదు సమయం
అందరిని పలకరించడానికి లేదు సమయం
నీకోసం మిగిలి లేదా ఒక్క టైనా ఒక నిముషం
అసలు నువ్వు ఎందుకు పుట్టావో నాకు సంశయం
4
ఎన్ని చెప్పినా ఈ లోకం మారదు
ఎంత తిన్నా ఈ ఆకలి తీరదు
ఏ మత్తుమందు ఈ రాత్రి అరగించిందో
రేయి తెల్లవారదు ఈ దాహం చల్లారదు
వయసు పెరిగిన కొద్ది చూపు మందగిస్తుంది
ఎడము పెరిగిన కొద్ది రూపు అందగిస్తుంది
ఏ గమ్యం లేకుంటే బ్రతుకు బద్ధకిస్తుంది
నిలిచి పోరాడావా విజయం వద్ద కొస్తుంది