9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నిర్గమనం 
మరణమా
ఆఖరి చరణమా
వినిపిస్తున్నది
వేణుగానమా
ఉన్నన్నాళ్ళు
ఇంత అజ్ఞానమా
మౌన మేల
అంతకరణమా
మరలి పోడానికి
ఇంత మధనమా
ఈ నిర్గమనం
ఇంత  మధురమా
వెళ్లి పోయాక
మళ్ళి జన్మమా
గతజన్మల

పాప పుణ్యమా 

4, జూన్ 2016, శనివారం

తపన
పాలసంద్రముమీద  పవళించిన స్వామి
గొల్ల ఇండ్ల పాలు గోరనేల
ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి ...   ---------వేమా

వేమన మహాకవి ఎంత బాగా అన్నాడో ఆనాడే
ఈ నాడది నిక్కచ్చి గా పాటించబడుతున్నది
'ప్రతి మనిషి మరియొకని  దోచుకునే వాడె ' అన్నారు శ్రీశ్రీ
మనవాళ్ళు ఎంత బాగా అర్ధం చేసుకున్నారో ఆ పాటని 
ఆ మహాకవి వాక్కులు తుచ తప్పక పాటిస్తున్నారు
ఏదో పాపం తినడానికి త్రాగడానికి లేక 
ఈ పని చేస్తున్నరనుకొంటే పోనీ పాపం అనుకుందాం
దాచుకొని దోచుకొని పొట్టలు పగిలేటట్టు పెంచుకొని ఆర్జించిన ఆ సంపద
కుక్క కాపలా కాయలేక గాడిద బరువు మోయలేక 
గిలగిల కోట్టుకొంటున్నవీళ్ళ నేమనాలి
ఇక్కడ జాతి జనులు ఆలో లక్ష్మణా అని 
ఆకలితో కొట్టుమిట్టాడుతుంటే
 జాతి సంపదని ఎక్కడెక్కడో దేశ దేశాల్లో పూడ్చి పెట్టి 
ఏమి ఎరుగనట్టు నీతులు  వల్లించే నేతల నేమనాలి
అన్ని అరణ్య రోదనలే .. అర్ధం లేని ఆవేదనలే  

ఎంత చెప్పినా ఎవరూ అర్ధం చేసుకోరూ !!!!! .------------------
అజ్ఞానం 

ఏ తల్లి పాడేను జోల,  ఏ  తండ్రి వూపేను డోల
ఎవరికీ నీవు కావాలి , ఎవరికీ నీ మీద జాలి ‘’
కొందరు తెలుగు భాష గురించి 
ఆందోళన చెందుతుంటే ఈ పాట గుర్తొచ్చింది
ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తున్న 
మన అధినాయకుల కర్తవ్య దీక్ష కట్టెదుట కనిపించింది
ఎక్కడో తమిళనాడు హోసురులో 
తెలుగుకు ద్రోహం జరిగిందని గోల చేస్తుంటే
ఇక్కడ తెలుగు నేలపైన ఏ ఒక్కరికి పట్టని 
ఆ విషయం విస్మయం కలిగించింది
నానాటికి దిగజారుతున్న విలువలకు మూలకారణం 
భాషాసంస్కృతుల విధ్వంసమేనని చెప్పాలనిపించింది
ఎన్ని చెప్పినా అరిచి గీ పెట్టినా పట్టనట్టున్న 
ఈ తెలుగు జాతిని చూచి చెవిటి ముందు శంఖమని బుద్దొచ్చింది
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు 
అన్నారు కదా  అనుభవైక వేద్యులు అదే నిజమనిపించింది
ఎబ్బే ఏమిటో ఎవరూ  అర్ధం చెసుకొరూ -=========

6, జనవరి 2016, బుధవారం

ఆమె ఒక అద్భుతం 


కంటి పాప ఇంటిలో కాపురం బాగుంది
తన వెచ్చని ఒడి గుడిగోపురంలా ఉంది

ఆమె నిలువెల్లా ,మణులు మాణిక్యాలు
చెంత ఉంటె రానే రావు వృ ద్ధాప్యాలు వార్ధక్యాలు ఆకస్మిక  మరణాలు

ఆమె పెదవి పైన అరవిరిసిన మరు మల్లెలు కురిసిన సిరి వెన్నెలలు
మైమరచి పోతుంటే  తనువున  ఆశ్చర్యంగా విరి తేనెలు విరి వానల  జల్లులు

దరి జేరినప్పుడు బింబాధరానికి ఎన్ని బిడియాలో
బిగి కౌగిలిలో ఒదిగినప్పుడు నిలువెల్లా ఎన్ని పగడాలో  నడిరేయిలో ఎన్ని జగడాలో

ఇద్దరు  ఒకటైనప్పుడు పగలు రేయిగా మారిపోతుంది
ముద్దులు మొదలైనప్పుడు రేయి పగలుగా మారుతుంది

ఆమె కన్నులలో కాపురమున్నది పున్నమి వెన్నెల
ఆమె కంఠంలో దాగున్నది ఎలుగెత్తి పాడుతున్న ఎల కోయిల

కన్నులేమో వెన్నెల వాటిక - కంటిపాప చుట్టూ నల్లని కాటుక
ఎవరికోసమో ఆ రెప్పల రెపరెపలు ననలెత్తిన తపనలు అడగనా సూటిగా

కన్నులు కలువలు,  వెన్నెల కొలువులు
అవి చిరునవ్వుల సిరివెన్నెల అపురూపంగా దాచుకున్న నెలవులు

పెదవులపై మధువులు, మాత్రమే కాదు  అచ్చట ఉన్నవి ఎన్నెన్నో ప్రేమ కధలు రాగసుధలు
మాటలు పాట;లు సయ్యాటలే  కాకుండా మందార మకరంద మాధుర్యాల వంటి  పెన్నిధులు

అది అందాల చుబుకము అట తిష్ట వేసినది అంతులేని తమకము
మోము అంచున ముచ్చటగా నెలకొన్న ఆ రూపమెంత  మురిపెము అపురూపము

నడుమేమో సన్ననిది,  సన్నజాజి రూపమది
మోయలేని భారాన్ని సునాయాసంగా  మోస్తున్న అపురూపమది మరు చాపమది

అది అందమైన కంఠము - మరుడు పూరించిన శంఖము
పైన అధరము కింద పరువము , ఆ రెండు ఆలపించిన మృదు మధురగీతము