10, మే 2012, గురువారం

శ్రీశ్రీ గారి 'కుక్క పిల్ల'

ఎట్టాగయితేనేం
మనిషిని ఆకట్టుకున్నావు 
మనసు గుట్టు తెలుసుకొని
మమతని ఆప్యాయతని అలవరచుకొని
నట్టింట్లో తిష్ఠ వేశావు

వాకిలిలో వున్నా వొళ్ళో చేరినా
వల్లమాలిన సౌజన్యం ఒలక బోస్తావు
తెలిసిన వాళ్లోస్తే తీయగా మూలిగి
అత్యంత అనురాగంతో
మును ముందుగా పలకరిస్తావు

నీలో అర్ధం కాని ఆత్మ వున్నది
ఏ ప్రాణికి అంతు చిక్కని ఆర్తి వున్నది
కనుకనే ఇంత సన్నిహితం కాగలిగావు
మానవాళిని సమ్మోహితం చేయగలిగావు

ఆ మహాకవి కవిత్వంలో
ద్వితీయ స్థానం నీది
ఏ ఇంటి కెళ్ళినా
ప్రధమ ప్రస్తావన నీది

ఎలాగయితేనేం 
ప్రేమాను రాగాలు ప్రదర్శించి
ప్రధమ శ్రేణిలో పాసయ్యావు
ఎనలేని విశ్వాసం కురిపించి
మనిషికే మార్గదర్శకం అయ్యావు

1 వ్యాఖ్య:

  1. ఇది మాత్రం నిజం "ఎనలేని విశ్వాసం కురిపించి
    మనిషికే మార్గదర్శకం అయ్యావు"
    బాగుంది.

    ప్రత్యుత్తరంతొలగించు