4, జూన్ 2016, శనివారం

తపన
పాలసంద్రముమీద  పవళించిన స్వామి
గొల్ల ఇండ్ల పాలు గోరనేల
ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి ...   ---------వేమా

వేమన మహాకవి ఎంత బాగా అన్నాడో ఆనాడే
ఈ నాడది నిక్కచ్చి గా పాటించబడుతున్నది
'ప్రతి మనిషి మరియొకని  దోచుకునే వాడె ' అన్నారు శ్రీశ్రీ
మనవాళ్ళు ఎంత బాగా అర్ధం చేసుకున్నారో ఆ పాటని 
ఆ మహాకవి వాక్కులు తుచ తప్పక పాటిస్తున్నారు
ఏదో పాపం తినడానికి త్రాగడానికి లేక 
ఈ పని చేస్తున్నరనుకొంటే పోనీ పాపం అనుకుందాం
దాచుకొని దోచుకొని పొట్టలు పగిలేటట్టు పెంచుకొని ఆర్జించిన ఆ సంపద
కుక్క కాపలా కాయలేక గాడిద బరువు మోయలేక 
గిలగిల కోట్టుకొంటున్నవీళ్ళ నేమనాలి
ఇక్కడ జాతి జనులు ఆలో లక్ష్మణా అని 
ఆకలితో కొట్టుమిట్టాడుతుంటే
 జాతి సంపదని ఎక్కడెక్కడో దేశ దేశాల్లో పూడ్చి పెట్టి 
ఏమి ఎరుగనట్టు నీతులు  వల్లించే నేతల నేమనాలి
అన్ని అరణ్య రోదనలే .. అర్ధం లేని ఆవేదనలే  

ఎంత చెప్పినా ఎవరూ అర్ధం చేసుకోరూ !!!!! .------------------
అజ్ఞానం 

ఏ తల్లి పాడేను జోల,  ఏ  తండ్రి వూపేను డోల
ఎవరికీ నీవు కావాలి , ఎవరికీ నీ మీద జాలి ‘’
కొందరు తెలుగు భాష గురించి 
ఆందోళన చెందుతుంటే ఈ పాట గుర్తొచ్చింది
ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తున్న 
మన అధినాయకుల కర్తవ్య దీక్ష కట్టెదుట కనిపించింది
ఎక్కడో తమిళనాడు హోసురులో 
తెలుగుకు ద్రోహం జరిగిందని గోల చేస్తుంటే
ఇక్కడ తెలుగు నేలపైన ఏ ఒక్కరికి పట్టని 
ఆ విషయం విస్మయం కలిగించింది
నానాటికి దిగజారుతున్న విలువలకు మూలకారణం 
భాషాసంస్కృతుల విధ్వంసమేనని చెప్పాలనిపించింది
ఎన్ని చెప్పినా అరిచి గీ పెట్టినా పట్టనట్టున్న 
ఈ తెలుగు జాతిని చూచి చెవిటి ముందు శంఖమని బుద్దొచ్చింది
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు 
అన్నారు కదా  అనుభవైక వేద్యులు అదే నిజమనిపించింది
ఎబ్బే ఏమిటో ఎవరూ  అర్ధం చెసుకొరూ -=========