11, మార్చి 2012, ఆదివారం

ప్రేమించు

ప్రేమించు, ప్రేమను పంచు
ప్రేమగా పలకరించు
చూపుల్లో వెన్నెల చిలకరించు
పెదవుల్లో చిరునవ్వులు ఒలికించు
మాటల్లో మమతను పలికించు
మౌనంలో శాంతిని వెలయించు
చేతల్లో సేవలు అందించు
ఆశించకు లంచం, అది కరిగే పొగమంచు
మంచిని శ్వాసించు, వంచన ద్వేషించు
కరుణను కురిపించు, వరుణుని మరిపించు
ధర్మం ఆచరించి , కాలాన్ని జయించు
గొప్పలు కాదంచు, తప్పులు మన్నించు
ధ్యానించు ,లోపలి లోకం తిలకించి
జ్ఞానం సంపాదించు
బోధించు, జీవన సారం ఎరిగించి
బోధి వృక్షమై వ్యాపించు
సాధించు ,సర్వ ధర్మములు పాటించి
కైవల్యం సంపాదించు .

2 వ్యాఖ్యలు:

 1. నమస్కారం
  మనిషికి మంచిమాటలు చెబుతూనే వుండాలి .ఎప్పుడో ఓసారి మారకపోతాడా!మీ కవితలు ఎప్పుడు బ్లాగులో పెడతారా అని చూస్తున్నాను సర్ !మనం మల్లి ఇలా కలిసినందుకు సంతోషం.
  నేను కూడా బ్లాగ్ ద్వారా పలకరిస్తున్నాను. మీ కవితల మీద మరిన్ని వ్యాఖ్యాలు వ్రాస్తాను.
  my blogs
  www.ravisekharo.blogspot.in
  www.cvramanscience.blogspot.in

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రవీ
  చెప్పానుగా నాకు కొత్త బ్లాగ్ విషయాలు
  అందుకని నేర్చుకొనే సందర్భం ఇది
  ఇలా మనం కలుసుకొన్నందుకు ఆనందంగా ఉంది
  అన్ని కవితలు చదివి స్పందిస్తే సంతోషం

  ప్రత్యుత్తరంతొలగించు