12, జులై 2012, గురువారం

మనసేమో మరుమల్లె వంటిది

మనసేమో మరుమల్లె వంటిది
వయసేమో హరివిల్లు వంటిది
మరిచి పోకు మనసుని
మరిచి పోకు వయసుని
మరువబోకు ఓ మనసా
జీవితమే చిరు జల్లు వంటిది
జీవనమే పొదరిల్లు వంటిది //

మనసు మరిచి పోయావా
తెలియలేవు సుగంధాలు
వయసు మరిచి పోయావా
మరలి రావు వసంతాలు
కలలు నిజం చేసుకున్నావా
దిగి వచ్చును దిగంతాలు //

ఒకరికొకరు తెలియదులే
ఒంటరిగా నువ్వుంటే
వలపు పల్లవించదులే
కలలేవి  రాకుంటే
బ్రతుకు పరిమళించదులే
బంధాలే లేకుంటే   //

4 వ్యాఖ్యలు:

 1. how are you sir, chaalaa kaalaaniki malli mee nunchi post, welcom .
  ఒకరికొకరు తెలియదులే
  ఒంటరిగా నువ్వుంటే
  వలపు పల్లవించదులే
  కలలేవి రాకుంటే
  బ్రతుకు పరిమళించదులే
  బంధాలే లేకుంటే
  chaalaa chakkaga, raasaaru sir,
  keep writing.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఒకరికొకరు తెలియదులే
  ఒంటరిగా నువ్వుంటే
  వలపు పల్లవించదులే
  కలలేవి రాకుంటే
  బ్రతుకు పరిమళించదులే
  బంధాలే లేకుంటే
  chaalaa bhagundandi, chaalaa kaalam tharuvatha mee post, welcom and keep writing.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మరుమల్లె హరివిల్లు,చిరుజల్లు,పొదరిల్లు
  ఈ మాటల కనికట్టు
  మీ కలానికే సొంత మయ్యేట్లు
  వ్రాస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా బాగుందండి
  ఇన్నాళ్ళు కనపడలేదు..మళ్ళీ వచ్చారు.. సంతోషం!

  ప్రత్యుత్తరంతొలగించు