నీ చిరు నవ్వు కోసం వెన్నెల వేచి ఉన్నది
నీ కర స్పర్శ కోసం మల్లియ కాచుకున్నది
నీ కర స్పర్శ కోసం మల్లియ కాచుకున్నది
నీ పెదాలు దాటిన పదాల సోయగాలు చూచి
కొమ్మల్లో కోయిల గొంతు శృతి చేసుకున్నది
కొమ్మల్లో కోయిల గొంతు శృతి చేసుకున్నది
ఎంతగా ఎదురు చూచిందో అర్రులు సాచిందో
నీ చెంపల అందాన్ని చామంతి కోరుకున్నది
నీ చెంపల అందాన్ని చామంతి కోరుకున్నది
అటుఇటు ఊగే నీ నడుము హొయలు చూచి
నర్తించే నెమలి తన నడకను సరిచేసు కున్నది
నర్తించే నెమలి తన నడకను సరిచేసు కున్నది
నీలి నయనాలలో చల్లని చూపుల జిగి చూచి
వీచే మలయానిలం తన గతి మార్చుకున్నది
వీచే మలయానిలం తన గతి మార్చుకున్నది
నీ మెత్తని నవ్వుల మార్దవం తన్మయం గాంచి
అచ్చెరువందిన ప్రక్రుతి ప్రణయం నేర్చుకున్నది
అచ్చెరువందిన ప్రక్రుతి ప్రణయం నేర్చుకున్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి