ఆమె ఒక అద్భుతం
కంటి పాప ఇంటిలో కాపురం బాగుంది
తన వెచ్చని ఒడి గుడిగోపురంలా ఉంది
ఆమె నిలువెల్లా ,మణులు మాణిక్యాలు
చెంత ఉంటె రానే రావు వృ ద్ధాప్యాలు వార్ధక్యాలు
ఆకస్మిక మరణాలు
ఆమె పెదవి పైన అరవిరిసిన మరు మల్లెలు కురిసిన సిరి
వెన్నెలలు
మైమరచి పోతుంటే
తనువున ఆశ్చర్యంగా విరి తేనెలు
విరి వానల జల్లులు
దరి జేరినప్పుడు బింబాధరానికి ఎన్ని బిడియాలో
బిగి కౌగిలిలో ఒదిగినప్పుడు నిలువెల్లా ఎన్ని పగడాలో నడిరేయిలో ఎన్ని జగడాలో
ఇద్దరు
ఒకటైనప్పుడు పగలు రేయిగా మారిపోతుంది
ముద్దులు మొదలైనప్పుడు రేయి పగలుగా మారుతుంది
ఆమె కన్నులలో కాపురమున్నది పున్నమి వెన్నెల
ఆమె కంఠంలో దాగున్నది ఎలుగెత్తి పాడుతున్న ఎల కోయిల
కన్నులేమో వెన్నెల వాటిక - కంటిపాప చుట్టూ
నల్లని కాటుక
ఎవరికోసమో ఆ రెప్పల రెపరెపలు ననలెత్తిన తపనలు అడగనా సూటిగా
కన్నులు కలువలు, వెన్నెల కొలువులు
అవి చిరునవ్వుల సిరివెన్నెల అపురూపంగా దాచుకున్న నెలవులు
పెదవులపై మధువులు, మాత్రమే కాదు అచ్చట ఉన్నవి ఎన్నెన్నో ప్రేమ కధలు రాగసుధలు
మాటలు పాట;లు సయ్యాటలే కాకుండా మందార మకరంద
మాధుర్యాల వంటి పెన్నిధులు
అది అందాల చుబుకము అట తిష్ట వేసినది అంతులేని తమకము
మోము అంచున ముచ్చటగా నెలకొన్న ఆ రూపమెంత మురిపెము అపురూపము
నడుమేమో సన్ననిది, సన్నజాజి రూపమది
మోయలేని భారాన్ని సునాయాసంగా మోస్తున్న అపురూపమది మరు చాపమది
అది అందమైన కంఠము - మరుడు పూరించిన
శంఖము
పైన అధరము కింద పరువము , ఆ రెండు ఆలపించిన మృదు మధురగీతము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి