18, జనవరి 2018, గురువారం



ఆమె పరిచయమే 
నన్ను రచయితగా మార్చింది 
ఈ భావ పరిమళమే 
నన్ను ఆమె చెంతకు చేర్చింది
ఆమె చిరునవ్వు సిగపువ్వు 
నా రచనకు ప్రేరణం 
అదే ఆమె నన్ను 
తన చెలికానిగా ఎంచుకున్న కారణం
దిగులు విచారం అనేది 
నా నిఘంటువులోనే లేదు 
ఎప్పుడైనా కలతపడితే 
అది కరిగి పోయేదాకా 
ఆమె నన్ను వదిలిపోదు
ఆమె ఆలోచనలు 
నన్నంటి ఉంటే 
అక్కడే ఆగిపోయింది ప్రాయం
ఆమె ఒడిలో 
సేద తీరుతుంటే, 
కాలం లోకం అన్ని మటుమాయం
ఎందరెందరో కవుల 
హృదయాలలోకి 
తొంగి చూచింది 
ఎక్కడా ...
పూలవనం కనబడలేదని 
నా గుండెలో తిష్ట వేసింది
అప్పటి నుంచి 
ఏది తోచని వేళలు నాకు లేవు 
ఆమె నా చెంత ఉన్నదని తెలిసి, 
ఏ చింతలు చికాకులు నా దరికి రావు
నా చుట్టూ ఎందఱో మనుషులు , 
ఏది తెలియని గందరగోళంలో 
నేను ఆమె నిలిచి 
ఆ వింత చూస్తుంటాము 
మాదైన గంధర్వగానంలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి