నాకు కోయిలలంటే ఇష్టం
కోమల సుమ దళాలంటే ఇష్టం
ఆమని ఆగమనం విని
పూవై విరబూయడం ఇష్టం
**
అవనిలోని అందాలన్నిటిని
అవనిలోని అందాలన్నిటిని
అవలోకించింది నా నయనం
నా ప్రమేయం లేకుండా
నా కలంలోకి చొరబడింది ప్రణయం
నల్లేరు మీద బండి నడకలా
సాగింది నా బతుకు పయనం
నాలో ఉన్న మనసే
ఒక అందాల బృందావనం
**
ఎప్పుడూ నాతో నేను
ఎప్పుడూ నాతో నేను
సావధానంగా మాటాడుకొంటాను,
ఏకాంతాన్ని ఒక అందమైన
పాటగా పాడుకొంటాను
**
క్షీర నీర న్యాయం నాకు తెలుసు
క్షీర నీర న్యాయం నాకు తెలుసు
ఎదుటివారిలో మంచిని మాత్రమే
చూస్తుంది నా మనసు
**
ఏది తోచనప్పుడు
ఏది తోచనప్పుడు
నాలోకి నేను వెళ్ళిపోతాను
ఎవరు లేనప్పుడు
నాతొ నేను మాటాడుకుంటాను
**
ఎంత మంచివాడో ఆ దేవుడు ,
ఎంత మంచివాడో ఆ దేవుడు ,
అడగకుండానే అన్నీ ఇచ్చాడు
ఇంకా అవసరమని తోచినప్పుడు
ఆయనే నాలోకి నడచి వచ్చాడు
**
వెన్న లాంటిది నామనసు
వెన్న లాంటిది నామనసు
వేయి వేణువులు ఒక్కసారిగా
ఎలా రవళించాలో దానికి తెలుసు
**
కోటి దీపకాంతులతో నిత్యం
కోటి దీపకాంతులతో నిత్యం
నన్ను నేను వెలిగించుకుంటాను
ఒక వేయి వీణ లుగా
నన్ను నేను మీటుకొని,
కోటి రాగాలు పలికించుకుంటాను
( నాలోనేను నాతోనేను కావ్యం నుండి కొన్ని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి