30, అక్టోబర్ 2017, సోమవారం



ఒక గీతం
ఎన్ని చిలిపిదనాలో 
ఆ నవ్వులలో ఉన్నాయి 
ఎన్ని పూలవనాలో 
ఆ పెదవులపై ఉన్నాయి 
ఎన్ని మౌనగీతాలో 
ఎన్నిపారిజాతాలో 
ఎన్ని మూగరాగాలో 
అన్నదిలే తొలిరేయి //
సిగ్గులు ఎదురైనాయి 
నడకలు బరువైనాయి 
మల్లెలు మరులైనాయి 
మాటలు కరువైనాయి 
అగరు పొగలు అత్తరులు 
వందిమాగధులైనాయి 
అన్ని వంగి వందనాలు
వందనాలు అంటున్నాయి //
ఆ చూపులలో సన్నాయి , 
మంగళ వాద్యాలున్నాయి 
ఆ వూపిరిలో మందార 
పోతన పద్యాలున్నాయి
ఆల్చిప్పల కనుపాపలలో 
ఆరాధన ఎవరికోసమోయి 
అది అరవిరిసిన 
మరుమల్లెల మందహాసమేనోయి //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి