30, అక్టోబర్ 2017, సోమవారం

ఈ వారం ఒక గీతం
--------------------------------
కంచే చేను మేస్తుంటే
అడుగడుగున వంచన ఎదురౌతుంటే
మనిషిని మనిషే కబళిస్తుంటే 
జాతి జవసత్వా లడుగంటుతు ఉంటె
ఎన్నాళ్ళి మోసం ఇంకా ఎన్నాళ్ళి సహనం
మేదావుల్లారా మౌనం వీడండి
ఈ మధనం ఈ దహనం
ఎన్నాళ్ళో ఆలోచించండి //
ఎటు పోతోంది దేశ సంపద
పొంచి ఉన్నది పెద్ద ఆపద
ఏమౌతున్నవి జాతిఫలాలు
ఎవరా కబళించే క్రూరమృగాలు
ఏలికలారా ఎందుకు మీరండి
ఇందుకు కారకులెవరో చెప్పండి //
దేశం అంటే మనుషులని
మనిషి కోసమే దేశమని
మరచిపోయిన మన నాయకులు
మనిషిని ఓటు అనుకొంటుంటే
ఓటుకు నోటు అంటుంటే
జాతి జనులారా మేలుకొనండి
జాగృతమై ఈ ద్రోహం ఖండించండి //
సంపద అంతా గుట్టలు గుట్టలు
దేశం నిండా పాముల పుట్టలు
ఎన్నాళ్ళి పిదప కాలమని
అక్రందించే ఆకలి పొట్టలు
చలిచీమల్లారా ఏకం కండి
పడగెత్తిన పాముల పని పట్టండి //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి