28, ఏప్రిల్ 2013, ఆదివారం

కవి సమ్మేళనం

కవి సమ్మేళనం
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
 పేజీల కొద్ది కవితలు చదవాలని పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి అదే పోతగా పయనాలు

 వేదిక పైన ఉన్న వారు మాత్రం దాతల పొగడ్తల్లో
వారు,  వారి కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ   కీర్తిని కవులంతా  గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న సభా మందిర మది
 కవులు కవితలు కాదని పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని విషయాలు వల్లించారు

 ఫోటోలు వీడియోలు జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని కళామతల్లి పెదవి విరిచింది
ఆహుతులైన శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది

4 వ్యాఖ్యలు:

 1. మీ ఆవేదనలో అర్ధం ఉంది . ప్చ్ .అంతే ! ఏమి చెయ్యలేం

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Most of the poets gatherings are like that only!They are reciting trash unpoetic concocted material in which there is no originalityOriginality is a pair of new eyes!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను ఇలాంటి కవి సమ్మేళనం ఈ మధ్య చూసానండి.నా కిదే అభిప్రాయం కలిగింది.ఇలాంటి సమావేశాల వల్లే కవితల ,కవుల పరిస్థితి ఇలా అయింది.వాస్తవాన్ని చిత్రించింది కవిత.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఏ వేదిక మీద కవి చదివిన కవిత్వాన్ని మరో కవి భేషనడు.అక్కడ చదివింది ఎవడి బుర్రల్లోకీ చేరదు.ఎవడికి వాడు తన భుజాలకు కీర్తులు తగిలించుకొనే యత్నం లోనే ఉంటారందరూ.వక్తలు తమ చాతుర్యం చూపే పనిలో పడితే కవి బిక్కు బిక్కు మంటూ .ఆహూతులు చప్పట్లు కొట్టడానికే సమీకరించబాడతారక్కడ. .

  ప్రత్యుత్తరంతొలగించు