28, ఏప్రిల్ 2013, ఆదివారం

చినుకులు

తిన్నది అరగక పొతే
దేహానికి తప్పదు రుగ్మత
అనుకున్నది జరగక పొతే   
గుండెకు ఉండదు భద్రత

ఇంకా కావాలని దేహానికి దాహం
ఎన్నాళ్ళీ ఒత్తిళ్ళని హృదయానికి సందేహం
ఎందుకు ఎవరికీ ఎప్పుడు ఏలని
గుండెకు మనసుకు నిత్యం సంవాదం

ధనం ధనం ధనం
జగతిని నడిపే ఇంధనం   
మనం మనం మనం
ఆ మత్తులో గమ్మత్తుగా మనమందరం

2 వ్యాఖ్యలు:

  1. ప్రతి పదంలోను నిజం నగ్నంగా నిలబడింది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చినుకులన్నీ చదివానండి.కొత్త ప్రయోగం.ఒక్కొక్క కొటేషన్ కి ఒక్కొక్క పేజీ వ్రాయటం వినూత్న ప్రయోగం.యువత కు వ్యక్తిత్వ పరంగా కూడా ఉపయోగ పడతాయి.

    ప్రత్యుత్తరంతొలగించు