1, జూన్ 2012, శుక్రవారం

అమ్మా అని పిలవాలని వుంది

అమ్మా !
 
ఏమిటి నా నేరం
నే చేసిన పాపం
నీ పాపగా పుట్టడమేనా
ఆడపిల్లలా అడుగెట్టడమేనా
ఎందుకమ్మా ఈ శాపం
ఎందులకీ ..శోకం//
 
మాతృత్వం వరమంటారే
మమతా మమకారాలు
నీ సొంతం అంటారే
చిగురు గానే చిదిమేస్తే
మొగ్గలోనే తుంచేస్తే
ఆ తల్లి బిరుదు ఏలనమ్మా
అమ్మకు అర్ధం లేదమ్మా
నీ జన్మ వ్యర్ధమమ్మా //
 
నీవూ ఒక అమ్మ పాపవే   
ఆమె కలల  రూపానివే
నాకీ శిక్ష ఏలనమ్మా
నాపై కక్ష ఎందుకమ్మా
నిను చూడాలని ఉంది
నాకు జన్మ ఇవ్వమ్మా
అమ్మా అని పిలవాలని వుంది
ఆవకాశం ఇవ్వమ్మా //
 
(భ్రూణ హత్యలు నిరసిస్తూ..ఈ గీతం ) 

3 వ్యాఖ్యలు:

  1. చాలా బాగుంది కృష్ణారెడ్డి గారూ!
    ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితులు మరీ తీవ్రంగా ఉన్నాయి....
    @శ్రీ

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఎమిటో ఇంకా ఈ కాలం లో కూడా భ్రూణ హత్యలు ఉన్నయంటే అది మన దురద్రుష్టం. కాని aamir khan show లో AP లో చాలా తక్కువ భ్రూణ హత్యలు , ఇతర రాష్ట్రాలతో compare చేస్తె అని చూపించినట్టు గుర్తు. కవిత నచ్చిందండి.

    ప్రత్యుత్తరంతొలగించు