24, జనవరి 2012, మంగళవారం

ఓ స్త్రీ

ప్రతి అక్షరాన్ని
ప్రయోగించాలని ఉంది
ప్రతి పదాన్ని
ఆయుధంగా సంధించా లని ఉంది!

ఓ స్త్రీ .......
నువ్వు నా అమ్మవు
నువ్వు నా చెల్లివి
నిన్ను కబళించే
కఠోర నియమాల నుంచి
నిన్ను భక్షించే
నర రూప రాక్షసుల నుంచి ......
నిను రక్షించు కోవాలని ఉంది!

అమ్మా !
నన్ను మనసారా దీవించు
నే తలపెట్టిన దీక్షకు
నీ దీవెన లందించు
ఈ అలుపెరుగని సాధనలో
నాకు విజయాన్ని ప్రసాదించు!

1 వ్యాఖ్య:

  1. మీకు విజయం తప్పక చేకూరుతుంది. ప్రతి పదాన్ని
    ఆయుధంగా సంధించా లని ఉంది! నాకు బాగా నచ్చిన వాక్యం!

    ప్రత్యుత్తరంతొలగించు