9, మే 2012, బుధవారం

నువ్వు గుర్తొస్తే చాలు

నువ్వు గుర్తొస్తే చాలు
నర్తిస్తాయి నాలో
వన మయూరాలు..

నువ్వు నడిచొస్తే చాలు
నా లోగిలి నిండా
కోయిల 'కుహూ 'రవాలు ..

నువ్వు కరుణిస్తే చాలు
నా జీవితమంతా
నందనవనాలు బృందావనాలు ...

బిగి కౌగిలి బంధిస్తే చాలు
అణువణువునా
మల్లెలు మందారాలు

ఒక రేయి వెలిగిస్తే చాలు
మాతృత్వపు మమకారాలు
ఒకహాయి రగిలిస్తే చాలు  
అస్తిత్వపు శ్రీకారాలు
ఒకటొకటే ఎదురొస్తాయి
మనో జ్న  ప్రాకారాలు                                    
ఒడిలోనికి కదిలోస్తాయి
మంజుల ఓంకారాలు

5 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుంది... చక్కగా రాసారు బాలకృష్ణా రెడ్డి గారు....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీరు కలం కదిపితే చాలు........రాలుతాయి అక్షర సుమాలు.
  మీ అక్షరాల అల్లికలో ......... ఎన్నో ముత్యాల సరాలు.
  మీ కవన వనంలో ...... వెండి వెన్నెల సోయగాలు.
  Sir, మీ భావుకతకు జోహార్లు.

  ప్రత్యుత్తరంతొలగించు