14, మే 2012, సోమవారం

నీ సోయగం చుట్టూ

అనుక్షణం 
భ్రమరం 
సుమ ప్రదక్షిణం 
చేసినట్లు 
నేను 
నీ సోయగం చుట్టూ 
ఆర్తితో పరిభ్రమిస్తున్నాను 
 
ఆణువణువూ 
వేణువు ఊదినట్లు
అహరహము 
వీణ మీటినట్లు
నీ సౌందర్య రసాస్వాదనంలో 
రమ్య స్వప్నావిష్కరణంలో 
ప్రతి నిమిషం 
పరవశి స్తున్నాను
 
నీ దరహాసం
కరుణిస్తే
ఓ ప్రబంధానికి
శ్రీకారం చుడతాను
నీ కరకంకణ
నిక్వాణం వినిపిస్తే
ఓ కావ్యమై
పుడతాను

4 వ్యాఖ్యలు:

 1. సౌందర్య రసాస్వాదనం బాగుంది.సోయగాన్ని కవితల సొబగులు అద్ది తయారు చేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను
  నీ సోయగం చుట్టూ
  ఆర్తితో పరిభ్రమిస్తున్నాను...

  చాలా బాగుంది కృష్ణారెడ్డి గారూ!
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రవి
  ఆనందం నీ అభిప్రాయాలు స్పందనలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి

  శ్రీ గారు మీ స్పందనకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు