13, మే 2012, ఆదివారం

నువ్వొక పూల తోటవి

నువ్వొక పూల తోటవి
రకరకాల కుసుమాలని
నీ తనుద్యానవనంలో
పూయించ గలవు

నువ్వొక  చిలిపి తేటివి
నా అంగీకారం లేకుండానే 
నా అందాల మకరందాలు
ఆస్వాదించ గలవు

నువ్వొక కొండ వాగువి 
శతకోటి మెలికల నడకలతో 
ఎనలేని ఒంపులు ఒయ్యారాలతో 
యు వ హృదయాలను ఉర్రూతలూగించ గలవు

నువ్వొక వాన చినుకువి 
తొలి తొలి వలపుల పిలుపులతో 
తొలకరి ఉరుముల మెరుపులతో 
ఎంత వద్దు వద్దంటున్నా 
నన్ను ముద్ద ముద్దగా తడిపేయగలవు

5 వ్యాఖ్యలు:

 1. Sir, నువ్వొక పూల తోట కవిత చాలా బాగుంది చక్కటి భావన

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నువ్వొక చిలిపి తేటివి
  నా అంగీకారం లేకుండానే
  నా అందాల మకరందాలు
  ఆస్వాదించ గలవు...
  చాలా బాగుంది.....
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఫాతిమా గారు

  శ్రీ గారు

  ప్రతి కవిత చదివి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు