17, జులై 2012, మంగళవారం

ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని....

అప్పుడప్పుడు  
పచ్చని కొమ్మల్లోకి పారిపోవాలని పిస్తుంది

చిన్నారి కోయిలనై చిగురాకు గుబురుల్లో దూరి
కొత్త కొత్త రాగాలు తీయాలపిస్తుంది

కొండల్ని కోనల్ని పలకరించాలనిపిస్తుంది
గిలిగింతలు పెట్టాలని పిస్తుంది
కొండలపైనుండి దొర్లి సెలఏరులా  గంతు లేయాలని పిస్తుంది 

వేన వేల  మలుపుల్ని వెదుక్కొంటూ
చిరు గాలి తరగల్ని చిమ్ముకొంటు పరుగు తీయాలని పిస్తుంది

మలయానిలమై మలుపు మలుపులో
మధుర కావ్యాలు వ్రాయాలని పిస్తుంది
ఆనంద వాహినిలా ప్రవహించాలని ఉంటుంది

జీవించి ఉన్నంత కాలం
ఒక పచ్చని గీతాన్ని అల్లుకొని పరవశించాలని ఉంటుంది

2 వ్యాఖ్యలు:

  1. వరదలా కవితలు రాసేస్తే మాకు అర్ధం చేసుకోడానికి సమయం చాలటం లేదండీ!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ప్రక్రుతి పై మీ ప్రేమ అందరికి ఉండాలి.అప్పుడు ఈ భూమి స్వర్గం లా మారుతుంది.

    ప్రత్యుత్తరంతొలగించు