12, జులై 2012, గురువారం

ఎవరు నీవు ఎవరు నేను

ఎవరు నీవు  ఎవరు నేను
ఎద గదిలో నీ రూపం దాగున్నది
ఎందులకో మరి కదల లేను
మన స్నేహం కడలి  కెరటం  లాగున్నది
ఎంత నిదుర కాచినదో  మది
పురిటి నొప్పులు పడి కమ్మని కలగన్నది 
ఎంత క్రూరమైనదో ఆ విధి 
యింక ఈ సయ్యాటకు సెలవన్నది 
ఎన్నాళ్లీ  కన్నీళ్ళని 
గుండెలోని ఎండమావి అనుకున్నది
ఏరువాక కానరాక
ఎందుకు బ్రతుకని ఒక చినుకను కున్నది
 
 

1 వ్యాఖ్య:

  1. మన స్నేహం కడలి కెరటం లాగున్నది.
    దూర మైన స్నేహానికి సరి అయిన కవితా వాక్యం..

    ప్రత్యుత్తరంతొలగించు