7, ఫిబ్రవరి 2012, మంగళవారం

దేవత

అతడు మరిచిపోయిన మధు మాధుర్యం
అతడు విస్మరించిన జీవన సంగీతం -------ఆమె
ఎంత శ్రమిం చినా లభించని జీవన సౌభాగ్యం
వెన్నంటి ఉండే ఆరోగ్య మహా భాగ్యం----- ఆమె
ఏ ఉరుకులు పరుగులలో దొరకని సిరి
అపురూపమైన ఆనంద జీవన ఝరి -----ఆమె
బ్రతుకంతా తోడోచ్చే ఓదార్పు
కడదాకా లాలించే నిట్టూర్పు
అలౌకిక ఆనంద గీతమామె
నూరేళ్ళ జీవన రాగాన్ని
నవ మోహనంగా ఆలపిం చేందుకు
దివినుంచి దిగి వచ్చిన దేవత ఆమె

4 కామెంట్‌లు:

  1. బ్రతుకంతా తోడోచ్చే ఓదార్పు
    కడదాకా లాలించే నిట్టూర్పు
    బాగుందండీ! మీరన్నట్టు నవమోహనంగా, సమ్మోహనంగా ఉంది!

    రిప్లయితొలగించండి
  2. పద్మార్పిత garu
    మీ స్పందనకు ధన్యవాదాలు
    నా కావ్య్యాలు ''ప్రచురణలు''లో ఉన్నవి చదివి స్పందించండి

    రిప్లయితొలగించండి
  3. రసజ్ఞ గారూ
    చాలా రోజులు ఇలాంటి కవిత్వం ఎందుకు అనిపించేది .
    ప్రణయం ప్రేమ ఆరాధన ఇలా రాస్తుంటే నేటి కవులు
    'అభ్యుదయం' అనే వాళ్ళు . కాని ఆశ్చర్యంగా నాకవితలు గీతాల పైన
    ఎం ఫిల్ చెయ్యడం తో ధైర్యం చేసి భావకవిత్వం మొదలెట్టాను.
    ఇలా బ్లాగ్ లోకి అడుగు పెట్టాను .
    మరిన్ని భావ చిత్రాల కోసం నా పుస్తకాలు -ప్రచురణలు లో ఉన్నాయి
    చదివి అభిప్రాయం చెప్పండి

    రిప్లయితొలగించండి