అనుక్షణం
భ్రమరం
సుమ ప్రదక్షిణం
చేసినట్లు
నేను
నీ సోయగం చుట్టూ
ఆర్తితో పరిభ్రమిస్తున్నాను
ఆణువణువూ
వేణువు ఊదినట్లు
అహరహము
వీణ మీటినట్లు
నీ సౌందర్య రసాస్వాదనంలో
రమ్య స్వప్నావిష్కరణంలో
ప్రతి నిమిషం
పరవశి స్తున్నాను
నీ దరహాసం
కరుణిస్తే
ఓ ప్రబంధానికి
శ్రీకారం చుడతాను
నీ కరకంకణ
నిక్వాణం వినిపిస్తే
ఓ కావ్యమై
పుడతాను
సౌందర్య రసాస్వాదనం బాగుంది.సోయగాన్ని కవితల సొబగులు అద్ది తయారు చేసారు.
రిప్లయితొలగించండినేను
రిప్లయితొలగించండినీ సోయగం చుట్టూ
ఆర్తితో పరిభ్రమిస్తున్నాను...
చాలా బాగుంది కృష్ణారెడ్డి గారూ!
@శ్రీ
రవి
రిప్లయితొలగించండిఆనందం నీ అభిప్రాయాలు స్పందనలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి
శ్రీ గారు మీ స్పందనకు ధన్యవాదాలు
Sir, kavitha chala bagundi
రిప్లయితొలగించండి