17, జులై 2012, మంగళవారం

ఒక సాయంకాలం

పచ్చని తివాచి
పరచినట్టు పంట పొలాలు
ఆ పొలాలను
పలకరించే నీలి మేఘాలు
ఆ మేఘ రాగాలు
సంతరించుకున్న నింగి నీలాలు

సాయం సంధ్య వేళ
ఏటి పాయల వెంట
ఒంటరిగా నడుస్తుంటే
ఆప్యాయంగా పాదాలను
పలకరిస్తూ అలల గుసగుసలు

పరిసరమంతా
ఆహ్లాదంగా ప్రకృతి  దృశ్యాలు 
మనసంతా 
మల్లెలు చల్లినట్టు పారవశ్యాలు  

పరికించి చూశాను

అక్కడ  చిత్తరువులా
నీ ఆకృతిలో ఒక పచ్చని తరువు
ఆకాశంలో
నీ రూపు రేఖా విలాసాలతో
ఒక మేఘ శకలం

అంతలో ఆశ్చర్యంగా 
చిరు  నవ్వులు చిందిస్తూ
నా ముందర నిలుచున్న
ఒక ఇంద్ర ధనుస్సు

అదేమిటో
చిత్రంగా సర్వాంతర్యామిలా
ప్రకృతి ఒడిలో
ఎక్కడ చూచినా నీ ఆకృతులే

8 కామెంట్‌లు:

  1. పచ్చని తివాచి
    పరచినట్టు పంట పొలాలు
    ఆ పొలాలను
    పలకరించే నీలి మేఘాలు
    ఆ మేఘ రాగాలు
    సంతరించుకున్న నింగి నీలాలు
    ...
    pallavi chala chala bagundi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్య గారూ
      పల్లవి అని వ్రాసారు
      ఇది కవిత మాత్రమే
      గేయం కాదు . గాన యోగ్యం అయినదే గీతం
      మీ స్పందనకు ధన్యవాదములు

      తొలగించండి
  2. బాగుందండీ.
    ప్రకృతి అందాల్లో ఎక్కడ చూసినా కనిపించే "ప్రియ" ఆకృతులు. అందమైనవి ఎప్పుడూ ప్రకృతి అందాల్లోనే అగుపిస్తాయి, మనసులైనా, ఆలోచనలైనా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్ని ఆశ గారూ
      జీవితం నిండా ఎన్ని ఆశలో
      అవే 'రాసి ''పోశాను ఇక్కడ
      మీ స్పందన నన్ను ముందుకు పదపద మంటున్నది
      నా కావ్యాలు చదవండి "ప్రచురణ' లు లో ఉన్నాయి

      తొలగించండి
  3. ప్రక్రుతి స్త్రీ లా చాలా అందంగా ఉంటుంది.అందుకే అక్కడ తిరుగుతుంటే వారే గుర్తు వస్తారు.

    రిప్లయితొలగించండి
  4. సాయంకాలం అంటూ..
    ప్రక్రుతి కన్యకని చూపించేశారు...
    చాలా బాగుంది...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  5. ravi
    thank you
    enduko i roju kalam kadilindi
    manasu prasantangaa undi
    paramparalugaa blog nimpesaanu

    రిప్లయితొలగించండి
  6. సంధ్యాకాంత ఈ కవితలో మరింత అందంగా వుంది.

    రిప్లయితొలగించండి