8, మే 2012, మంగళవారం

సంగీతం

నీకు 
సంగీతం రాదన్నావుగా
మరి కన్నులలో ఏమిటా గీతం
కనుసన్నలలో ఏమిటా సంగీతం
 
నీకు
నృత్యం చేతకాదన్నావుగా
మరి కంటి పాపల కదలికలో
ఏమిటా నాట్య కేళి
అటు ఇటు ఊగే వాల్జడలో
ఆందమైన కధాకళి
 
నీకు
సాహిత్యం అసలు తెలియదన్నావుగా
అణువణువునా
దారి పొడవునా ఏమిటా రచన
అడుగడుగునా అగుపించే
అలరించే ఆ నటన
 
అందుకే నువ్వు
సంగిత సాహిత్య సరస్వతివి
నా హృదయాన
ప్రతి కవనాన నర్తించు
నిత్య చైతన్య జీవనఝరివి

6 కామెంట్‌లు:

  1. "అందుకే నువ్వు సంగిత సాహిత్య సరస్వతివి"
    Sir కవిత అద్భుతంగా ఉంది. మీ బ్లాగ్ "కవితాంధ్రలో" కవితలన్నీ చదివాను.నిజంగా పదాలన్నీ పరిమళభరితమైనవిగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. కవిత్వం లో శభ్ద సౌందర్యం ఉంటుంది. ప్రాస తో కూడిన కవనంని కవి వినిపిస్తుంటే..ఒక లయ వినిపిస్తుంది. అది సంగీతమే..కదండీ! మీ కవిత్వం అదే చెప్పింది. చాలా బాగా చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. కవిత అద్భుతంగా ఉందండీ!

    రిప్లయితొలగించండి
  4. ఫాతిమా గారు ,
    వనజవనమాలి గారు
    కవితలు ఉన్న బ్లాగులు అతి తక్కువ
    అందుకనేనేమో స్పందనలు అరుదుగా కనిపిస్తాయి
    అందునా భావ కవిత్వం కనుమరుగై పోతున్నది
    మనసు స్పృహ మాయమై పోతున్నది
    ఇటువంటి తరుణంలో మీ స్పందన
    నాకు ఉత్సాహాన్ని ఇంకారాయాలనేసంకల్పాన్ని ఇచ్చింది
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. పద్మార్పిత గారు
    మీ స్పందనకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి