28, అక్టోబర్ 2012, ఆదివారం

ఒక రేయి విషాద గీతమైన వేళ

ఈ రోజు  గడిచి  పోనీ
ఈ రేయి నడిచి  పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం 
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన  మలిగి పోనీ //

ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //

మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //

3 కామెంట్‌లు:

  1. మెలి వేసే చేదు జ్ఞాపకాలు
    మెలమెల్లగా చెరిగి పోనీ
    రవళించే రాగ బంధాలు
    గుండె గూటిలో ఉండి పోనీ....
    చక్కగా రాశారండి....

    రిప్లయితొలగించండి
  2. అంత విషాదంలోనూ జన్మ జన్మలూ ఇలవేలుపులా సాగిపోయే ఆ వలపు.... తొలివలపేనా?
    బాగుందండీ కవిత!

    రిప్లయితొలగించండి