30, అక్టోబర్ 2017, సోమవారం

ఇప్పుడే అన్ని టివి చానెల్స్ లో చిన్నారి రమ్య మరణం గురించి వింటుంటే బాధ ఆగ్రహం కసి -- ఎవరు ఈ విలయానికి కారకులు
తప్పతాగిన వాళ్ళా తాగి రమ్మని పంపిన తల్లిదండ్రులా
మందు అమ్మడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వమా -
ఎవరిని అనాలి ఎన్నాళ్ళి ఘోరకలి ?బాధగాఉంది అసహ్యంగా వుంది
ప్రభుత్వమే మందు అమ్మడ మేమిటి
ప్రజలు దానిని ఎగబడి తాగడ మేమిటి
రాత్రి కాగానే వీధుల్లో కొంపల్లో ఆగడాలేమిటి
నిరు పేద బ్రతుకులో నిత్యం ఏల ఈ కారుచీకటి
అసలీ విధానం అసహ్యం అనిపించదా,
-మద్యపానం మనిషి జీవితం కుదించదా
నిషేధం విధించకుండా ఎన్నాళ్ళి మౌనం ,
ఏ మేధోమధనం ఈ విధానాన్ని నిరసిందా
'రయ్’ మని దూసుకెళుతూ మందు బాబులు
వాళ్ళు మనుషులు కాదు మతాబులు
ఎన్ని జీవితాలు దగ్ధం కానున్నాయో –
అసలు మందు ఎందుకంటే ఏవి జవాబులు
కొన్ని వేల మంది తాగుబోతులకు న్యాయమూర్తిగా శిక్ష వేసిన నా ఆవేదన ఇది
తాగకపోతే ఎవరు చావరు
తాగితే మాత్రం తప్పక చస్తారు నేడో రేపో ఏదో ఒక అవయవం చితికి
నయంకాని అనారోగ్యంతో అకాలమరణంతొ చివరికి వెళ్లక తప్పదు చితికి
అయితే ఎందుకు తాగుతున్నారు జనం ! ఎందుకీ మద్యపానం
తాగమని ప్రోత్సహిస్తూ విక్రయిస్తూ ఏమిటి ప్రభుత్వ విధానం
మద్యం నిషేధించండి. జనజీవితాలు సుఖ శాంతులతో నిండేలా చర్యలు చేపట్టండి
తప్పతాగిన వారి బారి నుండి, వారి వికృత చేష్టల నుండి అమాయకులను కాపాడండి
ప్రభుత్వాలు పడి పోవు . కాకుంటే కొన్ని అనవసర సంక్షేమ పధకాలు ఆపండి
ప్రజలు ఎవరు తిండి లేక చావడం లేదు
అవసరం అయితే మంత్రుల సామంతుల జీత భత్యాలు కుదించండి
వాళ్ళు జీతాలకోసం రాలేదు అనవసర దుబారా తగ్గించండి
అసలు తాగకపోతే ఎవరికైనా నష్టమా ప్రాణాంతకమా ?
అయితే జనం ఎగబడి ఎందుకు తాగుతునట్టు
ఎన్నెన్నో పధకాల ప్రవేశ పెట్టి ప్రభుత్వం కోట్లు పెట్టి ఎందుకు డప్పు కొట్టుకొంటునట్టు
ఓట్లకోసమే అయితే సరిగా పరిపాలించండి
ప్రజల గుండెల్లో ఉంటారు నిజమైన పరిపాలన ప్రజలకు చేరుతుంది
మద్యం అమ్మకాల వలన వచ్చే ఆదాయం కన్నా తప్పతాగి ఒళ్ళు గుల్లయితే
వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెట్టె కర్చు ఎక్కు వని లెక్కలు చెబుతున్నాయి
మందు బాబులు మదించి వాహనాలు నడుపుతున్నారు
నేరాలు ఘోరాలు చేస్తున్నారు
ప్రతి ఇంటిలో హింస వాతావరణం సృష్టిస్తున్నారు
నిరు పేదల కొంపలు గుండాలౌతున్నాయి
అందరు తాగుబోతులైతే జనజీవనం, మన సంస్కృతీ సంప్రదాయం ఏం కావాలి
ఆలోచించండి
ఇంత నేరపూరితమైన పని ప్రభుత్వమే ఎందుకు చేస్తున్నట్టు ?
అందరు గుడ్డెద్దు చేలో బడ్డట్టు ఎందుకు తాగుతున్నట్టు!
ఎన్నాళ్ళిలా మేధావులు నిమ్మకు నీరెత్తినట్టు!
ఎవరు ఆలోచించ రేమి? ప్రశ్నించ రేమి?
నిరసించ రేమి ? నిలదీయరేమి ?
మార్గాంతరం కనిపెట్టరేమి ?
ఈ నేను నేను కాదు
ఈ మేను నాది కాదు
ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఏమో
ఎవరో ఒకరు ఇందులోకి వచ్చి వెళుతుంటారు
ఉన్నన్నాళ్ళు అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంటారు
ఈ రూపం నాది కాదు
ఈ పాపం నాది కాదు
ఇది పూర్వ జన్మ కర్మ పరిపాకం
మళ్ళి మనిషిగా పుట్టి అతడు చేసుకున్న నిర్వాకం
ఈ సిరులు నావి కావి
ఈ సంపద నాది కాదు
ఇవి మిన్నాగులు నివసించే సంపెంగ పొదలు
నన్ను నాలోంచి విసిరేసిన కన్నీటి కధలు
నేనిక్కడ కొన్నాళ్ళు న్నానన్నది నిజం
జననం మరణం ప్రతి ప్రాణికి సహజాతి సహజం //
ఇది ఏమి శోకం
ఇది ఏమి లోకం
ఒకరినొకరు దోచుకొంటూ
ఇది ఏమి ధర్మం
ఎక్కడెక్కడో దాచుకొంటు
ఇది ఏమి న్యాయం
ఎంత కావాలో తెలియని
ఇది ఏమి దాహం
ఎంతకు నిద్ర పట్టదు
ఇది ఏమి శాపం
ఏమిటో ఈ తికమక
ఎక్కడుంది లోపం
ఒకరేయి నవ్వింది
ఎవరోయి నువ్వంది
కనుదోయి వంగింది
ఒక హాయి పొంగింది
మోమును అరవొంచి
పెదవులు చిలికించి
ఎంత బాగా మీటుతున్నావు
నా హృదయ విపంచి
చిదిమి దీపం పెట్టుకొనే
అందం అమెది
అన్నానో లేదో
ఎర్రగా చూచింది ఏమది ?!
చిదిమి దీపం పెట్టుకొనే
అందం అమెది
అన్నానో లేదో
ఎర్రగా చూచింది ఏమది ?!
మోమును అరవొంచి
పెదవులు చిలికించి
ఎంత బాగా మీటుతున్నావు
నా హృదయ విపంచి
ఒకరేయి నవ్వింది
ఎవరోయి నువ్వంది
కనుదోయి వంగింది
ఒక హాయి పొంగింది
నీ చిరు నవ్వు కోసం వెన్నెల వేచి ఉన్నది
నీ కర స్పర్శ కోసం మల్లియ కాచుకున్నది
నీ పెదాలు దాటిన పదాల సోయగాలు చూచి
కొమ్మల్లో కోయిల గొంతు శృతి చేసుకున్నది
ఎంతగా ఎదురు చూచిందో అర్రులు సాచిందో
నీ చెంపల అందాన్ని చామంతి కోరుకున్నది
అటుఇటు ఊగే నీ నడుము హొయలు చూచి
నర్తించే నెమలి తన నడకను సరిచేసు కున్నది
నీలి నయనాలలో చల్లని చూపుల జిగి చూచి
వీచే మలయానిలం తన గతి మార్చుకున్నది
నీ మెత్తని నవ్వుల మార్దవం తన్మయం గాంచి
అచ్చెరువందిన ప్రక్రుతి ప్రణయం నేర్చుకున్నది
కను ముక్కు తీరు చూడ చక్కన
చెక్కినాడేమో అమరశిల్పి జక్కన
రంభా ఊర్వశి తిలోత్తమలైనా
పోటిగా నిలబడగలరా తన పక్కన
ఆమె ఒయ్యారంగా చూచిన వేళ
తన పెదవిపై ఆ నవ్వు ఎంతో చిక్కన
ఇన్ని సోయగాలు సొంతం చేసుకున్న
ఆమె అందం అభివర్ణించ లేడేమో తిక్కన
ఎంత కాలం ఎంత ఎంత తపసు చేసినా
ఆమె కరుణా కటాక్షం ఎవరికైనా దక్కునా
ఆమె చుట్టూ ఇలా తిరుగుతు ఉంటె కృష్ణా
నలుగురు నవ్విపోదురేమో పక్కున
మనసు అడిగింది ఎలా ఉన్నావని
రాతిరి ఎన్ని స్వప్నాలు కన్నావని
నిదుర రాని నిసిరాతిరి వేళలో
ఆదమరచి ఎన్ని వూసులు విన్నావని
ఎన్నెన్ని రంగు రంగుల స్వప్నాలు
కను రెప్పల మాటున దాచుకున్నావని
నడిరేయి ఒడిలో చేరి అలరించిన
అన్ని అందాలు ఏం చేసుకున్నావని
చెలి చిందించిన మందహాసాలు
ఎన్ని రాసులుగా పోసుకున్నావని
కాలం అడుగుతున్నది అందమైన రేయి
ఎన్ని కవితలు కావ్యాలు రాసుకున్నావని
ఎందుకో ఈ మనిషి నిండుగా నవ్వడం లేదు
అందుకే ఏ మనిషి నాకు నచ్చడం లేదు
తన జీవితం అద్భుతమని ఆ దైవం ఇచ్చిన
అరుదైన అవకాశమని ఎవరు భావించడం లేదు
ఏమైందో ఏమో ఏ బాధలు వెంటాడుతున్నాయో
ఎదుటపడి ఎవరూ ధైర్యంగా మాటాడడం లేదు
తప్పు చేసినట్టు తక్కుతూ తారుతూ వున్నారే తప్ప
ఏ ఒక్కరు నిటారుగా నిర్భయంగా నడవడం లేదు
తాను నడిచే దారి మంచిది కాదని ఎంత చెప్పినా
అరిచి గీ పెట్టినా ఎవరు కొంచెమైనా మారడం లేదు
ఎన్ని నీతి శతకాలు ఎన్ని సుభాషితాలు ప్రవచనాలు
ఏకరవు పెట్టినా ఏ ఒక్కటి తన చెవి కెక్కడం లేదు
ఒక శోక గీతం
ఈ రోజు గడిచి పోనీ
ఈ రేయి నడిచి పోనీ
ఈ శోక దావానల దగ్ధగీతం 
ఎటులైన ఆగి పొనీ
ఎదలోన మలిగి పోనీ //
ఆనాటి కన్నీటి గాధ
కలలాగ మిగిలి పోనీ
మదిలోని విషాదమంతా
పొగ మంచులా కరిగి పోనీ
రక్త సిక్తమైన ఆ కాళరాత్రి
రాకాసి చరిత్రనే రాసి పోనీ //
మెలి వేసే చేదు జ్ఞాపకాలు
మెలమెల్లగా చెరిగి పోనీ
రవళించే రాగ బంధాలు
గుండె గూటిలో ఉండి పోనీ
ఇలవేలుపులా తన వలపే
జన్మజన్మల బంధమై సాగి పోనీ //
ఒక ప్రేమ గీతం
ఎవరయ్యా నువ్వు
విరిశరములు నాపై
ఎందుకు సందిస్తావు 
ఇరు మేనులు చెరి సగమని
బిగి కౌగిలి బందిస్తావు
అది ఏమని నిలదీయగా
చిరు నవ్వులు చిందిస్తావు//
పెదవులపై ఒక గీతం
రచియిస్తావు
నిదుర రాని కలలోనికి
నడిచొస్తావు
శివుని విల్లు అలవోకగ
విరిచేస్తావు
చిలిపి తలపు తెర దీయగ
మది వీణను సవరిస్తావు //
నిలువెల్లా నెలవంకలు
వెలిగిస్తావు
తనువంతా చిరు చెమటలు
తరలిస్తావు
ఊపిరిలో ఉప్పెనలే
రగిలిస్తావు
తగదయ్యా ఇది అంటే
నవ్వేస్తావు //
ఎదురుగా ఉన్న ఆమెతో ఒకసారి అన్నాను
ఓ చెలీ! నీ పెదవికి ఎంతో రుణపడి ఉన్నాను
అంత ఆమె నర్మగర్భంగా అన్నది కదా
చిలిపీ ! నీ వ్యవహారం అంతా విన్నాను
అయ్యో ఎందుకలా మండిపడతావు
అంత కాని మాటలు నేనేమన్నాను
అదే మహాశయా నేనూ అంటున్నాను
‘అక్కడే’ తమరి గోల ఏల అంటున్నాను
ఓ అదా పెదవిపైన ఎవరికీ ఆ ఇది ‘ ఉండదు
ఇదేమి అంత పెద్ద తప్పు కాదంటున్నాను
తప్పయింది స్వామీ! మీకిక అడ్డు చెప్పను
మీరే మహా గొప్పవారని ఒప్పుకొంటున్నాను
---సరదాగా సంభాషణ ------------
ఈ దేశం నీ కేమిచ్చిందని నీ ప్రశ్న
దేశానికి నువ్వేం చేశావని నా ప్రశ్న
ఏదో ఒక పరమార్ధం ఆశించి ఆ దైవం నిన్ను
ఈ ఇలకు పంపితే నువ్వు ఏం చేశావని నా ప్రశ్న
జీవితం మున్నాళ్ళ ముచ్చట కదా మూడు తరాలకు
సరిపడా ఎందుకు మూట కడుతున్నావని నా ప్రశ్న
ఎప్పుడు ఎక్కడ ఎవరికీ చెప్పకుండా ఎగిరిపోతావో ఏమో
గుండెకు ముప్పు ఎందుకు తెచ్చుకొంటున్నావని నా ప్రశ్న
హాయిగా జీవించడం మాని నిర్భయంగా బ్రతకడం మాని
ఇలా కుప్పిగంతు లెందుకు వేస్తున్నావని అందరి ప్రశ్న
అపురూపంగా లభించిన అరుదైన ఈ మానవ జన్మను
అమాయకంగా వృధా చేసుకొంటున్నావని చివరి ప్రశ్న
పెరటిలో ఒక చెట్టునైనా పెంచుకోవాలని ఎవరికీ అనిపించదు
ప్రాంగణంలోనే కాదు జీవితాలలోను పచ్చదనం కనిపించదు
ప్రేమ అనురాగం మరచి తడారి పోయిన హృదయాలను
అరుదెంచిన నవవసంతం హరితవనం మురిపించదు
ఆర్ద్రత ఇగిరి పోయిన ఈ మనిషితో ఏమి పని ఉందని
నీలాకాశం లో నడిచిపోతున్న ఏ మేఘమూ వర్షించదు
అమానవీయ చర్యలతో ప్రతి ఒకడు చెలరేగి పోతున్నా
ఇదేమని ఏ మంచి హృదయము నిలదీయదు గర్హించదు
ఎండ చండ ప్రచండంగా అవనిని మండిస్తున్నా కృష్ణా
ఈ మర మనిషి గుండెలో ఏ మంచి ఆలోచన వికసించదు
దసరా మామూళ్ళు –ఒక అనుభవం
దసరా పండగ అనగానే వేడుక సంగతి దేవుడెరుగు ..అందరికి గుర్తొచ్చేవి మామూళ్ళు
ఉదయాన్నే ఒక వ్యక్తి చిన్న నోట్ పుస్తకం పట్టుకొని వచ్చాడు . వాకిలి ముందు తారట్లాడుతున్నాడు .
ఎవరూ అన్నాను ..
దసరా... అని నసిగాడు . ఏం చేస్తుంటావు అడిగాను .
విద్యుత్ శాఖలో ఉద్యోగం.. అన్నాడు ..
జీతంఎంత వస్తుంది .. 4 ౦ వేలు అన్నాడు..
ఔను కదా ఇలా ఇల్లిల్లు తిరిగి అడుక్కోడానికి సిగ్గుగా లేదా ఈ యాచన అవసరమా అన్నాను. నీ జీతం ప్రజలు ఇచ్చేదే తెలుసా అని కూడా....
ఏమేమో చెప్పబోయాడు ఇది లంచం కాదు అన్నాడు .
ఇంకేమిటి మరీ ఎందుకు ఈ భిక్షాటన-
మీ ఇష్టం-- ఇస్తే ఇవ్వండి మాతో పనులుంటాయి..
బెదిరింపా అన్నాను
ఇంతింత జీతాలు ...పుచ్చుకోంటూ ..ఎవరు చెప్పాలి వీళ్ళకి ఇది అనాచారమని నీచమని హేయమని .. హుందాగా మన పక్కన ధీమాగా కూర్చోన వలసిన ఒక ఉద్యోగి ఇలా ఇంటి ముందు భిక్షకునిలా ఎందుకు .
.ఇతని కొడుకు లేదా కూతురు ఏ ఇంజినీరింగ్ మెడిసిన్ చేస్తూ ఉంటారు
.వాళ్ళు రేపు ఈ తండ్రిని ఎలా ఉహించుకుంటారు ..
హుందాగా ఉండవలసిన యితడు ఇల్లిల్లు తిరిగి ఈ యాచన కార్యక్రమం అవసరమా .
అయినా ఏం చేసుకుంటారు ఈ మురికిని.. తాగి తందానాలాడడానికా .
తమ పిల్లల జీవితాల్లో ఈ మురికిని పోయడానికా ..
గతంలో చాలి చాలని జీతాలు ఒప్పుకుందాం .
ఇప్పుడు ఆ పరిస్థితి కాదు .
విద్యుత్ శాఖలో వేతనాలు అపరిమితం . విద్యుత్ శాఖలో పనిచేసిన ఒక విశ్రాంత చిరుద్యోగి తన పెన్షన్ 6 ౦ వేలు అని చెప్పి తనే ఆశ్చర్య పోయాడు .
ఈ జీతాలు ఎక్కడినుంచి వస్తున్నవి .
ప్రజల సేవకై వినియోగింప బడిన వాళ్ళు కదా మీరు .....ఇంటికి వెళ్లి ఆలోచించుకో అన్నాను ఈ యాచన ఎంత నీచమో హీనమో ..
విసురుగా వెళ్లి పోయాడు.
రేపు నాకు సేవ లోపం చెయ్యవచ్చు . నన్ను ఇబ్బంది పెట్టవచ్చు ..
దానిని సరి చేసుకొనే మార్గాలు సేవా లోపానికి పరిష్కారాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి .
.ఏ ఉద్యోగి అయిన సరే ఎందుకు ఈ అనాచారం .
.అందుకే ప్రతి ఒక్కరు నిలదీయండి ,అతని స్థానమేమిటో చెప్పండి..
భయం ఎందుకు.. వాళ్ళని నిజమైన ప్రజసేవకులుగా మార్చండి
.అనాదిగా వస్తున్న ఈ దురాచారాన్ని ఖండించండి
ప్రజల వద్దనుంచి పిండిన వేల లక్షల కోట్లు వీరి జీతాలుగా మారిపోతున్న విషయం తెలియజెయ్యండి..
తప్పు లేదు తప్పు కాదు ,..
అమాయకంగా లంచాలు మామూళ్ళు ఇంకా అవసరమా ..
మీ భ్రుత్యులు, సేవకులు వాళ్ళు .
మీ సేవల కోసం మీ పన్నులతో వినియోగించబడిన వాళ్ళు మరచిపోకండి.
ఇకనైనా ఈ అనాగరిక నీచ నికృష్ట దైన్య దురాచారానికి స్వస్తి పలకండి
హుందాగా నిండుగా ధైర్యంగా జీవించండి .
ప్రభుత్వమే దీనిని అరికడితే బాగుండేది ఏం చేద్దాం !!
మిత్రులారా మీరయినా దీనికి స్వస్తి పలకండి
మీ స్నేహితులకి ఇరుపొరుగులకు ఈ నిజం చెప్పి వారిని చైతన్య పరచండి
--------------------ఒక విశ్రాంత న్యాయమూర్తి ఆవేదన
ఈ వేళ నా ఎదుట నిలిచింది ఓ సోయగం
మనసార నను వలచి తానయింది నాలో సగం
కట్టెదుట ఆమె నిండుగా హాయిగా తీయగా
కనిపించని నాడు ప్రతి క్షణం నాకో యుగం
ఆదమరచి నన్ను అక్కున చేర్చుకున్న
ఆమె గాఢ పరిష్వంగమే నా పేరోలగం
నన్ను నన్నుగా మిన్నగా నిండుగా
ప్రేమించిన హృదయమే హిమవన్నగం
ఆమె మృదు మధురంగా పెదవిని కదిపి
పలికిన ప్రతి మాట నాకు నిగమాగమం
నాకోసం ఆమె ఎలుగెత్తి పాడిన ప్రతి పాట
అవధి లేని మధుర స్వరగంగా తరంగం
సిగ్గుగా లేదూ !!!!
--------------
ఒకవైపు ఆకలి నకనకలు
ఇంకో వైపు విందులు వినోదాలు ఇకయికలు పకపకలు -
సిగ్గుగా అనిపించడం లెదూ ‘’
నిన్నటి నాయకులు నిజమైన ప్రజా సేవకులు
నేటి పాలకులు బకాసురులు కీచకులు సైంధవులకు వారసులు, -
-అసహ్యంగా అనిపించడం లేదూ
కలిమిని గుట్టలుగా పోసుకొనే వాళ్ళు ,, కడివెడు గంజికి నోచుకోని వాళ్ళు,
ఎన్నాళ్ళి అసమానతలు అసహయతలు -
-అవమానంగా అనిపించడం లేదూ
ఒకవైపు ఎనలేని సిరి సంపదలు ఏం చేసుకోవాలో తికమక
ఇంకొక వైపు నిరుపేదలు ఎలా బతికి బట్టకట్టలో తెలియక, --
దుర్మార్గంగా అనిపించడం లేదూ
తప్పతాగి తందానాలాడుతూ ఉన్నోళ్ళు
తాగేందుకు గంజి లేక కన్నీళ్ళు తాగుతూ లేనోళ్ళు, --
కంపరంగా అనిపించడం లేదూ
ఆరుగాలం శ్రమపడి పండించే రైతన్నలు
వారి శ్రమ ఫలితాన్ని కబళించే రాబందులు --
దారుణం అనిపించడం లేదూ
ఉదారంగా అప్పు ఇచ్చే బ్యాంకులు ఒక వైపు అప్పు తీర్చలేక పేదల ఆస్థి జప్తులు ఇంకొకవైపు
లక్షల కోట్లు దర్జాగా ఎగ్గొట్టే నాయకులూ, నిస్సిగ్గుగా వారిని రక్షిస్తున్న పాలకులు --
జుగుప్సగా అనిపించడం లేదూ
నటనలు నయవంచనలు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, సంపన్నులు ఆపన్నులు
ఓట్లు నోట్లు అధికారులు అహంకారాలు అవినీతి అక్రమార్జన
కార్పోరేట్ వైద్యం, మద్యపానం, తాగి తీరాలనే ప్రభుత్వ విధానం
తల నరికిన వాణ్ని న్యాయవాది బల్లగుద్ది శిక్షనుండి తప్పించడం
పన్ను ఎగ్గోటిన వాణ్ని రకరకాలుగా రక్షించడం
న్యాయం కోసం వచ్చిన వాణ్ణి రక్షణ నిలయాలు భక్షించడం
ఇంకొకరిని దోచుకోవడం, దోచుకున్నది భయంగా రహస్యంగా దాచుకోవడం
అప్పులు అధిక వడ్డీలు ,
జీవించడం నేర్పని చదువులు లక్షల కొద్ది నిరుద్యోగులు
అబ్బాయిని అమ్ముకోడాలు వరకట్న దాహాలు
అందినంత దోచుకొనే విద్యాలయాలు
అవినీతి కంపు కొట్టే ప్రభుత్వ కార్యాలయాలు
ప్రజలను మరిచిన పాలకులు నాయకులూ
తల బద్దలు కొట్టుకున్న అర్ధంకాని కవితలు లెక్కకు మించిన కవులు
వెలవెల బోతున్న వేదికలు వెక్కివెక్కి ఏడుస్తున్న కావ్యాలు
ఆంగ్ల భాషపై పెరిగిన మోజుతో ఆరిపోతున్న తెలుగువెలుగులు
అమెరికా చదువులు ఎంత శ్రమించినా లభించని కొలువులు
ఆదరణ నోచుకోని వృద్ధులు అచ్చోసిన ఆంబోతుల్లా మృగాళ్ళు
ఆర్ధిక సంబంధాల కింద గిలగిల కొట్టుకొంటూ మానవసంబంధాలు
అశ్లీలంగా అసభ్యంగా అర్ధనగ్నంగా తెగ ఊగే చలన చిత్రాలు
అంతకంతకు అంతరించి పోతున్న సంస్కృతీ సంప్రదాయాలు
అడ్డదిడ్డంగా ఆబగా తినడాలు అకాల మరణాలు
కులాలు మతాల కుమ్ములాటలు ఓటుకు నోట్లు
ఇంకాకన్ను తెరవని పాపాయి కోసం విరివిగా వెలిసిన కాన్వెంటు కారాగారాలు
అన్యాయం అని తెలిసినా బల్ల గుద్ది వాదించే న్యాయవాదులు
అధర్మం అని తెలిసినా అడ్డంగా నిలువుగా దోచుకొనే వైద్యులు
అందిన కాడికి దోచుకొనే వ్యాపారులు అవినీతి రీతిగా ఉద్యోగులు
దేశం నిండా ఇబ్బడి ముబ్బడిగా జనం
సగం పైగా యువతరం సోమరితనం
భయంగా నోట్ల కట్టలు మోసుకొంటూ జనం ,
గుడ్డెద్దు చేలో బడ్డట్టు గుట్టలుగా పోస్తు ధనం
ఇంకా మరెన్నో మనసుని కలచి వేసే వికారాలు –
బాధగా అసహనంగా
కోపంగా కంపరంగా
అవమానంగా జుగుప్సాకరంగా సిగ్గుగా లెదూ !!!
నా జీవితమే కవిత్వం - నేనే ఒక మహా కావ్యం
------------------------------------------------------------
నేను కవిని
కాని కవిత లల్లను, ఏ కావ్యాలు రాయను
కాని నేను కవినే, జీవితాన్ని కవిత్వంగా రాస్తుంటాను
ప్రతి నిముసాన్ని అందంగా చెక్కుతుంటాను,
ప్రతి ఆనందాన్ని కావ్యంగా మలుస్తుంటాను
ప్రతి ఉదయం నాకు పరవశ గీతం .
ఎదురైన ప్రతి మనిషి అందులో అందమైన చరణం
ప్రతి గీతం నవరస భరితం. నాకు జీవితమే కవిత్వం.
నా జీవనమే అద్భుతమైన గ్రంధం
నిన్న నాకు గతం. ఈ రోజు నిజం,
రేపు ఏమో ఏమౌతుందో తెలియని అయోమయం
అందుకే జీవితాన్ని సుందర ప్రబంధంగా వ్రాస్తుంటాను.
ప్రతి రోజు పేజిని మధు మాధుర్యంతో నింపుతుంటాను
ప్రతి దినాన్ని పరిమళ భరితంగా.
మకరంద మాధురీ సహితంగా, రసరమ్యంగా రవళిస్తుంటాను
కవిత్వం రాయక పోతేనేం,
కావ్యాలు వెలువరించక పోతేనేం - నేను కవినే
జనరంజకంగా జీవన కావ్యం రాస్తున్నాను గదా,
ఎన్నో హృదయాల్ని రంజింప జేస్తున్నాను గదా
అనునిత్యం ఎందఱో నన్ను చదువుతుంటారు
నా జీవితాన్ని ఒక గీతంగా పాడుతుంటారు
నా ప్రతి కవితని ఎదురైన వారికీ అద్భుతంగా వినిపిస్తుంటారు
ఎంత గొప్ప కవిత్వమో అని అందరు ప్రశంసిస్తుంటారు
నా దైనందిన జీవనం గంధర్వ గానమని పరవశిస్తుంటారు
నా జీవితం నిండా ఆమని నడచి వచ్చిన ఆనవాళ్ళు ,
దారి పొడవునా అరవిరిసిన నవ వికసిత కుసుమాలు
నా జీవన కావ్యమంతా కోమల సుమ దళాల పరిమళాలు ,
ఎలకోయిల కుహురవాలు, చల్లని వెన్నెల విహారాలు
మృదు మందహాసాలు, నులి వెచ్చని గాఢ పరిష్వంగాలు
నా జీవన ప్రాంగణం లో ముళ్లుండవు, రాళ్లుండవు,
కన్నీళ్ళు ఉండవు, కంటకాలుండవు
కారు చీకటి దారులుండవు,
కాలకూట విషాలు విషాదాలు అసలే ఉండవు
అంతటా పచ్చని మైదానాలే, పంట పొలాలే,
హాయి గొలుపు సమీరాలే, హరి విల్లుల ద్వారాలే
సుందర నందన వనాలే, సిరి మల్లెల అల్లరులే చిరు నవ్వుల సందడులే
నా రచనలన్నీ అమలిన భావాలే అమృతారావాలే
నా కలం పలికించినవి భావ గీతాలే, మధుర మనోహర మంజుల రాగాలే
చెరిగి పోని శిలాక్షరాలతో నా జీవన కావ్యం రచిస్తున్నాను
ఎన్ని వందల గీతాలు రాసానో లెక్కలేదు.
ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం ఒక కావ్యం గా
ఎన్ని కవితలు రచించానో గుర్తు లేదు .
ఎన్ని కావ్యాలు రానున్నవో చెప్పలేను
నేను కవిని. నేను వ్రాసేది జీవితం
నా జీవితమే కవిత్వం నేనే ఒక మహా కావ్యం
ఆమె పరిచయమే నన్ను రచయితగా మార్చింది
ఈ భావ పరిమళమే నన్ను ఆమె చెంతకు చేర్చింది
ఆమె చిరునవ్వు సిగపువ్వు నా రచనకు ప్రేరణం
అదే ఆమె నన్ను తన చెలికానిగా ఎంచుకున్న కారణం
దిగులు విచారం అనేది నా నిఘంటువులోనే లేదు
ఎప్పుడైనా కలతపడితే అది కరిగి పోయేదాకా ఆమె నన్ను వదిలిపోదు
ఆమె ఆలోచనలు నన్నంటి ఉంటే అక్కడే ఆగిపోయింది ప్రాయం
ఆమె ఒడిలో సేద తీరుతుంటే, కాలం లోకం అన్ని మటుమాయం
ఎందరెందరో కవుల హృదయాలలోకి తొంగి చూచింది
ఎక్కడా పూలవనం కనబడలేదని నా గుండెలో తిష్ట వేసింది
అప్పటి నుంచి ఏది తోచని వేళలు నాకు లేవు
ఆమె నా చెంత ఉన్నదని తెలిసి, ఏ చింతలు చికాకులు నా దరికి రావు
నా చుట్టూ ఎందఱో మనుషులు , ఏది తెలియని గందరగోళంలో
నేను ఆమె నిలిచి ఆ వింత చూస్తుంటాము మాదైన గంధర్వగానంలో
నా కావ్యం “ఆలాపనలు సల్లాపములు”లో కావ్యకన్నియ తన నోట ఈ (నా)పాట పల్లవి ఆలపిస్తుంది. అది విన్న నా మిత్రుడు డా.. గంజాం శ్రీనివాసమూర్తి ఇంతకూ ఆ పాట కధా కమామిషు ఏమిటి అన్నాడు .ఓంకారం ఎక్కడ పలికిందంటారు అని గూడా ..ఏనాటిదో ఆ పాట మీ ముందుంచాను ఇంతకీ పాట మొత్తం విన్నారుగా మూర్తిగారూ ! మీరే చెప్పండి ఆ చినుకు పలికిన ఓంకారం ఎక్కడో ఏమిటో .......మిత్రులారా మీరు కూడా ---.
ఒక చినుకు పలికింది ఓంకారం
ఒక చినుకు అలదింది సిందూరం
ఒక చినుకు చుట్టింది శ్రీకారం 
ఒక చినుకు మీటింది సింగారం //
పెదవిపైన పడిన వాన గానమాయెను
అది గుండెపైన జారగనే జాతరాయెను
నడుము పైన పడిన చినుకు వీణ ఆయెను
అల్లనలన మీట గానె వేణు వాయెను
తడిసి తడిసి తనువంతా బృంద గానమై
కనుల ముందు బృందావని కదిలి పోయెను //
తీగ తడిసి తడబడగా వాగు నవ్వెను
వాగు నిండి పరుగిడగా వనము నవ్వెను
తనువంతా తపనలతో తల్లడిల్లెను
ఉరుమొచ్చి మెరుపొచ్చి ఊరడించెను
అంతలోనే గాలివాన ఆగిపోయెను
ఆదమరచి మనసు వీణ మూగవోయెను //
ఎన్నో అనుబంధాలు
ఎన్నో సుమగంధాలు
కనుచూపు మేర ఎన్నెన్నో
మమతల మకరందాలు మధుగీతాలు
కడవూపిరిదాకా ఎన్నెన్నో 
ప్రయాణాలు ప్రహసనాలు ప్రమాణాలు
ఈ జీవన గమనంలో
ఎందరితో ఎన్ని యోజనాలు నడిచినా
ఈ జీవనయానంలో
ఎన్ని సంవత్సరాలు గతించినా
అమితానందంతో
ఆమని శుభసంకేతంతో
తన ఉదార కేదారంలో
నవమాసాలు మోసి
ఉదయ కాంతికి ఊపిరులూదిన
అమ్మతో అనుబంధం మాత్రం
మరో తొమ్మిది నెలలు అదనం
ఆనాడే మొదలైనది జననం
ఆ మాతృమూర్తి రచించినదే ఈ కధనం
అమ్మ అనురాగం అనంతం అమూల్యం
ఎన్నటికి అది వసివాడని జ్ఞాపకం
అమ్మ !
ఒక కమ్మని నమ్మకం
నువ్వు నేనే కాదు
ఈ జగమంతా అమ్మ చేసిన సంతకం
ఈ జనమంతా
ఆ దేవత ఆలపించిన జయగీతం
అనన్యం అగణ్యం అపురూపం
అమ్మ భావనం అజరామరం
-------అమ్మ తృ తీ య వ ర్ధంతి సం ద ర్భం గా
-----------------కవితా నీరాజనం
పాలసంద్రముమీద పవళించిన స్వామి /గొల్ల ఇండ్ల పాలు గోరనేల
ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి /విశ్వదాభి రామ వినుర వేమా
ఆనాడే వేమన మహాకవి ఎంత బాగా అన్నాడో
ఈ నాడది నిక్కచ్చి గా పాటించబడుతున్నది
ప్రతి మనిషి మరియొకని దోచుకునే వాడె --అన్నారు శ్రీశ్రీ
మనవాళ్ళు ఎంత బాగా అర్ధం చేసుకున్నారో ఆ పాటని,
ఆ మహాకవి వాక్కులు తుచ తప్పక పాటిస్తున్నారు
ఏదో పాపం తినడానికి త్రాగడానికి లేక ఈ పని చేస్తున్నారనుకొంటే,
పోనీ పాపం అనుకుందాం
దాచుకొని దోచుకొని పొట్టలు పగిలేటట్టు పెంచుకొని
ఆర్జించిన ఆ సంపద, కొండొకచో అక్రమార్జన,
కుక్క కాపలా కాయలేక, గాడిద బరువు మోయలేక
గిలగిల కొట్టుకొంటున్నవీ ళ్ళ నేమనాలి
ఇక్కడ జాతి జనులు ఆలో లక్ష్మణా అని ఆకలితో కొట్టుమిట్టాడుతుంటే
జాతి సంపదని ఎక్కడెక్కడో లాకర్లలో పాతర్లలో ,దేశ దేశాల్లో
పూడ్చి పెట్టి ఏమి ఎరుగనట్టు నీతులు వల్లించే నేతల నేమనాలి
అవినీతి -యాచన రకరకాలుగా ఎన్నో రూపాలుగా మార్చిన,
ఏమార్చిన అధికారుల, బధిరాంధకారుల నెలా అర్ధం చేసుకోవాలి
అన్ని అరణ్య రోదనలే
అర్ధం లేని ఆవేదనలే,
అలుపెరుగని ఆక్రందనలే
------------------------------అర్ధం చేసుకోరూ
ఏ తల్లి పాడేను జోల, ఏ తండ్రి వూపేను డోల
ఎవరికీ నీవు కావాలి , ఎవ రికీ నీ మీద జాలి ‘’
తెలుగు నేలపై అన్ని పాఠశాలల లో
ఇకనుంచి ఆంగ్లభాష బోధన--- తెలుగుకు ఉద్వాసన 
అని వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు చూచినాక కూడా
ఎవరూ ఎలుగెత్తకుంటే
ఏ ఒక్కరూ తెలుగు భాష గురించి
ఆందోళన చెందకుంటే ఈ పాట గుర్తొచ్చింది
ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తున్న
మన అధినాయకుల కర్తవ్య దీక్ష కట్టెదుట కనిపించింది
నానాటికి దిగజారుతున్న విలువలకు మూలకారణం
భాషాసంస్కృతుల విధ్వంసమేనని చెప్పాలనిపించింది
ఎన్ని చెప్పినా అరిచి గీ పెట్టినా పట్టనట్టున్న
ఈ తెలుగు జాతిని చూచి చెవిటి ముందు శంఖమని బుద్దొచ్చింది
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అన్నారు కదా అనుభవైక వేద్యులు
అదే నిజమనిపించింది
భాష అంతరిస్తే జాతి అంతరిస్తుందని
మానవత మటుమాయమౌతుందని,
మనిషిలోని ఆర్ద్రత ఇగిరిపోతుందని
ఎంత చెప్పినా -ఎబ్బే ఏమిటో
ఎవరూ అర్ధం చెసుకోరూ..
ఒక్కరైనా నిరసన ప్రకటించరూ -------
ఆమె అధరం మీద ఒక ప్రేమ కవిత రాశాను
ఎర్రని పెదవిని అదిమి ఒక సంతకం చేశాను
ఆమె చిలిపి నవ్వుని రహస్యంగా ఒడిసి పట్టి
ఒక అజరామరమైన దీర్ఘ కవితగా మలిచాను
ఆమె నా ఎదలో దూరి ఏదో చెప్పబోతుంటే
మాటాడ వద్దని చిగురు పెదవిని మూశాను
నా తన్మయత్వం గాంచి సమ్మోహనంగా నవ్వుతుంటే
ఆ నవ్వు మొలిచిన చోట ఒక చిలిపి ముద్ర వేశాను
చాటుమాటుగా మేలిముసుగు సవరించు కొంటుంటే
అణువణువునా అతిలోక సౌందర్యం చూశాను
మరీ మరీ అడిగితె ఏమని చెప్పను కృష్ణా
ఆమె నాదనే నిజాన్ని బ్రతుకంతా మోశాను

ఒక్కో రేయి నన్ను తెగ విసిగిస్తుంది
నిద్రాదేవి నాతో కలహించి కసిగా కసురుకొంటుంది
ఎటు పాలుపోక పానుపుపై
అటునిటు పొర్లుతూ కొట్టుమిట్టాడుతుంటాను
ఎలా తెలుసుకొంటుందో ఏమో
ఆమె పరుగు పరుగున వస్తుంది
సరసన చేరి తన లేత అంగుళులతో
ప్రేమగా ఫాలాన్ని స్పృశించి,
నా ముంగురులు సవరించి,
లాలనగా నుదుటిపై ఒక ముద్దు పెట్టి,
జోలపాడి నిద్ర పుచ్చుతుంది
అందుకు ఆమెకు రుణపడి ఉన్నాను .
ఆమె కోసం కావ్యాలు రాసి ఋణం తీర్చుకొంటున్నాను
ఆమె పరుగు పరుగున వస్తుంది
సరసన చేరి తన లేత అంగుళులతో
ప్రేమగా ఫాలాన్ని స్పృశించి,
నా ముంగురులు సవరించి,
లాలనగా నుదుటిపై ఒక ముద్దు పెట్టి,
జోలపాడి నిద్ర పుచ్చుతుంది
అందుకు ఆమెకు రుణపడి ఉన్నాను .
ఆమె కోసం కావ్యాలు రాసి ఋణం తీర్చుకొంటున్నాను
ఎవరు నీవు
నా జ్ఞాపకాల వెనకాల మేలిముసుగు సవరించుకొంటూ
ఎవరు నీవు
నా హృదయఫలకాన రమ్యమైన చిత్తరువు దిద్దుకొంటూ
ఎవరు నీవు 
నా అధరాన మధురానురాగాన అమృతభాండం ఒలికిస్తూ
ఎవరు నీవు
నా ఎద పైన మృదువైన చెక్కిలితో అరుణరాగం రంగరిస్తూ
ఎవరు నీవు
నిలువెల్లా మల్లికా లతికల్లె తమకంతో నన్నల్లుకు పోతూ
ఎవరు నీవు ! ఎవరు నీవు!!
( నా పుప్పొడి రాలిన చప్పుడు -1999 -కావ్యం నుండి 
ఆమె నుదుట అలదిన సిందూర చందనం
అమృతమూర్తి ఆమెకిదే నా అభివందనం
ఆమె హృదయంలో అనంత రాగాలు ఎన్నో
ఆమె కొలువున్న ప్రాంగణం నవనందనం
ఆమె గలగలమని నిండుగా నవ్వుతుంటే
జగతిలోని ప్రతి అణువు కడు సుందరం
ప్రేమ ప్రణయం అనురాగం రంగరించుకున్న
ఆమె మనసే ఒక అందమైన మందిరం
ఒక అతిలోక రహస్యం చెప్పనా ఆమె
అపురూపమైన సృష్టే కదా మనమందరం
అనురాగమయి ఆమె తోడు లేకుంటే కృష్ణా
మగవాని జీవితం అంధకార బంధురం
చిన్ననాడే ఆమె నన్ను కలుసుకున్నది
ఒక వన కన్నియగా తనను తాను పరిచయం చేసుకున్నది
తనతో పూల వనాల వెంట నడవాలని
చేతిలో చెయ్యి వేయించు కున్నది
కెంగేలు పట్టుకొని అందరికి దూరంగా తీసుకెళ్ళి 
పూలతో గాలితో పుప్పొళ్ళతో స్నేహం చేయమన్నది
కాలం కసిరిన వేళ తన ఎదలో నన్ను దాచుకున్నది
జీవితకాలం నన్ను తన జీవన సహచరునిగా చేసుకున్నది
ఆమె పెదవిపై వేణువునై
ఆమె ఒడిలో వీ ణి య నై ఎన్ని విన్యాసాలు చేశానో
ఆమె నుదుట సిందూరాన్నై,
ఆమె సిగలో మందారాన్నై ఎంత సంతసాన్ని మోశానో
ఆమె అందానికి స్పందించి
అనుబంధానికి అచ్చెరు వొంది ఎన్ని కవితలు రాశానో
ఆమె కనుసన్నలలో
అక్కడ కాచిన వెన్నెలలో ఎంత జీవితాన్ని అరబోశానో

నీ వన్నె చిన్నెలు చూచి
వెన్నెల నివ్వెర పోయింది
నీ చెంప కెంపు చూచి
చామంతి చింతాక్రాంతమయింది
నీ నడుము వొంపు చూచి 
సన్నజాజి చిన్నబుచ్చుకొంది
నీ కంటి మెరుపు చూచి
కలువ మనసు కలత చెందింది
నీ పెదవి ఎరుపు చూచి
గులాబీ గుసగుస లాడింది
నీ మేని హొయలు గాంచి
నీలి మొయిలు ఆగి చూచింది
నీ పాద స్పర్శకు
పచ్చిక పరవశించింది
నీ యవ్వన లాస్యం
మందహాసమై చిందులు వేసింది
అందాల ఈ రేయి
మధు మాసమై విందులు చేసింది
ఏరులుగా పారుతున్నది -అవినీతి
ఎవరూ నిరసించరేం ఏం కావాలీ జాతి
----------------------------------------
లాకర్ల నిండా రహస్యంగా నోట్ల కట్టలు 
కుప్పలు తెప్పలుగా పొలాలు పుట్రలు
ఈ భూమిపైన ఎందుకు పుట్టావోగాని
బ్రతుకంతా భయంకరమైన కుట్రలు
అక్రమ సంపాదన ఒక అసుర కేళి
బడబాగ్నిని మరిపించే పడమటి గాలి
కర్మకాలి కారాగారం పంచన చేరితే
చివరకు అతడి బ్రతుకు ఎంత ఎగతాళి
అమాయకంగా కుప్ప పోస్తున్నావు
అనాగరిక మానవుడిలా అనిపిస్తున్నావు
జాతి భవితవ్యాన్ని చిన్నాభిన్నం చేస్తూ
మదోన్మత్త జాగిలంలా కనిపిస్తున్నావు
ఏ మనిషిని తవ్వి చూచినా అవినీతి అక్రమార్జన
ఏ మనసులోకి తొంగి చూచినా ఆరని తీరని వేదన
ఏ పనిమీద వచ్చాడో వీడు ఈ భూమి మీదకి
నిద్ర లేచిన దగ్గరనుంచి పడుతున్నాడు నరకయాతన
తమ కర్తవ్యం మరచిపోయిన ఉద్యోగులు
అడ్డమైన గడ్డితిని అయ్యారు హృద్రోగులు
అక్రమంగా ఎంత సంపాదించినా ఏముంది
వారి జీవితాలు కంపుకొట్టే మురికి వాగులు
అయినా అతంత జీతాలు వస్తుండగా ఎందుకు లంచం
బల్ల కింద చేతులు పెట్టి అడుక్కు తినే ఈ బిచ్చం
రేపు తన బ్రతుకులో చేరి ఏ బడబానలం సృష్టిస్తుందో ఏమో
ఒక్కరైనా తెలుసుకోలేక పోతున్నారు రానున్నఆ భీభత్సం
ప్రతి పనికి ఇంత రేటు అని పలుకుతున్నది
అదికూడా బాహాటంగా నిర్ణయించ బడుతున్నది
అంతా పచ్చి మోసమే బహిరంగ వ్యభిచారమే
ప్రతి కార్యాలయం అవినీతి కంపు కొడ్తున్నది
అవినీతికి అంకితమై పోయిన జాతి
అవనిలో మూట కట్టుకున్నది అపఖ్యాతి
ఎప్పుడు ఎవరు వెలిగిస్తారో మరి
ఈ నేలపైన మరలా అఖండ జ్యోతి ---నా కావ్యం ''గుండె గోడు'' నుండి
---------------నిన్న నెల్లూరులో ఒక అవినీతి తిమింగలం వార్త విని
ఎందుకో మరి ఎంతో ఇష్టం నాకు ఈ ఏకాంతం
ఎందుకంటే ఏమి చెప్పను, ఆమె నా సొంతం
ఎవరికీ కానరాకున్నా ఎప్పుడు వెంట లేకున్నా
ప్రియమైన ఆమెతోనే నా ప్రయాణం జీవితాంతం
అదేమిటో ఆమె ఒక క్షణమైనా కనిపించకుంటే
నన్ను కవ్వించకుంటే అది నాకు యుగాంతం
ఆమె అందం గురించి వివరాలడుగుతున్నారా
ఏమని చెప్పను! ఆ సోయగం విరిసిన లతాంతం
ఒక నిజం చెప్పనా, అసలు రహస్యం తెలుపనా
ఆమె తోడుంటే తరలి వచ్చును నిత్య వసంతం
తరచి తరచి అడిగినా ఇంకేమి చెప్పను కృష్ణా
ఎంత చెప్పినా తరగనిది మా ప్రేమ వృత్తాంతం
అసలు ఎంతకావాలో ఎవరికీ తెలియదు
దానిని ఏం చేసుకోవాలో ఎంతకీ తట్టదు
నిద్ర లేచిన దగ్గరనుంచి పరుగు పందెంలో
ఎవరికీ మంచి ఆలోచన అనేది పుట్టదు
ఈ మనిషి ఎంతగా పతనమై పోతున్నా
బిక్కమొహం వేసుకొన్నఈ దేశం తిట్టదు
ఇంత అన్యాయం అక్రమం దుర్మార్గం
కట్టెదుట కనబడుతున్నా ఎవరికీ పట్టదు
ఈ వికృత విన్యాసాన్ని అరికట్టడానికి
ఏ మంచి హృదయం శ్రీకారం చుట్టదు
ఈ అరాచకం కళ్ళప్పగించి చూస్తుందే గాని
దురాగతానికి ఏ ప్రభుత్వమూ అడ్డుకట్ట కట్టదు
నీ కంటి రెప్ప కింద నా ఈ కాపురం బాగుంది
కమ్మని నీ వలపు, గుడి గోపురం లా ఉంది
నులి వెచ్చని నీ ఊపిరి నాదస్వరం లా ఉంది
నను వలచిన ఈ సిరి మధుఝంకారం లా ఉంది
నను దాచిన నయనం వెన్నెల భువనం లా ఉంది
నీ అల్లరి హృదయం ప్రణయ కవనం లా ఉంది
నిలువెత్తు నీ రూపం కర్పూర దీపం లా ఉంది
కవ్వించే నీ పరువం రతీదేవి రూపం లా ఉంది
వేయేల నా జీవితం మలయమారుతం లాఉంది

ఆమె నవ్వింది
మళ్ళి నవ్వింది
ఇంకా నవ్వుతూనే ఉంది
ఆ నవ్వు అద్భుతమైన కవిత్వం లా ఉంది
అజరామరమైన కావ్యంలా ఉంది 
నాలో ఒక సందేహం సంశయం
ఇంత మంచి కవిత్వం నేను రాయగలనా
అంత గొప్పగా అసలెవరైనా సరే రాయగలరా
ఆమె పడిపడి నవ్వుతూనే ఉంది ఇంకా
పరువం ఒక ప్రవాహం లా కనిపిస్తుంది
సోయగం ఒక సరస్సులా అనిపిస్తోంది
లాలిత్యం లావణ్యం తారుణ్యం ఇనుమడించేలా
ఆమె ఇంకా నవ్వుతూనే వుంది
ఎన్ని కావ్యాలు రాశానో....
చిత్రం ఏ ఒక్కటి ఆ నవ్వుకు సాటి రావు
ఎన్ని గీతాలు రాశానో ..
ఏ ఒక్క గీతం ఆమె అందం ముందు పనికి రాదు
ఆ నవ్వులన్ని తీరిగ్గా ఏరుకొని ఒక్కచోట పేర్చాను
అది అపురూపమైన కావ్యమయింది ..
అదే నా జీవన కావ్యం/
ఒంటరిగా ఉంటానా
నా మనసుతో ఏవో ముచ్చట్లు చెప్పుకొంటూ
నాతో నేను మాటాడుకొంటు
అప్పుడు ఆమె వస్తుంది
చిరు నవ్వు పెదవిపైన వెలిగించుకొని 
నిలదిస్తుంది ఆ ముచ్చటలేవో తనకూ చెప్పమని
మేమిద్దరం మాటల్లో పడి లోకం మాట మాట మరచిపోతాం
అప్పుడు మనసు ఏ చప్పుడు చెయ్యదు
మౌనంగా ఆమె పెదవి కదలికల్ని కంటి పాప విన్యాసాల్ని
మాటల మార్దవాన్ని పరువాల ప్రవాహాన్ని
హావభావాల్ని గమనిస్తుంటుంది
అలా కొన్ని నిముసాలే ఉండి
ఒక చిరుదరహాసం నాకు కానుకగా ఇచ్చి తాను వెళ్ళిపోతుంది
అంత, నాచేత మనసు ప్రణయ కవితలు రాయిస్తుంది
అలా మొలకెత్తినవే ఈ గీతాలు ఈ కవితలు కావ్యాలు
ఆమె సోయగం నా మనసు ముంగిలిలో వెదజల్లినవే ఈ అద్భుతాలు
నా కన్నా నా మనసుకే ఆమెతొ పరిచయం
నా మనసే నిజమైన కవి రచయిత
ఆమె లేకుంటే నాలో ఏమున్నది ఘనత
గులాబిలా
విరబూయాలనుకొంటున్నావా
గుప్పెడు పరిమళాలు
వెదజల్లాలనుకొంటున్నావా
అయితే 
ముళ్ళతో చెలిమి చెయడం
అలవాటు చేసుకో
కడగండ్లతో కల్లోలంతో
కలిసి బ్రతకడం నేర్చుకో
నిన్ను వెంటాడే కష్టాలు నీకు వన్నె తెస్తాయి
కష్టాల కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి
------------------------------------------------------------
నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా
చేతులు సాచి అడుక్కుతింటు జనాన్ని పిక్కు తింటూ
ఎందుకు ఎందుకు ఎందుకు ఈ బ్రతుకెందుకు దండగరా
------------------------------------------------------------

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ...
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని’ ------- సిరివెన్నెల
రక్షణ కొరకు నియమించుకొన్న పోలిసు
ఎందుకంత కర్కశంగా ఉంటున్నాడో కాఠిన్యం ప్రదర్శిస్తాడో
మానవ సేవ మాధవసేవ అంటూ వైద్యులు
రోగుల్ని రకరకాల విద్యలతో ఎందుకు నంజుకు తింటారో
ప్రాణం పోసే వైద్యుడు ఎందుకు నోట్ల కట్టలు పేర్చు కొంటున్నాడో
అంతులేని ఆస్థి పోగుచేసుకొంటు న్నాడో
వేలవేల జీతాలు తీసుకొంటూ
రేపటి పౌరుల్ని తయారు చేసే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మాని
అ దనం ఏం చేయాలో తెలియక ఏ దిక్కు తోచక
ఎందుకు పొలాల్లో తిరుగుతున్నారో, భూ వ్యాపారం చేస్తున్నారో
న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు
తమ ఫీజు న్యాయసమ్మతంగా తీసుకోకుండా కక్షిదారుల్ని పిల్చి పిప్పిచేస్తున్నారో
ప్రజాసేవకై నియమింపబడిన ప్రభుత్వోద్యోగులు
ప్రజల్ని ఎందుకు ఈ సడించు కొంటున్నారో అసహ్యించు కొంటున్నారో హింసిస్తున్నారో
డబ్బు ఇబ్బడిముబ్బడిగా ఉన్న వాళ్ళు
వడ్డీల పేరుతొ పేదప్రజల ప్రాణాలు, రక్తమాంసాలు ఎందుకు తోడేస్తారో
మాయమాటలు చెప్పి, నిన్న కాళ్ళావేళ్ళా పడిన నాయకులు
ఆనక ఆ జనాన్నే గొర్రెల్లా ఎందుకు వెంట తిప్పుకుంటారో
జనం ఎటుపోతేనేం వ్యాపారులకు ధనార్జనే దేయం-
దేశం ఏమైతేనేం నల్లదనం విదేశాలకు తరలించడమే న్యాయం
దేశం అంతటా వాడవాడలా కులం మతం సంకుల సమరం -
సంవత్సరం పొడవునా ఏదో ఒక ఎన్నికల సమరాంగణం
తాము రచించుకున్న రాజ్యాంగం
శాసన సభలకే రుచించదు సయించదు.
దేశమంతటా అసమానతలు అల్లకల్లోలాలు
నిన్న మనం ఎన్నుకున్న నాయకుడు
తెల్లారేసరికి జనాన్ని వంచించి కప్పగంతులు కుప్ప్పిగంతులు
ఇక్కడ ప్రజాస్వామ్యం ధనస్వామ్యం - ఇది అపహాస్యం ,
మామూలు మామూలయి పోయింది
అక్రమ అన్యాయం అధర్మం అతి సహజమయి పోయింది -
విలువలు వలువలు వదిలి శీలానికి అర్ధం మారిపోయింది
ప్రభుత్వాలు ఆర్భాటాల కోసం తన భజన కోసం -
విచ్చలవిడిగా విరివిగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయి
ఎవడికి వాడు స్వంత వ్యాపారంలా
సొంత వ్యవహారంలా అనుకొంటున్నాడు
ప్రజసేవకోసం నియమింప బడ్డామని స్పృహ లేదు
శిక్షిస్తారని భయం లేదు
రాజ్యాంగ సూత్రాలు మరిచిపోయారు --
ఈ ప్రభుత్వాలు నడపడానికి వీళ్లుపనికి రారు
ప్రజలే ఉద్యుక్తులు కావాలి --
అవినీతిపై అప్రమత్తులు కావాలి తిరగబడాలి
అప్పుడే దేశం పురోగమిస్తుంది..
ప్రజలకు శాంతి సుఖం లభిస్తుంది
అనాదిగా నన్ను నడిపిస్తున్న అక్షరానికి నమస్కారం
అక్షరానికి వూపిరులూదుతున్న కలానికి నమస్కారం
రేయిం బవళ్ళు ఎదలో దూరి ఊపిరాడ నీయక
ఉక్కిరి బికిరి చేస్తున్న అందానికి నమస్కారం
చిన్ననాటి నుంచే నన్ను ఇలాగే ఉండమని
తీర్చిదిద్దిన నాన్నగారి సంస్కారానికి నమస్కారం
ఎంతకాలం నుంచో నన్నంటి పెట్టుకొని ఉన్న
ఎనలేని సంత్రుప్తికి ఈ సంపత్తికి నమస్కారం
ఏ ప్రలోభాలకు తల ఒగ్గకుండా జాగ్రత్తగా
నను మలచిన నా హృదయానికి నమస్కారం
ఏ ఒడిదుడుకులు బడబానలనాలు లేకుండా
నన్ను నడిపిస్తున్న కాలానికి నమస్కారం
‘క’నిపించని వాడిని ‘వి’నిపించని వాడిని ‘కవి’ అన్నారు
‘రవి గాంచనిచో కవి గాంచు నెయ్యెడన్ ‘ అని అన్నారు
అది నిజమేనేమో కాని పాపం! ఎంతో కష్టపడి రాసిన
అతని కవిత్వాన్ని తీరిగ్గా ఎవరు చెవియొగ్గి విన్నారు
అతని గుండెగోడు వింటే మనసు వుంటే ఎలుగెత్తకుండా
అన్యాయంపై తిరగబడ కుండా ఎందుకు మిన్నకున్నారు
నిజం చెప్పాలంటే మాయామర్మం ఆరబోసిన ఆ విచిత్ర
కవిత్వం అర్ధంకాక జనం తలలు బాదుకొంటున్నారు
కవులేమో తాము రాసినది జనం మీదకి విసిరేసి
పాఠకులు తమ దాకా ఎదగాలని కోరుకొంటు న్నారు
ఇప్పటికయినా అర్ధమయింది కదా కవివర్యా
అందుకే అర్ధం కాని దేదైనా సరే వ్యర్ధం అన్నారు

ఒక వెన్నెలరేయి
గున్నమావి గుబురుకింద కూర్చుని
దీక్షగా రాసుకొంటున్నాను
ఎదురుగా విరిసిన ఒక మందారం,
కొమ్మ అంచున ఒక సన్నజాజి 
తల పంకిస్తూ నా వంక తదేకంగా చూస్తున్నాయి
తమ సోయగాలు కావ్యంగా రాయమని అడగాలని కాబోలు
అంతలో ఆమె వచ్చింది ఎగిరే పైటను అదుపు చేసుకొంటు,
ఏదో పాటను శృతి చేసుకొంటూ
ఎవరీమె!
ఆ సుమాల మదిలో సందేహం- ఒకింత అసూయ
నా కావ్య నాయిక అన్నాను
మూతి ముడుచుకున్నాయి
అందాలు కుసుమవిలాసాలు పరిమళ విభవాలు
పొందు పరచుకున్న తనను చూచి అసూయ కాబోలు
ఆమె నవ్వింది నర్మగర్భంగా -
నన్ను అల్లుకున్నది నయగారంగా
ఆమె అద్భుత సౌందర్య రాసి
అలసిపోయాను ఎన్నో కావ్యాలు రాసి
నవ్వవు -అదేమి మాయరోగం
ఎప్పుడు చింతలు వంతలు కన్నీళ్ళేనా
నిండుగా హాయిగా నవ్వితే
సొంతం ఔతుంది కదా ఆరోగ్యం
నవ్వు నాలుగు విధాలా చేటు
అది నిన్నటి మాట
నవ్వకుంటే తప్పదు గుండెపోటు
ఇది నేటి మాట
చిరునవ్వు హరివిల్లు వంటిది
మందహాసం మధుమాసం వంటిది
ఆనందం సంతోషం ఉన్నచోట
ఆరోగ్యం, మహాభాగ్యం ఉంటది
నవ్వితే చూడాలని ఉంది
నవ్వరేం ?
నవ్వు దివ్యౌషధం అంటే
నమ్మరేం ?
ఒక చిరునవ్వు
వేల మొహాల్ని వెలిగిస్తుంది
ముఖాలనే కాదు
నిఖిల జగతిని వెలిగిస్తుంది
నవ్వండి
మీ సొమ్మేం పోదు
నమ్మండి
ఒక్క పైసా కూడా వృధా కాదు
కలల బరువుకు రెప్ప వాలి పోతానంటున్నది
కనులు మూ స్తే రేయి కరిగి పోతానంటున్నది
ఎదలోయలలో ఒక వూహ ఉక్కిరిబిక్కిరి చేస్తే
కప్పుకున్న పయ్యెద జారిపోతానంటున్నది
ఎంతకీ రాని అతని కోసం రేయంతా వేచి వేచి
తనువు సాలభంజికలా మారిపోతానంటున్నది
పరువంతో విరహంతో విసిగి వేసారిన మనసు
పూలతో పరిమళాల తో చేరిపోతానంటున్నది
అతని పదధ్వని విని అల్లంత దూరాన ఎదురేగి
పాదాలను నడిపించే రాదారి నౌతానంటున్నది
ఒక్క సారి ఎదురైతే చాలు తనువు పరవశంతొ
అతని నిండు ఎదలో దూరిపోతానంటున్నది
ఎటు పోతోంది ఈ దేశం
రాజకీయం వృత్తి కాదు
ఉద్యోగం కాదు వ్యాపారం అసలే కాదు
ప్రజాసేవకై రాజ్యాంగం రచించిన ఒక మార్గం 
నిజమైన నాయకుడికి ప్రజాసేవే పరమార్ధం
నల్లదనం వెదజల్లి
కల్లబొల్లి మాటలల్లి
ఇల్లిల్లు తిరిగి గడప గడప తొక్కి
ప్రతి వాడి కాళ్ళకు మొక్కి
జనానికి మాయమాటలు చెప్పి
అందలం ఎక్కిన వాడికి
అందలం ఎక్కగానే అదికారం చేజిక్కగానే
పదవి రోగం పట్టుకున్న వాడికి
రాచరికపు హోదాలు బాజబజంత్రిలు భుజకీర్తులు
పత్రికలలో పళ్ళికిలించిన ఫోటోలు పనికిమాలిన వార్తలు
సన్మానాలు సత్కారాలు బ్రహ్మరదాలు వేలు లక్షల జీతాలు
పొలీసు పహారాలు బుగ్గకార్లు చుట్టు ఉన్నతాధికార్లు
ప్రజాధనం నజరానాలు రాచరికపు హోదాలు
నిజానికి నిన్న దాకా అమాయకుడు ,,,
కానీ ఠీకాని లేని అర్భకుడు వీడు
అన్యాయం అక్రమం అధర్మం దుర్మార్గం
దౌర్జన్యం ఒళ్ళంతా పులుముకొని
ప్రజాసేవ అంటూ నేడు అవతారమెత్తిన నాయకుడు
అక్షరజ్ఞానం లేని నిశానిలు
అసెంబ్లీలో కూర్చుంటున్నారు
నువ్వంటే నువ్వు వెధవాయివని
ఒకరినొకరు ఏకిపారేసుకొంటు న్నారు
తమ తమ అక్రమార్జనలు
ఏనాటివో ఏకరవు పెడ్తున్నారు
అశ్లీలభాషణలు ఎక్కుపెద్తున్నారు
అసభ్యంగా దూషించు కొంటున్నారు
ఇవి శాసన సభలా దూషణ సభలా
ఒకరినొకరు తిట్టుకోడానికి కలహాభోజనానికి
ఏర్పరచిన కాలక్షేపానికి వేదికలా
సిగ్గు విడిచి ఇంత రభసలా
దానికి ఇబ్బడిముబ్బడిగా
ఇంత ప్రజాధనం దుర్వినియోగం కావాలా
అసహ్యం వేస్తోంది
ఆగ్రహం పెల్లుబుకుతోంది
ఆవేశం ఉప్పొంగుతోంది
ఎవరిదీ ఈ దోషం
ఎంతకాలం ఈ మోసం
-------------నా కావ్యం '' నువ్వు మనిషివా !!'' నుండి నిన్నటి మొన్నటి శాసనసభ సమావేశాలు చూసి ఒళ్ళు మండి -----
నా మనసెప్పుడూ పాటలు పాడుకొంటూ ఉంటుంది
అక్షరాలతో పదాలతో సయ్యాటలాడుకొంటూ ఉంటుంది
రేయింబవళ్ళు నిర్విరామంగా ఒక అరుణాధరం మీద
కాలాలకు చెరిగిపోని సంతకం చేస్తూ ఉంటుంది
లోకంలో జరుగుతున్న అన్యాయం అక్రమం గురించి
ఒక కావ్యం వ్రాసి అఖిల జనావళికి అంకితం చేస్తూ ఉంటుంది
విపరీతమైన వేదనలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు
ఒక పాటను పట్టుకొని హాయిగా ప్రయాణిస్తూ ఉంటుంది
మనసుకి హృదయానికి సంఘర్షణ జరిగినప్పుడు
ఒక దీర్ఘ కావ్యానికి శ్రీకారం చుడుతూ ఉంటుంది
అందమైన ఊహలలో విహరిస్తూ ఆనంద విహంగాలు ఎగరేస్తూ
మనసు మలినం కాకుండా తనను తాను కాపాడుకొంటూ ఉంటుంది


ఓ ఉగాదీ నీకు స్వాగతం
ఎక్కడా 
పచ్చని చెట్లు కనిపించడం లేదు 
పచ్చ నోట్ల స్వైర విహారం తప్ప 
పచ్చని పొలాలు కనిపించడం లేదు 
పచ్చిక మొలవని బీళ్ళు తప్ప 
పచ్చని జీవితాలు కనిపించడం లేదు 
పరుగులు తీసే యంత్రాలు తప్ప
పచ్చని అందాలు కనిపించడం లేదు 
ప్రేమానుబంధాలు కనిపించడం లేదు 
మమతానురాగాలు వినిపించడం లేదు
ఏరువాకలు లేవు ఎండమావులు తప్ప 
వాన చినుకులు లేవు వడగాడ్పులు తప్ప
ఇక పచ్చని చిలకలకు పాడే కోయిలలకు 
పరుగులు తీసే సెలయేళ్లకు ఆవాస మేది 
పూలకు పరిమళాలకు పరవశాలకు 
ఉగాదులకు ఉషస్సులకు అవకాశమేది
పచ్చదనం కనుమరుగైన జీవితాలలోకి 
ఉగాదు లెలా వస్తాయి 
పైరు పచ్చలు కానరాని పుడమి పైన 
పైర గాలులు ఎలా వీస్తాయి
అయినా ఓ ఉగాదీ నీకు స్వాగతం 
కొత్త చిగురులు తొడిగిన నా జీవన వనిలోకి 
ఓ హేవళంబీ నీకు సాదర ఆహ్వానం 
నవ వికసిత కుసుమ విలాసం నర్తించే 
నా హృదయ ప్రాంగణం లోకి
------------కోరిశపాటి బాలకృష్ణారెడ్డి 
విశ్రాంత న్యాయమూర్తి ఒంగోలు
ఎండలు మండిపోతున్న వేళ ఒక చల్లని వసంత గీతం మీకోసం
మబ్బులు దిగి వచ్చాయి చినుకుల చరణాలతో
గాలులు కదిలోచ్చాయి మమతల గంధాలతో
నింగి వంగి నేలపై
వేణువు లూదింది
అవని గుండె గానమై
ఆమని విరిసింది //
నందనవన సీమలో నడయాడిన మధుమాసం
నవవసంత వేళలో వినిపించిన ఇతిహాసం
చిన్నారి మమత ఒకటి
కళ్ళు తెరుచుకున్నది
కమ్మని చిరు గీత మొకటి
ఒళ్ళు విరుచుకున్నది //
ఆకుపచ్చ నేలంతా కొత్త పూల పరిమళం
ఆదమరచి జగమంతా వూగుతున్న మధువనం
రంగుల లోకమొకటి
కనులముందు వెలసింది
రమ్యమైన గీతమొకటి
రాగదార సాగింది //