ఎందుకో ఈ వేళ
హటాత్తుగా నీ పెదవి గుర్తొచ్చింది
సున్నితంగా మృదువుగా
నా చెంపని తాకినట్టు అనిపించింది
హటాత్తుగా నీ పెదవి గుర్తొచ్చింది
సున్నితంగా మృదువుగా
నా చెంపని తాకినట్టు అనిపించింది
సుతారంగా నా పెదవిని అదిమి
ఒక ముద్దు ఇచ్చినట్టు
నునులేత విరి దళమొకటి
అణువణువును పలకరించి నట్టు
ఎంత లలితంగా
సుందరంగా సుమనోహరంగా
ముగ్ధ మనోహరంగా ఉందొ కదా
ఆ పెదవి వొంపు, ఆ అమరిక
అంతకన్నా అద్భుతం కదా
అపురూపంగా నువ్వు ఇచ్చిన ఈ కానుక
ఒక ముద్దు ఇచ్చినట్టు
నునులేత విరి దళమొకటి
అణువణువును పలకరించి నట్టు
ఎంత లలితంగా
సుందరంగా సుమనోహరంగా
ముగ్ధ మనోహరంగా ఉందొ కదా
ఆ పెదవి వొంపు, ఆ అమరిక
అంతకన్నా అద్భుతం కదా
అపురూపంగా నువ్వు ఇచ్చిన ఈ కానుక
ఆ కంటి పాపల కువకువలు
ఆ కనుల అరమోడ్పులు
ఉచ్చ్వాస నిశ్వాసాల
ఆరోహణలు అవరోహణలు
మెత్తని అణువుల వెచ్చదనాలు
ఈ వేళ నన్ను కరుణించాయి
కొన్ని వేల కాంతి కిరణాలు
నాలోకి నడచి వచ్చాయి
ఆ కనుల అరమోడ్పులు
ఉచ్చ్వాస నిశ్వాసాల
ఆరోహణలు అవరోహణలు
మెత్తని అణువుల వెచ్చదనాలు
ఈ వేళ నన్ను కరుణించాయి
కొన్ని వేల కాంతి కిరణాలు
నాలోకి నడచి వచ్చాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి