అప్పుడే విచ్చిన
కుసుమాలు కొన్ని
నన్ను వెదుక్కొంటూ వచ్చాయి
కుసుమాలు కొన్ని
నన్ను వెదుక్కొంటూ వచ్చాయి
అందమైన పదకవితలు అల్లుతావుగా
వాటిని ఎందరి ఎదలోగిళ్ళ లోనో వెదజల్లుతావుగా
అప్పుడు ఆ కవితల పాదాల దగ్గర
తమకు ఒకింత స్థానం కల్పించమని అర్ధించాయి
వాటిని ఎందరి ఎదలోగిళ్ళ లోనో వెదజల్లుతావుగా
అప్పుడు ఆ కవితల పాదాల దగ్గర
తమకు ఒకింత స్థానం కల్పించమని అర్ధించాయి
ఆ పూలబాలల కోరిక మేరకు
ఒక్కొక్క కవిత సిగలో -ఇలా
ఒక్కొక్క కుసుమాన్ని అలంకరిస్తున్నాను
ఒక్కొక్క కవిత సిగలో -ఇలా
ఒక్కొక్క కుసుమాన్ని అలంకరిస్తున్నాను
విచ్చిన విరిదళాల పరిమళాలతో
రోజు మిమ్మల్ని ఇలా పలకరిస్తున్నాను
రోజు మిమ్మల్ని ఇలా పలకరిస్తున్నాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి