30, అక్టోబర్ 2017, సోమవారం

మల్లెపువ్వు అడిగింది
నిజంగా నాకింత సౌరభం ఉన్నదా
మందారం అడిగింది
నాలో ఇంత మకరంద మాధుర్య మున్నదా
గులాబీ అడిగింది
తనకింత సోయగమున్నదా
చామంతి అడిగింది
తనకింత లావణ్య మున్నదా
మలయానిల మడిగింది
కెరటాలలో ఇంత గమ్మత్తు ఉన్నదా
గాన గాంధర్వ మున్నదా
పున్నమి వెన్నెల అడిగింది
కిరణాలలో నిజంగా ఇంత పులకింత
గిలిగింత ఉన్నదా
ఎందఱో చెప్పగా వింటున్నాము
నీ కావ్యాలనిండా మా సంగతు లేనని
కవితల నిండా అందమైన సరిగమలేనని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి