30, అక్టోబర్ 2017, సోమవారం



అప్పుడప్పుడు 
గుప్పెడు మల్లెలు కోసుకొచ్చి
ఎంత బాగున్నాయో ఈ పరిమళాలు
ఆఘ్రాణించమంటు నా ముందు కుప్ప పోస్తుంది
అప్పుడు ఆమెను బిగికౌగిలిలో గుచ్చి, 
నెమ్మోమును అరచేతులలో బంధించి
నీ పచ్చని మేనిలోని పరిమళాల కన్నా 
ఈ సుమ సౌరభాలు గొప్పవా అంటాను
అది విన్న ఆమె కెంపులీను బుగ్గల్లో 
సిగ్గులు మొగ్గలై విరబూయడం
ఆ దృశ్యం గాంచి ఎదుట ఉన్న మల్లెలు తెల్లబోవడం
అనంతరం అమె నన్ను లతలా అల్లుకోవడం గమనిస్తాను
అదే మీకు వివరిస్తాను వినిపిస్తాను, 
ఆ సంరంభమే ఒక ప్రణయ కావ్యంగా రచిస్తాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి