30, అక్టోబర్ 2017, సోమవారం

ఒక వెన్నెలరేయి
గున్నమావి గుబురుకింద కూర్చుని
దీక్షగా రాసుకొంటున్నాను
ఎదురుగా విరిసిన ఒక మందారం,
కొమ్మ అంచున ఒక సన్నజాజి 
తల పంకిస్తూ నా వంక తదేకంగా చూస్తున్నాయి
తమ సోయగాలు కావ్యంగా రాయమని అడగాలని కాబోలు
అంతలో ఆమె వచ్చింది
ఎగిరే పైటను అదుపు చేసుకొంటు,
ఏదో పాటను శృతి చేసుకొంటూ
ఎవరీమె!
ఆ సుమాల మదిలో సందేహం-
ఒకింత అసూయ
నా కావ్య నాయిక అన్నాను
మూతి ముడుచుకున్నాయి
అపురూప అందాలు
కుసుమవిలాసాలు
పరిమళ విభవాలు
పొందు పరచుకున్న తనను చూచి అసూయ కాబోలు
ఆమె నవ్వింది నర్మగర్భంగా -
నన్ను అల్లుకున్నది నయగారంగా
ఆమె అద్భుత సౌందర్య రాసి
అలసిపోయాను ఎన్నో కావ్యాలు రాసి
Comments
Ramu Dupati ప్రణయకవీశ్వరా!గొనుమ వందనచందనమందజేసెదన్/విందునుగూర్చు కైతలతొ ప్రీతినిబెంచుచుసాగుమెల్లెడన్/అందమునీదుసొంతమయి అందరికిన్ తగుమొజుపెంచదే/సుందరమందహాసరుచి శోభితుడైవెలుంగుమా....
Manage
Srinivas Sankalp అందమంతా కవిత్వంలో ఉంది
Manage
Srinivas Chunduri మనసుకు అల్లుకున్న మధురిమల్ని కావ్యకన్నికగా మలచటoలో మీకు మీరేసాటి అoదుకేమీరు క్రిష్ణు డయ్యారు
ReplyMay 7 at 5:12pmEdited
Manage
Jvv Gayaz nice art
Manage

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి