30, అక్టోబర్ 2017, సోమవారం

గజల్
-------
ఆకాశ మార్గాన వెళ్తూ పలకరించింది నీలి మేఘం
ఆ పిలుపుకు నాలో మొలకెత్తింది ఒక కూనిరాగం
చల్లని గాలులు తాకిన ఆ ఆనంద సందోహంలో
కనులారా చూచి తీరాలి నా అక్షరాల వాయువేగం
అందంగా అల్లిన ప్రణయ కవితలు ప్రేమగీతాలే
నా ఆలోచనలలో నా రచనలలో సింహభాగం
ఎందఱో కవులుండగా ఎన్నెన్నో కావ్యాలుండగా
సౌందర్యసీమల విహరించే నాదే అసలైన వైభోగం
ఎన్నో అక్షరాలూ ఆకర్షణలు నన్ను బులిపించినా
నా హృదయంలో నిరంతరం ఏలనో ఈ ప్రేమ సరాగం
అయినా ఇన్ని విభవాలు ఎదురుగా ఉండగా కృష్ణా !
ఏ మనిషి ఇటువైపు చూడడేమి ఇదేమి మాయరోగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి