జీవిత సత్యం
ఆట ముగిసాక
అందరు అక్కడికి చేరవలసిందే
రాజయినా మంత్రయినా లక్షాదికారయినా
నిరుపేద అయినా బికారి అయినా ఎవరయినా సరే
చివరికి వల్లకాటిలో చేరి చితి మంటల చిటపట వినవలసిందే
అందరు అక్కడికి చేరవలసిందే
రాజయినా మంత్రయినా లక్షాదికారయినా
నిరుపేద అయినా బికారి అయినా ఎవరయినా సరే
చివరికి వల్లకాటిలో చేరి చితి మంటల చిటపట వినవలసిందే
ఈ సత్యం నమ్మి తీరాలి
అది ఎంత చేదయినా బాదాకరమయినా
మనిషి పుట్టుక నాడే మరణం వివరం రాసి ఉంటుంది
ఏ ఆట అయినా మొదలైనాక
ఏదో ఒకనాడు అది తప్పకుండా ముగిసి పోతుంది
అది ఎంత చేదయినా బాదాకరమయినా
మనిషి పుట్టుక నాడే మరణం వివరం రాసి ఉంటుంది
ఏ ఆట అయినా మొదలైనాక
ఏదో ఒకనాడు అది తప్పకుండా ముగిసి పోతుంది
ఈ నిజం తెలియకనే
మధ్య లో ఎన్నో కుతంత్రాలు కుప్పిగంతులు
పరుగులు నురుగులు చిరుగులు
లెక్కకు మించిన ఆస్తులు అప్పగింతలు
మధ్య లో ఎన్నో కుతంత్రాలు కుప్పిగంతులు
పరుగులు నురుగులు చిరుగులు
లెక్కకు మించిన ఆస్తులు అప్పగింతలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి