గజల్
-------
నిన్ను గురించి ఎక్కడో ఎవ్వరో చెప్పుకోవాలి
నువ్వొక్కడివే గొప్ప వాడివి కాదని ఒప్పుకోవాలి
-------
నిన్ను గురించి ఎక్కడో ఎవ్వరో చెప్పుకోవాలి
నువ్వొక్కడివే గొప్ప వాడివి కాదని ఒప్పుకోవాలి
నిన్ను నిన్నుగా గుర్తించని అసూయాపరుడు
ఎదురైనప్పుడు మెలకువగా తప్పు కోవాలి
ఎదురైనప్పుడు మెలకువగా తప్పు కోవాలి
అడ్డ దిడ్డంగా నడిచే వాళ్లకు ఆవారాగాళ్ళకు
నిప్పులాంటి నీ జీవితం కనువిప్పు కావాలి
నిప్పులాంటి నీ జీవితం కనువిప్పు కావాలి
ఎంతటి వాడైనా ఏదో ఒకనాడు తప్పనిసరిగా
తన జీవితాన్ని నగ్నంగా విప్పుకోవాలి
తన జీవితాన్ని నగ్నంగా విప్పుకోవాలి
అవినీతి అధర్మం నిన్ను నీ నిజాయితీని
తట్టుకోలేక భయ భయంగా తప్పుకోవాలి
తట్టుకోలేక భయ భయంగా తప్పుకోవాలి
నీ దివ్య తేజస్సు ను చూచి తట్టుకోలేక
ఓయి కృష్ణా!ఎల్లరు కళ్ళు రెండు కప్పుకోవాలి
ఓయి కృష్ణా!ఎల్లరు కళ్ళు రెండు కప్పుకోవాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి