27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎందుకో మరి ఎంతో ఇష్టం నాకు ఈ ఏకాంతం 
ఎందుకంటే ఏమి చెప్పను, ఆమె నా సొంతం 

ఎవరికీ కానరాకున్నా ఎప్పుడు వెంట లేకున్నా 
ప్రియమైన ఆమెతోనే నా ప్రయాణం జీవితాంతం 

అదేమిటో ఆమె ఒక క్షణమైనా కనిపించకుంటే 
నన్ను కవ్వించకుంటే అది నాకు యుగాంతం 

ఆమె అందం గురించి వివరాలడుగుతున్నారా 
ఏమని చెప్పను! ఆ సోయగం విరిసిన లతాంతం 

ఒక నిజం చెప్పనా, అసలు రహస్యం తెలుపనా 
ఆమె తోడుంటే తరలి వచ్చును నిత్య వసంతం 

తరచి తరచి అడిగినా ఇంకేమి చెప్పను కృష్ణా 
ఎంత చెప్పినా తరగనిది మా ప్రేమ వృత్తాంతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి