27, అక్టోబర్ 2017, శుక్రవారం

చిన్ననాడే ఆమె నన్ను కలుసుకున్నది 
ఒక వన కన్నియగా తనను తాను పరిచయం చేసుకున్నది 
తనతో పూల వనాల వెంట నడవాలని 
చేతిలో చెయ్యి వేయించు కున్నది 
కెంగేలు పట్టుకొని అందరికి దూరంగా తీసుకెళ్ళి 
పూలతో గాలితో పుప్పొళ్ళతో స్నేహం చేయమన్నది 
కాలం కసిరిన వేళ తన ఎదలో నన్ను దాచుకున్నది 
జీవితకాలం నన్ను తన జీవన సహచరునిగా చేసుకున్నది 

ఆమె పెదవిపై వేణువునై 
ఆమె ఒడిలో వీ ణి య నై ఎన్ని విన్యాసాలు చేశానో 
ఆమె నుదుట సిందూరాన్నై,
ఆమె సిగలో మందారాన్నై ఎంత సంతసాన్ని మోశానో 
ఆమె అందానికి స్పందించి 
అనుబంధానికి అచ్చెరు వొంది ఎన్ని కవితలు రాశానో 
ఆమె కనుసన్నలలో 
అక్కడ కాచిన వెన్నెలలో ఎంత జీవితాన్ని అరబోశానో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి