30, అక్టోబర్ 2017, సోమవారం

తీపి తేనియ బరువునే
మోయలేని ఆ పువ్వు
తుమ్మెదనెలా మోసిందో
ఆకాశవీధిలో సంచరించే 
దూది పింజ వంటి ఆ నీలి మేఘం
అంత నీటిని తనలో ఎలా దాచిందో
కంటికి కనిపించని
మలయపవననం
అన్ని పరిమళాల నెలా దూసిందో
చూడడానికి
జానెడైనా లేని ఈ కొమ్మ
బోలెడు కుసుమాలను ఎలా పూచిందో
ఉందో లేదో తెలియని
అంత సన్నని నడుము
అన్ని సోయగాల నెలా ధరించిందోఅంత ఆశ్చర్య మెందుకు కవివర్యా 
నువ్వు మాత్రం తక్కువ తిన్నావా
ఒక్క అందాన్ని అభివర్ణిస్తూ
నీ కలం ఇన్ని కావ్యాలు
ఎలా రాసిందో
రాసులుగా పోసిందో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి