30, అక్టోబర్ 2017, సోమవారం

చుట్టూ పరిసరాలలో ఒక చెట్టయినా కనబడడం లేదు
కనుచూపు మేరలో ఒక పూల మొక్కయినా అగుపడడం లేదు
అయినా ఒక్కసారిగా పూల పరిమళం నన్ను చుట్టూ ముట్టింది
ఉక్కిరిబిక్కిరయ్యాను ఆశ్చర్యపోయాను అవాక్కయ్యాను
స్థాణువైన నన్ను చూచి ఆమె నవ్వింది
ఎక్కడనుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో
సమ్మోహనంగా అలా నవ్వుతూనే సాగి పోయింది
ఓ మల్లె, మందారం నా ముందు నడిచి పోయింది
చిత్రం
ఆమెతో పాటు అంత పరిమళం ఆనందం వెళ్ళిపోయింది
మళ్ళి ఆశ్చర్యపోవడం నావంతయింది
ఆమె జడలో ఒక్క పువ్వయినా లేదు
అమెకురులలో ఎక్కడా విరి దళాల జాడ లేదు
అది ఆమె మేని పరిమళం కాదు కదా
ఆమె సోయగాల సౌందర్య సౌరభం కాదు కదా
ఆమె వెళ్లి పోయింది అంత పరిమళం వెంటబెట్టుకొని
‘’గంధము పూసే వేల కమ్మని మేన -ఆ గంధము నీ మేనితావి కంటె నెక్కుడా ‘’ఎక్కడినుంచో అన్నమయ్య పాట వినిపిస్తోంది లీలగా దూరంగా తన్మయంగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి