11, ఏప్రిల్ 2012, బుధవారం

ప్రేమ గొప్పదనం

Man asked God !
what is the difference between my love and your love ?
God smiled and said....
''A fish in water is my love
A fish in plate is your love ''

మనిషి దేవుణ్ణి నిలదీశాడు
ఏమిటి నీ ప్రేమయొక్క గొప్పదనం ?
మొక్కవోని చిరునవ్వుతో ,
మంద్ర స్వరంతో దైవం అన్నాడు
''హాయిగావిహరించే
జలధి లోని- జలచరం నాప్రేమ
కంచంలో రుచికరంగా
వడ్డించిన-- కొరమీను నీ ప్రేమ ''

సొంతలాభం కొంత మానుకుని
పరులకోసం పాటు పడమని
తన భాగ్యం, తన సౌఖ్యం
అంతులేని దాహం, స్వార్ధం
నాశనానికి హేతువని
నర్మ గర్భంగా వచించాడు
మాయమై పోతున్న మనిషికి
తన కర్తవ్య మేమిటో విశదీకరించాడు
--------------------------
క్షణ భంగురం జీవితం
పరోపకార మిదం శరీరం
-----------------------------

2 వ్యాఖ్యలు:

 1. చూస్తూ ఉండండి! రోజు మీ కవితలు చదివి , నేను కూడా ఒక మంచి కవిత రాసేస్తా త్వరలో! మీ కవితలు చాలా నచ్చుతాయి నాకు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వెన్నెలగారూ !
  కవిత్వం చిక్కనై , మార్మికత ఎక్కువై చదివే వాళ్ళు దూరంగా పారిపోయారు ఈనాడు .
  అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను ,. అదీ కాక కొన్ని పదాలు పరిమళ భరితంగా ఉంటాయి
  అవి చదివిస్తాయి. శబ్ద సౌందర్యం అది సాధిస్తుంది .ఎంతోమంది ఇలాగే అంటున్నారు
  చదివించే గుణం కలిగినది ఏదైనా మంచి కవిత్వం అని నా భావన .మీరు తప్పకుండా ప్రయత్నించండి .
  నా ఇతర రచనలు 'ప్రచురణలు 'లో చూడవచ్చు . మీ స్పందనకు అభినందనలు

  ప్రత్యుత్తరంతొలగించు